ముంబైలో ఉగ్రదాడి జరగుతుందంటూ జాతీయ దర్యాప్తు సంస్థకు బెదిరింపు మొయిల్ వచ్చింది. తాను తాలిబాస్ సభ్యుడనంటూ దర్యాప్తు సంస్థకు ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపాడు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థ మహారాష్ట్రలోని ముంబై పోలీసుల అప్రమత్తం చేసింది. దీంతో పోలీసులు ముంబైలోని వివిధ నగరాలకు హైఅలర్ట్ జారీ చేశారు. బెదిరింపు మెయిల్‌లో గర్తు తెలియని వ్యక్తి తనను తాను తాలిబానీ సభ్యుడిగా పేర్కొన్నాడు.
ముంబైలో ఉగ్రదాడి జరుగుతుందంటూ బాంబు పేల్చాడని పోలీసుల వర్గాలు చెప్పాయి. ఈ మెయిల్ తదనంతరం దర్యాప్తు సంస్థ, ముంబై పోలీసులు సంయుక్తంగా ఇందులో నిజానిజాలను వెలికితీసే పని ప్రారంభించాయి. అంతేగాదు ఆ వ్యక్తి మెయిల్‌లో ముంబైలోని పలు కీలక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు తెలిపినట్లు సమాచారం.
అందులో భాగంగా నగరంలో ఇన్ఫినిటీ మాల్ అంధేరి, పీవీఆర్ మాల్ జుహు, సహారా హోటల్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు భద్రతను కట్టుదిటట్టం చేశారు. ఈ ఏడాది జనవరిలో ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూలకు ఇలానే ఓ బెదిరింపు కాల్ వచ్చింది. అలాగే గతేడాది అక్టోబర్‌లో కూడా ఇదే తరహాలో బెదిరింపు కాల్ వచ్చింది.
(చదవండి: బాల్య వివాహాలపై ఉక్కుపాదం..ఏకంగా 18 వందల మంది అరెస్టు!)
Comments
Please login to add a commentAdd a comment