Aswini Dutt
-
ఇంద్ర గుర్తుగా.. అశ్వనీదత్‌కు కానుక ఇచ్చిన చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ఇంద్ర సినిమా రీ-రిలీజ్ అయింది. చిరు కెరియర్లో ఇంద్ర సినిమాకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి సినిమాను అందించిన నిర్మాత అశ్వనీదత్‌కు చిరంజీవి విలువైన కానుకను అందించారు. ఎన్నో రికార్డ్స్‌ను కొల్లగొట్టిన ఈ చిత్రాన్ని 4కె వెర్షన్లో వైజయంతి మూవీస్ రీ-రిలీజ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొదటిరోజే ఏకంగా రూ.3.05 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సంతోష సమయంలో ఇంద్ర సినిమాకు పనిచేసిన కీలక వ్యక్తులను చిరంజీవి సత్కరించారు.ఇంద్ర సినిమాలో భాగమైన నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు బి.గోపాల్, సంగీత దర్శకుడు మణిశర్మ, సినీ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, కథ రచయిత చిన్నికృష్ణలను తన ఇంటికి ఆహ్వానించిన చిరు వారిని సత్కరించారు. ఈ క్రమంలో నిర్మాత అశ్వనీదత్‌కు ఒక శంఖాన్ని బహుమతిగా చిరు ఇచ్చారు. తాజాగా ఇదే విషయాన్ని అశ్వనీదత్ తన ఎక్స్ పేజీ ద్వారా ఇలా తెలిపారు. 'మీరు ఈ విజయశంఖాన్ని కానుకగా నాకు ఇచ్చారు ... కానీ ఇంద్రుడై, దేవేంద్రుడై పూరించింది మాత్రం ముమ్మాటికీ మీరే. ఈ కానుక అమూల్యం. ఈ జ్ఞాపకం అపురూపం. అదెప్పటికీ నా గుండెల్లో పదిలం.' అంటూ పేర్కొన్నారు. వైజయంతి మూవీస్‌లో మెగాస్టార్ ఇప్పటి వరకు జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని వుంది,ఇంద్ర, జై చిరంజీవ చిత్రాల్లో నటించారు. అయితే, త్వరలో ఐదో చిత్రం కూడా నిర్మిస్తానని అశ్వనీదత్ ప్రకటించారు.2002 జులై 22 ‘ఇంద్ర’ రిలీజ్ అయింది. మొత్తం 268 స్క్రీన్లలో ఇంద్ర సినిమాని రిలీజ్ చేశారు. 35 కేంద్రాలలో 100 రోజులు, 22 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. చిరు రెమ్యునరేషన్ కాకుండా రూ. 7కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే రూ.50 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. -
చిరంజీవి 'చూడాలని ఉంది' సినిమాకు 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన 'చూడాలని ఉంది' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1998వ సంవత్సరం.. ఆగష్టు 27న విడుదలైన ఈ చిత్రం నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటుంది. అప్పట్లో ఒకే రకం ఫక్తు హీరోయిజం ఉన్న పాత్రల్లో కనిపిస్తున్న చిరంజీవి.. హిట్లర్ నుంచి రూట్ మార్చారు. తన హీరోయిజం పక్కనబెట్టి కాసింత కొత్తదనం ఉన్న కథలను ఎంచుకునే క్రమంలోనే 'చూడాలని ఉంది' సినిమా విడుదల అయింది. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం హైలెట్‌గా నిలిచింది. ఇందులో సౌందర్యతో పాటు అంజల ఝవేరి, ప్రకాశ్‌రాజ్ అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించారు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కూడా ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. అంతలా కథను గుణశేఖర్ రాసుకున్నాడు. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. సినిమా ప్రకటనతో ఫ్యాన్స్‌లో ఆందోళన మెగాస్టార్‌కు స్టార్ ఇమేజ్‌తో పాటు అప్పటికే ఆయన వరుసగా 6 హిట్లు కొట్టి దూసుకుపోతున్నాడు… అందులోనూ టాలీవుడ్లో మాస్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉన్న హీరో... దీంతో ఆయన తర్వాత తీయబోయే సినిమా ఏంటి అని అంతటా చర్చా... ఆ సమయంలో 'చూడాలని ఉంది' అనే క్లాస్ టైటిల్‌తో సినిమా చెయ్యడం ఏంటి..? అది కూడా అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన యంగ్ డైరెక్టర్ అయిన గుణశేఖర్‌కు ఛాన్స్ ఇవ్వడం ఏంటని అప్పట్లో చిరు డై హార్డ్ ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడ్డారు. అంతేకాకుండా సినిమాపై కూడా వారు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. ఎందుకంటే..? ఈ సినిమాకు ముందు రామ్ గోపాల్ వర్మ, సింగీతం శ్రీనివాసరావులతో చిరంజీవి-అశ్వనిదత్‌లు చేయాల్సిన రెండు సినిమాలు స్టార్ట్ అయ్యి అర్థాంతరంగా ఆగిపోయాయి. కానీ మెగాస్టార్ డేట్స్ చేతిలో ఉండి కూడా సినిమా తీయలేకపోతున్నాను అనే బాధ అశ్వనిదత్లో ఉంది. అలాంటి సమయంలో ఒక కథను గుణశేఖర్ ఆయన వద్దకు పట్టుకొచ్చాడు. దీంతో కథ కూడా ఆయనకు నచ్చడం ఆపై వెంటనే చిరంజీవి వద్దకు గుణశేఖర్‌ను పంపించడం వంటివి జరిగిపోయాయి. చిరంజీవిని గుణ కలవడం అదే తొలిసారి కూడా.. కానీ 'చూడాలని ఉంది' అనే టైటిల్‌ను మాత్రం మెగాస్టారే సెలెక్ట్ చేశారని అప్పట్లో గుణ చెప్పాడు. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో కోల్కత్తా బ్యాక్ డ్రాప్లో భారీ అపార్ట్ మెంట్ సెట్‌తో పాటు కొన్ని ఇంటీరియర్స్‌ని ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి నేతృత్వంలో వేశారు. ఇందుకు గాను అప్పట్లో రూ.75 లక్షలు ఖర్చు చేశారు. ఒక సినిమా సెట్ కోసం ఇంత ఖర్చు చేయడం ఏంటని ఇండస్ట్రీలో అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్క సీన్ కోసం రైల్వేస్టేషన్.. సినిమాకు అదే హైలెట్ రైల్వేస్టేషన్లో చిరంజీవి- అంజల ఝవేరి మధ్య లవ్ సీన్ దాదాపు పది నిమిషాలు ఉంటుంది. చిరంజీవికి అసలు డైలాగ్‌లు ఉండవు. ఆయన స్టేషన్లో చైర్ మీద కూర్చొని అమ్మాయిని చూస్తూ ఉంటారు. చిరంజీవికి డైలాగ్ లేకుండా ఒక నిమిషం పాటు సన్నివేశం నడపటం మామూలు విషయం కాదు. అలాంటిది 10 నిమిషాల పాటు ఆ సీన్ రన్ అవుతుంది. ఈ సన్నివేశం తీయడానికి నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు కావాలని గుణశేఖర్ పట్టుబట్టి మరీ నిర్మాత అశ్వనిదత్ను ఒప్పించాడు. అతి కష్టమ్మీద రైల్వే నుంచి అనుమతి లభించడం... ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా చాలా మంది రైళ్లు ఎక్కకుండా స్టేషన్లోనే ఆగిపోయారు. 'చూడాలని ఉంది' సినిమాలో ఇవన్నీ ప్రత్యేకం ► పద్మావతి.. పద్మావతి అనే డైలాగ్‌తో పాటు 'రామ్మా చిలకమ్మా' అనే పాట అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. చిరంజీవికి ఇష్టంలేకపోయినా, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యాన్ని కాదని, ఈ పాట ఉదిత్ నారాయణతో పాడించారు మణిశర్మ. ► చూడాలని ఉంది సినిమాకు రెండు నంది అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను దక్కించుకుంది. ► డైలాగ్ లేకుండా చిరంజీవి- అంజల ఝవేరి మధ్య పది నిమిషాల పాటు లవ్ సీన్.. ఇది వర్కౌట్ అవుతుందా అని షాకైన అశ్వనీదత్.. తర్వాత సినిమాకు ఇదే హైలెట్‌గా నిలిచింది. ► మాస్టర్ సజ్జా తేజ ( ప్రస్తుతం యంగ్ హీరో) ఈ సినిమాతోనే ఎంట్రీ.. మూవీలో అతన్ని స్విమ్మింగ్ పూల్‌లోకి విసిరేసే సీన్ చేయడానికి ప్రకాష్ రాజ్ ఒప్పుకోలేదట. చిన్న పిల్లాడిని అలా విసరడం బాగోదని అనడంతో ఎలాగోలా ఒప్పించి చేయడంతో ఆ సీన్ బాగా క్లిక్ అయింది. ► కలెక్షన్స్ వర్షం కురిపించిన ఈ సినిమా 63సెంటర్స్‌లో వందరోజులకు పైగానే కొనసాగింది. అప్పట్లో ఈమూవీ 20కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలుకొట్టింది ► బాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన దివంగత సరోజా ఖాన్ కోసం ముంబయి వెళ్లగా చిరు సాంగ్‌కి కంపోజ్ అనగానే బిజీగా ఉన్నాసరే ఆమె ఒకే చేసింది. 'ఓ మారియా సాంగ్'కు గాను ఆమెకు నంది అవార్డు వరించింది. ► ఈ సినిమాలో 'రామ్మా చిలకమ్మా' అనే పాట ఉదిత్ నారాయణ్‌కు తెలుగులో మొదటి పాట. ఆ పాట చాలా హిట్ అయ్యింది. ► అల్లు అరవింద్- అశ్వినిదత్ కలిసి 'చూడాలని ఉంది' చిత్రాన్ని 'కోల్‌కతా మెయిల్' పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అందులో హీరోగా అనిల కపూర్ నటించారు. ఈ సినిమాతో చేరో రూ. 6 కోట్లు పోగొట్టుకున్నామని అశ్వినిదత్ తెలిపారు. -
ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 'కల్కి' ఇప్పట్లో రావడం కష్టమే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 AD' సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రలలో నటిస్తుండగా కమల్ హాసన్ విలన్ పాత్రలో మెప్పించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే విడుదలైంది. హాలీవుడ్ రేంజ్లో స్క్రీన్ ప్రజెంటేషన్ ఉంది అంటూ పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీపై వల్గర్ కామెంట్ చేసిన కమెడియన్) కానీ తాజాగా కల్కి సినిమాకు సంబంధించి ఒక విషయం వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది చేదు వార్త అనే చెప్పవచ్చు. ఈ సినిమా విడుదల తేదీని మార్చేస్తున్నట్లు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రం 2024 జనవరి 12న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ తేదీన ప్రేక్షకుల ముందుకు కల్కి రావడం కష్టమేనని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదని సమాచారం. మే 9న 2024 సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చిత్ర నిర్మాత అశ్విన్ దత్ స్వయంగా సినిమా విడుదల తేదీని మార్చినట్లు పలు మీడియాలలో వార్తలు కూడా వస్తున్నాయి. కానీ సినిమా విడుదల తేదీలో మార్పుపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విడుదల తేదీని మార్చడానికి కారణాలు కల్కి 2898 AD విడుదల తేదీని మార్చడానికి ప్రధాన కారణం VFX పనులే అని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి ఎక్కువగా గ్రాఫిక్స్ నిర్మాణ విలువలు ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా భారీ సీన్లన్ని VFX మీదే అధారపడి ఉన్నాయి. ఈ కారణంగానే సినిమా విడుదల తేదీని పొడిగించారని సమాచారం. (ఇదీ చదవండి: అరియానా లుక్‌పై ట్రోల్స్.. ఈ కార్యక్రమం ఏమైనా ప్లాన్ చేశావా అంటూ..?) -
ప్రాజెక్ట్- కే యూనిట్‌పై ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్- కే'పై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలు ఉన్నాయి. అశ్వీనీదత్ వైజయంతి మూవీస్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జులై 20న ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ వేడుకలో 'ప్రాజెక్ట్ కే' టైటిల్‌ను రివీల్ చేస్తామని కూడా ప్రకటించారు. (ఇదీ చదవండి: ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోండి కానీ...: ఎంఎస్ ధోని) మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా 'ప్రాజెక్ట్ కే' అంటే ఏమిటి? అంటూ మేకర్స్ ప్రకటన జారీ చేశారు. అందులో భాగంగా ఫ్రీగా టీ షర్ట్స్ ఇస్తున్నామంటూ ప్రచారం కూడా చేశారు. టీ షర్ట్స్ కోసం వైజయంతీ మూవీస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో లింక్‌ను కూడా ఉంచారు. కానీ ఈ విషయంపై అశ్వీనీదత్ వైజయంతి మూవీస్ చేస్తుంది పెద్ద చీటింగ్ అని సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అందుకు సంబంధించి నెట్టింట కామెంట్లు కూడా చేస్తున్నారు. టీ షర్ట్స్ అందుబాటులో ఉంచుతున్నామని ఇప్పటికే మూడు సార్లు లింక్ ఓపెన్ చేసినా ఎలాంటి ఉపయోగం లేదని వారు తెలుపుతున్నారు. జులై 10న కూడా సాయంత్రం 7:11 నిమిషాలకు లింక్ ఓపెన్ చేశారు. సెకన్ల వ్యవధిలోనే లింక్ ఓపెన్ చేస్తే సర్వర్ ఎర్రర్ అని చూపిస్తుందని ట్వీట్లు చేస్తున్నారు. ఎన్నో గంటల పాటు వేచి ఉన్నటువంటి ఫ్యాన్స్‌కు మూడోసారి కూడా నిరాశే ఎదురైందని తెలుపుతున్నారు. జస్ట్ 4 నిమిషాల తర్వాత స్టాక్ అయిపోయిందని ప్రకటించారు. లింకే ఓపెన్ కాలేదు, స్టాక్ అయిపొవడం ఏంటని ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సినిమా ప్రచారం కోసం ఫ్యాన్స్‌తో గేమ్స్ ఆడుతున్నారా..? ఇది పెద్ద స్కామ్, చీటింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా వారు సీరియస్ అవుతున్నారు. (ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్..?) అంతేకాకుండా ఇప్పటి వరకు టీ షర్ట్స్ అందినట్లు ఎవరూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా చేయలేదు. దీంతో వీళ్లు నిజంగానే టీ షర్ట్స్ ఇస్తున్నారా? అనే సందేహాలు కూడా వస్తున్నాయని చెబుతున్నారు. మెజారిటీ ఫ్యాన్స్‌కే దక్కలేదు... ఇక సాధారణమైన వాళ్లకు ఏం దక్కింటాయని వారు అంటున్నారు. ఇది కేవలం ప్రమోషనల్ ట్రిక్ అంటూ.. కనీసం వందల్లో కూడా టీ షర్ట్స్ ఇచ్చి ఉండరని ఫ్యాన్స్ వాపోతున్నారు. Thank you for the BLASTing response for 'The Rise' 💥💥💥 After multiple Krashes all stock claimed in 4 minutes.#ProjectK #WhatisProjectK pic.twitter.com/QBPg4JpE6v — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 10, 2023 -
