చెన్నై: సనాతన ధర్మంపై తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగీ వంటిదని, దాన్ని నిర్మూలించాలని గతంలో ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలకుగానూ స్థాలిన్‌కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో తాజాగా యన చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు.
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన పిలుపుపై క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు. మహిళలపై జరిగిన అణచివేత పద్దతులను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చుకున్నారు. సనాతన ధర్మంపై తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఆ విషయంలో ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.
సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ. పెరియార్, మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి వంటి ద్రావిడ నాయకుల అభిప్రాయాలను తాను ప్రతిధ్వనించానని అన్నారు.
‘మహిళలను చదువుకోవడానికి అనుమతించ లేదు వారు తమ ఇళ్లను వదిలి వెళ్ళలేకపోయారు. ఒకవేళ భర్త చనిపోతే వారు కూడా చనిపోవాలి. వీటన్నింటికీ వ్యతిరేకంగా తంతై పెరియార్ మాట్లాడారు. పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ చెప్పిన దానినే నేను చెప్పాను’ అని ఉదయనిధి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment