
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్- కే'పై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలు ఉన్నాయి. అశ్వీనీదత్ వైజయంతి మూవీస్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జులై 20న ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ వేడుకలో 'ప్రాజెక్ట్ కే' టైటిల్‌ను రివీల్ చేస్తామని కూడా ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోండి కానీ...: ఎంఎస్ ధోని)
మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా 'ప్రాజెక్ట్ కే' అంటే ఏమిటి? అంటూ మేకర్స్ ప్రకటన జారీ చేశారు. అందులో భాగంగా ఫ్రీగా టీ షర్ట్స్ ఇస్తున్నామంటూ ప్రచారం కూడా చేశారు. టీ షర్ట్స్ కోసం వైజయంతీ మూవీస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో లింక్‌ను కూడా ఉంచారు. కానీ ఈ విషయంపై అశ్వీనీదత్ వైజయంతి మూవీస్ చేస్తుంది పెద్ద చీటింగ్ అని సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అందుకు సంబంధించి నెట్టింట కామెంట్లు కూడా చేస్తున్నారు. టీ షర్ట్స్ అందుబాటులో ఉంచుతున్నామని ఇప్పటికే మూడు సార్లు లింక్ ఓపెన్ చేసినా ఎలాంటి ఉపయోగం లేదని వారు తెలుపుతున్నారు.
జులై 10న కూడా సాయంత్రం 7:11 నిమిషాలకు లింక్ ఓపెన్ చేశారు. సెకన్ల వ్యవధిలోనే లింక్ ఓపెన్ చేస్తే సర్వర్ ఎర్రర్ అని చూపిస్తుందని ట్వీట్‌లు చేస్తున్నారు. ఎన్నో గంటల పాటు వేచి ఉన్నటువంటి ఫ్యాన్స్‌కు మూడోసారి కూడా నిరాశే ఎదురైందని తెలుపుతున్నారు. జస్ట్ 4 నిమిషాల తర్వాత స్టాక్ అయిపోయిందని ప్రకటించారు. లింకే ఓపెన్ కాలేదు, స్టాక్ అయిపొవడం ఏంటని ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సినిమా ప్రచారం కోసం ఫ్యాన్స్‌తో గేమ్స్ ఆడుతున్నారా..? ఇది పెద్ద స్కామ్, చీటింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా వారు సీరియస్ అవుతున్నారు.
(ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్..?)
అంతేకాకుండా ఇప్పటి వరకు టీ షర్ట్స్ అందినట్లు ఎవరూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా చేయలేదు. దీంతో వీళ్లు నిజంగానే టీ షర్ట్స్ ఇస్తున్నారా? అనే సందేహాలు కూడా వస్తున్నాయని చెబుతున్నారు. మెజారిటీ ఫ్యాన్స్‌కే దక్కలేదు... ఇక సాధారణమైన వాళ్లకు ఏం దక్కింటాయని వారు అంటున్నారు. ఇది కేవలం ప్రమోషనల్ ట్రిక్ అంటూ.. కనీసం వందల్లో కూడా టీ షర్ట్స్ ఇచ్చి ఉండరని ఫ్యాన్స్ వాపోతున్నారు.
Thank you for the BLASTing response for 'The Rise' 💥💥💥
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 10, 2023
After multiple Krashes all stock claimed in 4 minutes.#ProjectK #WhatisProjectK pic.twitter.com/QBPg4JpE6v