నీ బతుకేంటో నాకు తెలుసు.. అశ్వనీదత్‌పై పోసాని ఫైర్
ఏపీలో నంది అవార్డులపై చేసిన కామెంట్స్‌పై నటుడు, నిర్మాత, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి స్పందించారు. అశ్వనీదత్ చేసిన కామెంట్స్‌కు గట్టిగా కౌంటరిచ్చారు. ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అని కాదు.. ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ మోసగాడు అనే అవార్డులు ఇవ్వాలని చురకలంటించారు. ఉత్తమ వెధవలు.. ఉత్తమ సన్నాసులు అని మీ వాళ్లకే అవార్డులు ఇవ్వాలని అన్నారు. మీరంతా ఎందుకు వైఎస్ జగన్ మీద పడి ఏడుస్తున్నారని నిలదీశారు. మీకు ఏమి అన్యాయం చేశారని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబులాగా వెన్నుపోటు పొడిచాడా.. ఎవరికైనా అన్యాయం చేశారో నిరూపించు.. నీ కాళ్లకు మొక్కుతా అని అన్నారు. ఎన్టీఆర్‌ను చెప్పులతో కొట్టినప్పుడు నువ్వేం చేశావు అని ప్రశ్నించారు. నీ బతుకు నాకు తెలుసు.. నా బతుకు నీకు తెలుసు.. ఇప్పటికైనా కొంచెం నీతితో జీవించు అని హితవు పలికారు. పోసాని మాట్లాడుతూ.. 'వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతోంది. రెండేళ్లు కరోనా వచ్చింది. దాని నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకున్నారు. తరువాత దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ఇస్తున్నారు. ఆయన వచ్చిన తరువాత నంది అవార్డులు ఇవ్వలేదు. అవార్డులు ఇస్తే ఎవరూ పేరు పెట్టని విధంగా ఇస్తారు. రజనీకాంత్ రోజూ చెన్నై నుంచి విజయవాడ వచ్చి చంద్రబాబు ను పొగిడినా మాకు అభ్యంతరం లేదు. మాకు సూపర్ స్టార్ చిరంజీవి. చిరంజీవికి జగన్ అంటే ఎంత ప్రేమో.. అలాగే చిరంజీవికి ఎనలేని గౌరవం ఇస్తారు సీఎం జగన్’ అని పోసాని పేర్కొన్నారు. కాగా.. నంది అవార్డులపై అశ్వనీదత్ మాట్లాడుతూ.. ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ.. అనే అవార్డులను ఇస్తారేమో అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. -
హైకోర్టును ఆశ్రయించిన కృష్ణంరాజు, అశ్వనీదత్
సాక్షి, అమరావతి: గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం కృష్ణా జిల్లా కేసరపల్లిలో తమకున్న భూముల్లో ఉన్న నిర్మాణాలకు, పండ్ల తోటలకు ఎలాంటి పరిహారం చెల్లించకుండానే స్వాధీనం చేసుకునేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాప్రయత్నిస్తోందంటూ సీనియర్ నటుడు కృష్ణంరాజు దంపతులు సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, విమానాశ్రయం విస్తరణ కోసం తానిచ్చిన 39 ఎకరాల భూమికి గాను భూ సేకరణ చట్టం కింద రూ.210 కోట్లను చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏఏఐని ఆదేశించాలని కోరుతూ నిర్మాత చలసాని అశ్వనీదత్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరంలో తానిచ్చిన 39 ఎకరాల భూమి ప్రస్తుతం ఎకరా రూ.1.84 కోట్లు చేస్తుందని, భూ సేకరణ చట్టం కింద ఈ మొత్తానికి నాలుగు రెట్లు ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. (చదవండి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారత రత్న!) -
ఇకనుంచి నా ఫ్యాన్స్‌కీ అది మ్యాజికల్ డేట్ అవుతుంది
20 ఏళ్లు.. 25 సినిమాలు. హీరోగా మహేశ్‌బాబు జర్నీ ఇది. ఈ జర్నీలో మహేశ్ ఎప్పటికీ మరచిపోలేని తీయని జ్ఞాపకం ఒకటి ఉంది. ఆ విషయంతో పాటు మహేశ్‌బాబు ఇంకా చాలా విశేషాలు చెప్పారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, ‘దిల్’రాజు, పీవీపీ నిర్మించిన ‘మహర్షి’ ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు చెప్పిన విశేషాలు. ► మహర్షి’ సినిమా చేయడానికి కారణం? కథ విని, చాలా ఎగై్జట్ అయ్యాను. సినిమాలో కాలేజ్ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ అని, కాన్ఫిడెంట్‌గా చేద్దాం అని వంశీ పైడిపల్లితో చెప్పాను. ఎందుకంటే హీరోగా 20 ఏళ్లు పూర్తయింది. 25 సినిమాలు చేశాను. ఇప్పుడు మళ్లీ కాలేజ్ స్టూడెంట్ అంటే నమ్మేలా ఉండాలి. ఆ ఎపిసోడ్ దాదాపు 45 నిమిషాలు ఉంటుంది. అందుకే దాన్ని మేం బాగా డీల్ చేశాం. సినిమాలో అది నా ఫెవరెట్ పోర్షన్. సినిమా చూస్తున్నప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాను. ఆడియన్స్‌కు కూడా తప్పకుండా నచ్చుతుంది. ► వంశీ ఈ కథతో మీ కోసం రెండేళ్లు వెయిట్ చేయడం గురించి? నిజానికి ఓ 20 నిమిషాలు కథ విని వంశీని పంపించేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఆ టైమ్‌లో నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. దాదాపు 40 నిమిషాలు కథ చెప్పాడు. బాగా నచ్చింది. ముందు ఇచ్చిన కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాతే మీ సినిమా ఉంటుంది అని చెప్పాను. ‘పర్లేదు. వెయిట్ చేస్తాను. ఆ వెయిటింగ్ గ్యాప్‌లో కథకు ఇంకా మెరుగులు దిద్దుతాను’ అని చెప్పాడు. మీరు తప్ప ఈ సినిమాలో హీరోగా ఎవరూ కనిపించడం లేదు అన్నాడు. వంశీ కన్విక్షన్‌కు హ్యాట్సాఫ్. అతనితో వర్క్ చేయడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ► 25వ సినిమా ‘మహర్షి’ అని ముందే ప్లాన్ చేశారా? నేను చేయాల్సిన సినిమాలు ఉండటం. వంశీ వెయిట్ చేయడం. ఇలా అన్నీ కలిసి ‘మహర్షి’ నా కెరీర్లో 25వ సినిమా అయింది. 25వ సినిమాగా ఇదే చేయాలని ప్లాన్ చేసి చేయలేదు. ‘మహర్షి’లో మంచి డెప్త్ ఉంది. ఈ మధ్య కాలంలో ఆడియన్స్ ఇలాంటి సినిమాను చూసి ఉండరు. ఫ్యామిలీ ఎమోషన్స్, క్లాస్, మాస్, యూత్.. హీరో ఫ్యాన్స్.. ఇలా అన్ని యాంగిల్స్‌ని కవర్ చేశాడు వంశీ. ► ఈ మధ్య మీరు సోషల్ మేసేజ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది? అదేం కాదు. ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’ సినిమాల్లో మంచి మెసేజ్ ఉంది. అలాంటి సినిమాల్లో నటించడం నాకు హ్యాపీగా ఉంది. అలాగే ‘మహర్షి’ సినిమాలో కూడా ఓ పవర్ఫుల్ పాయింట్ ఉంది. అది ఇప్పుడే చెప్పి ప్రేక్షకుల ఎగై్జట్‌మెంట్ తగ్గించేయను. ► ‘శ్రీమంతుడు’ సినిమాలో దత్తత అనే పాయింట్ ఉంది. ఇందులోనూ అలాంటి పాయింట్ ఏదైనా? ఉంటుంది. ఓ పవర్ఫుల్ పాయింట్‌ను టచ్ చేశాం. సినిమా రిలీజ్ రోజున ఆడియన్స్ ఎగై్జట్ అవుతారని అనుకుంటున్నాం. ఆ పాయింట్ రైతుల సమస్యల గురించా? అనే విషయం ఇప్పుడే చెప్పలేను. థియేటర్స్‌లో చూడాల్సిందే. ► ఈ సినిమాలో మూడు లుక్స్‌లో కనిపిస్తున్నారు. మీ ఫేవరెట్ లుక్ ఏది? ఇంతకు ముందు ఒకే లుక్‌లో సినిమాలు చేస్తున్నానని అన్నారు. ఈ సినిమాలో మూడు లుక్స్ ఉంటాయి. స్టూడెంట్‌లా, రైతులా, బిజినెస్‌మన్‌లా కనిపిస్తాను. ఏ లుక్ ట్రై చేసినా అది ఆ సినిమా, అందులో క్యారెక్టర్ ప్రకారమే ఉంటుంది. అలాగే లుక్ మార్చడమంటే హెయిర్ స్టయిల్ మార్చడం, గడ్డం పెంచడం తప్ప కొత్తగా ఏమీ ఉండదు (నవ్వుతూ). ► ఇది మల్టీ ప్రొడ్యూసర్స్ సినిమా.. అనుకున్న బడ్జెట్ కన్నా కాస్త ఎక్కువైనట్లుంది? అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీగారికి ముగ్గురూ నిర్మించారు. ‘మహర్షి’ చాలా పెద్ద స్కేల్ సినిమా. ఇంత బాగా రావడానికి వాళ్ల ముగ్గురి సపోర్ట్ చాలా ఉంది. సినిమాలో హీరో న్యూయార్క్‌లో సీఈవో. అంటే కార్లు, హెలికాప్టర్లు కావాలి. అప్పుడు అనుకున్నదానికంటే ఖర్చు ఎక్కువ అయ్యింది. ప్రొడ్యూసర్స్ బాగా సపోర్ట్ చేశారు. కొన్ని కీలక సన్నివేశాలను విలేజ్‌లో షూట్ చేద్దాం అనుకున్నాం. కుదర్లేదు. సెట్ వేశాం. ఆ సీన్స్‌లో ప్రతిరోజూ దాదాపు వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులు కావాల్సి వచ్చింది. డిసెంబర్లో షూట్ చేశాం. 5 గంటలకు సూర్యుడు వెళ్లిపోతాడు. లైట్ ఫెయిల్ అవుతుంది. ఆ షెడ్యూల్ మరో పది రోజులు పెరిగింది. ఇలాంటి కారణాలు ఉన్నాయి. ► ఇక మీ నుంచి ఏడాదికి కనీసం రెండు సినిమాలు అశించవచ్చా? ఈ రోజుల్లో సినిమా అనేది టఫ్ టాస్క్ అయిపోయింది. నాన్నగారి టైమ్‌లో 300– 350 సినిమాలు వరకూ చేశారు. ఇప్పుడు 25వ సినిమానే పెద్ద ల్యాండ్‌మార్క్ ఫిల్మ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరో విషయమేటంటే పెద్ద సినిమా చేయాలంటే కనీసం 8 నుంచి 10 నెలలు సమయం పడుతుంది. ఒక పర్ఫెక్ట్ ప్రొడక్ట్ ఇవ్వడానికి అంత సమయం పడుతుంది. పెద్ద సినిమా షూటింగ్ అంటే అన్ని పనులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక పెద్ద సినిమా ఐదారు నెలల్లో వస్తే అద్భుతమే. ‘భరత్ అనే నేను’ తర్వాత నెల రోజుల కంటే ఎక్కువ టైమ్ తీసుకోలేదు నేను. వెంటనే ‘మహర్షి’ స్టార్ట్ చేశాం. ► వంశీతో వర్క్ంగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వంశీ కథ ఎలా చెప్పాడో అలానే తీశాడు. కథను చాలా క్లారిటీగా కమ్యూనికేట్ చేస్తాడు. అది నా పెర్ఫార్మెన్స్ అయినా కూడా కావొచ్చు. బాగా చేశాడు. సినిమా రిలీజైన తర్వాత వంశీకే పేరు వస్తుంది. అంత బాగా తీశాడు. చాలా ఎక్స్ట్రార్డినరీగా తీశాడు. ఈ కథను రెండేళ్లు రాశాడు. స్క్రిప్ట్‌పై ఎంత టైమ్ స్పెండ్ చేస్తే అవుట్‌పుట్ అంత బాగా వస్తుంది అంటాం. ఈ సినిమాకు అలా జరిగింది. ► 20 ఏళ్ల జర్నీ గురించి ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో కొందరు దర్శకులకు థ్యాంక్స్ చెప్పి, కొందరు దర్శకుల పేర్లు ప్రస్తావించకపోవడానికి కారణం? ఆ ఈవెంట్‌కు వచ్చే ముందు దాదాపు 16 గంటలు ప్రయాణం చేసి యూరప్ నుంచి వచ్చాను. స్టేజ్ మీద నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్ వచ్చారు. ఆ హడావిడిలో మర్చిపోయాను. అది నా మిస్టేక్. దర్శకుడు పూరి జగన్నాథ్‌కు థ్యాంక్స్. ‘పోకిరి’ నన్ను సూపర్‌స్టార్‌ని చేసిన ఫిల్మ్. అలాగే దర్శకుడు సుకుమార్‌గారికి థ్యాంక్స్. ‘1: నేనొక్కడినే’ క్లాసిక్ కల్ట్ సినిమా నా కెరీర్లో. వన్నాఫ్ మై ఫెవరేట్ డైరెక్టర్ సుకుమార్. ► అలాగే కొందరు దర్శకులు కథ రెడీ చేసుకున్నాక వెయిట్ చేయలేకపోతున్నారు అనే కామెంట్ కూడా చేశారు? వంశీ రెండేళ్లు వెయిట్ చేశాడని అతన్ని అభినందించడానికి, పొగడటానికి అన్న మాట అది. సుకుమారుగారి గురించి కామెంట్ చేశాననట్లు రాశారు. సుకుమార్‌గారిని పాయింట్ అవుట్ చేసి అన్నది కాదు. సుకుమార్‌గారు నాకు స్పెషల్ డైరెక్టర్. భవిష్యత్‌లో మేం కచ్చితంగా కలిసి సినిమా చేస్తాం. ► హిట్టయిన డైరెక్టర్స్ పేర్లు మాత్రమే ప్రీ–రిలీజ్ వేడుకలో చెప్పారనే విమర్శ ఉంది.. సక్సెస్.. ఫెయిల్యూర్ అని కాదు. నా కెరీర్ గ్రాఫ్‌లో ఈ దర్శకుల సినిమాలు చాలా కీలకం. అందుకే వాళ్ల పేర్లు చెప్పాను. ‘మురారి’ అనే సినిమా నటుడిగా నాకు చాలా క్రూషియల్. మహేశ్ యాక్ట్ చేయగలడు అని చెప్పిన సినిమా అది. ‘ఒక్కడు’ నన్ను స్టార్‌ని చేసింది. ‘అతడు’ సినిమా నాకు యూఎస్‌లో మార్కెట్‌ని ఓపెన్ చేసింది. ‘పోకిరి’ సినిమా తర్వాత సూపర్‌స్టార్ అన్నారు. ఇవన్నీ నాకు ముఖ్యమైన సినిమాలు. ఇప్పుడు నా జర్నీలో ‘మహర్షి’ 25వ సినిమా. అంతేకానీ హిటై్టన డైరెక్టర్స్ పేర్లు చెప్పడమే అని కాదు. ► ‘శ్రీమంతుడు’ సినిమాతో ‘మహర్షి’కి పోలికలు ఉన్నాయి అంటున్నారు? ఈ సినిమాకు, ‘శ్రీమంతుడు’ సినిమాతో సంబంధం లేదు. సినిమా చూస్తే తెలుస్తుంది. టీజర్ అప్పుడు పోల్చి చూశారేమో.. ట్రైలర్ వచ్చిన తర్వాత అలాంటి కామెంట్స్ ఏం వినబడలేదు. ► 25 సినిమాలు చేశారు. మీ కెరీర్లో మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ అంటే ఏది చెప్తారు? నాన్నగారితో ‘మురారి’ మార్నింగ్ షో సినిమా చూశాను. అది కూడా హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో. ‘మురారి’ సినిమా క్లైమాక్స్ తర్వాత నా భుజంపై నాన్నగారు చేయి పెట్టారు. అదే నా మోస్ట్ మెమొరబుల్ మూమెంట్. సినిమా బాగుందా? బాలేదా? అలా ఏం చెప్పలేదు. భుజంపై చేయి వేసి అలా తడిమారు.. అంతే. ‘మహర్షి’ సినిమా గురించి నాన్నగారు ఏం చెబుతారో అని ఇంట్రెస్ట్‌గా వెయిట్ చేస్తున్నాను. ► మే 9న చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి? మే 9 నిజంగా మ్యాజికల్ డేట్. అశ్వనీదత్ గారికి రెండు బ్లాక్‌బస్టర్ సినిమా (జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి)లు ఉన్నాయి. ఇక నుంచి మా అభిమానులకు కూడా ఆ డేట్ మ్యాజికల్‌గా మారబోతోంది. ► బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమాలు అంగీకరిస్తాను అంటున్నారు.. బ్రౌండ్ స్క్రిప్ట్ ముఖ్యం. అరగంట కథ విని ఎగై్జట్ అవ్వడం కన్నా మూడు గంటలు స్క్రిప్ట్ విని చేయడం మంచిది. షూటింగ్‌లోకి దిగిన తర్వాత స్క్రిప్ట్ గురించి మళ్లీ డిస్కషన్స్ ఉండకూడదని నా ఫీలింగ్. నేను గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నాను. ‘స్పైడర్, బ్రహ్మోత్సవం’ సినిమాలు 20 నిమిషాల నరేషన్ విన్నప్పుడు ఎగై్జట్ అయ్యాను. సేమ్ టైమ్ షూటింగ్లో దిగినప్పుడే నాకు తెలిసిపోయింది. మన లోపల ఉన్న భయం చెప్పేస్తుంది. ఆ తప్పులు మళ్లీ రిపీట్ చేయకూడదు అనుకుంటున్నాను. ఇక మీదట డిటైల్డ్ స్క్రిప్ట్ ఉండి.. కథ నచ్చితేనే సినిమా చేస్తాను. ► బోయపాటి శ్రీను, త్రివిక్రమ్, రాజమౌళిలతో మీరు సినిమాలు చేయాల్సి ఉందేమో? రాజమౌళిగారు, నేను ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. కేఎల్ నారాయణగారు నిర్మాత. నా కమిట్మెంట్స్, ఆయన కమిట్మెంట్స్ పూర్తయినప్పుడు మా కాంబినేషన్లో సినిమా ఉంటుంది. త్రివిక్రమ్‌గారితో కూడా చర్చలు జరుగుతున్నాయి. ► హిస్టారికల్ సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉందా? హిస్టారికల్ సినిమాలు చేయాలంటే నాకు భయం. రాజమౌళిగారిలాంటి దర్శకులు కన్విన్స్ చేసినప్పుడు చేస్తాను. ► అడవి శేష్‌తో ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ సినిమా గురించి? అడవి శేష్ ‘గూఢచారి’ సినిమా చూశాను. నచ్చింది. అలాంటి ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనుకున్నాం. సోనీ పిక్చర్స్‌వారు కలసి పని చేద్దాం అని వచ్చారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తాం. నాకు నచ్చిన అన్ని కథలను నేను చేయలేను. వీలైతో వాటిలో కొన్నింటిని నిర్మిస్తాను. ► మీ సినిమాలు వేరే భాషలో విడుదల కాకపోయినా ఒక్క తెలుగులోనే మీ మార్కెట్ 150 కోట్ల వరకూ ఉంటుంది. అది గర్వంగా ఉంటుందా? ప్రౌడ్గాను ఉంది. అలాగే టెన్షన్‌గానూ ఉంది. థియేట్రికల్ బిజినెస్ 130 కోట్లు వరకూ జరిగినప్పుడు కలెక్షన్స్ 150–160 కోట్లు ఉన్నప్పుడే బయ్యర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. అలా ఉండాలంటే సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అయి తీరాలి. వేరే ఆప్షన్ లేదు. ► మేడమ్ తుస్సాడ్స్వాళ్లు తయారు చేసిన మీ స్టాచ్యూ చూసి మీ వైఫ్, పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారు? నమ్రతా రియాక్షన్ కంటే సితార మా పాప రియాక్షన్ మాత్రం ప్రైస్‌లెస్. స్టాచ్యూ అంటే ఏదో అనుకుంది కానీ చూసి షాక్ అయింది. ఫస్ట్ టైమ్ ఆ బొమ్మను చూసినప్పుడు తను ఇచ్చిన రియాక్షన్ మర్చిపోలేనిది. ► దర్శకుడు సుకుమార్‌తో మీ సినిమా సడన్‌గా ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? సుకుమార్‌గారు, నేను ముందు సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ వరుసగా అన్నీ సోషల్ మెసేజ్‌లు, ఇంటెన్స్ సినిమాలు చేస్తున్నాను అనిపించింది. అందుకే అనిల్ రావిపూడిగారి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని అనుకున్నాను. నాకు కొత్తగా, ఫ్రెష్‌గా నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినట్లు ఉంటుందనుకున్నాను. అదే సుకుమార్‌గారితో చెప్పను. చెరో సినిమా చేశాక మళ్లీ కలిసి సినిమా చేద్దామనుకున్నాను. ► అనిల్ రావిపూడి సినిమా మీ ఫ్యాన్స్ సలహా మేరకు అంగీకరించారా? ‘మహర్షి’ తర్వాత అనిల్‌తో సినిమా చేయా లన్నది నా ఛాయిస్. ఆ సినిమా జూన్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ‘దూకుడు’ తర్వాత ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ చేయలేదు. ఇలాంటి సినిమా నేను చేసి చాలా రోజులు అయింది. మైనపు బొమ్మ ఆవిష్కరణలో భార్యాపిల్లలతో మహేశ్ -
వైజయంతీకి వందేళ్ల ప్రయాణం ఖాయం
1973లో మా నాన్నగారు ఇచ్చిన డబ్బును మదరాసు టీ నగర్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కోట్లకు అధిపతిని అయ్యుండేవాడ్ని. డబ్బుల పరంగా బ్యాలెన్స్ షీట్ చూసుకోలేదు. నాకున్న పేరు, ప్రఖ్యాతుల పట్ల హ్యాపీ. ముందు తరం హీరోలతో సినిమాలు తీశాను. ఆ హీరోల కొడుకులు, మనవళ్లతోనూ తీశాను. 45 ఏళ్లయింది ఇండస్ట్రీకి వచ్చి. మరో 55 ఏళ్లు మా పిల్లలు రన్ చేస్తారు. వైజయంతీ మూవీస్ ప్రయాణం వందేళ్లయినా ఆగదని చెప్పడానికి గర్వంగా ఉంది. మా బ్యానర్‌కు ఎన్టీఆర్‌గారు పేరుపెట్టారు. ఆయనకు ధన్యవాదాలు. ‘‘ఇండస్ట్రీలో 45వ ఏట అడుగుపెట్టాను. ‘దేవదాస్’ 52వ చిత్రం. ఈ జర్నీలో తృప్తి, ఆనందం ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోల పేర్లు మాదిరిగానే నా పేరు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోంది. నా ఎదుగుదలలో నా భార్య పాత్ర కూడా ఉంది. పిల్లలు ముగ్గరు అమెరికాలో చదువుకుని ఈ రంగాన్ని ఎంచుకోవడం హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో ఓ ఫైన్ మార్నింగ్ అందర్నీ పిలిచి ‘రిటైర్డ్’ అని చెబుతాను. అందుకు ఎక్కువ టైమ్ కూడా పట్టకపోవచ్చేమో. ఎందుకంటే స్వప్నా అండ్ ప్రియాంకా చాలా స్ట్రాంగ్ అండ్ మోర్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తున్నారు’’ అన్నారు నిర్మాత అశ్వనీదత్. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’. వైజయంతీ మూవీస్, వయాకామ్ 18 మీడియా పతాకాలపై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా అశ్వనీదత్ చెప్పిన విశేషాలు... ∙స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్‌లో నిర్మించిన ‘మహానటి’ మాకు మంచి కమ్‌బ్యాక్ అయింది. ఇప్పుడు మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’ సినిమా చేశాం. ఇద్దరు డిఫరెంట్ వ్యక్తులు కలిసి చేసే ట్రావెల్ ఎలా ఉంటుంది? అన్నదే ఈ చిత్రకథ. నాగార్జున, నాని ఇద్దరూ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు. ‘గుండమ్మకథ’ లాంటి ప్రయత్నం చేశాం. ముందు సినిమా లైన్ సెలక్ట్ చేసుకున్నాం. నాగార్జున, నానీలను శ్రీరామ్ సెలక్ట్ చేశారు. కథ విన్న ఇద్దరు హీరోలు వెంటనే ఓకే అన్నారు. ‘ఆజాద్’ తర్వాత నాగార్జునగారితో సినిమా తీయలేదు. ఇప్పుడు నాగార్జున ఇన్వాల్వ్మెంట్ చూసి కాస్త షాక్ అయ్యాను. సినిమాలో నాని ఇన్వాల్వ్మెంట్ను ‘ఎవడే సుబ్రమణ్యం’ అప్పుడు చూశాను. ఇద్దరి టైమింగ్స్ సూపర్. బాంబే రైటర్ శ్రీధర్ రాఘవన్, భూపతి రాజా, సత్యానంద్, సాయి మాధవ్ బుర్రా బాగా సహకరించారు. మంచి సినిమాలు తీస్తున్న యంగ్ డైరెక్టర్స్‌లో శ్రీరామ్ ఆదిత్య ఒకరు. ఈ సినిమాను బాగా తీశారు. ∙ఈ ‘దేవదాస్’ చిత్రంతో మా బ్యానర్లో మణిశర్మగారు 17 సినిమాలు పూర్తి చేశారు. ఆయన్ను ‘చూడాలని ఉంది’ ద్వారా నేనే ఇంట్రడ్యూస్ చేశాను. ∙కొంతకాలంగా మా బ్యానర్లో హిందీ సినిమాలు చేయడం లేదు. ప్రియాంకా అండ్ స్వప్నా లీడర్షిప్స్లో వైజయంతీ మూవీస్‌లో పలు భాషల్లో సినిమాలు చేయాలని ఉంది. నాగ్ అశ్విన్ (దర్శకుడు, అశ్వనీదత్ అల్లుడు) కూడా ఓ హిందీ, తెలుగు ద్విభాషా చిత్రంపై ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు. హిందీ సినిమాలు కూడా చేయాలని నిర్మాణ సంస్థ వయాకామ్ 18తో అసోసియేట్ అవుతున్నాం.వైజయంతీ మూవీస్‌ను తిరిగి పెంచాలని ప్రియాంకా, స్వప్నా ప్రయత్నం చేస్తున్నారు. స్వప్నా, ప్రియాంకాలు వైజయంతీ మూవీస్‌ను లాక్కోలేదు. హైజాక్ చేశారంటే çకరెక్ట్ (నవ్వుతూ). ∙హీరోనే సినిమా అని నమ్మి నేను సినిమాల్లోకి వచ్చాను. అదే నా స్లోగన్. హీరోలందరూ నాతో ఇష్టంగా ఉంటారు. నేను ఈ హీరోతో సినిమా తీయను అనే పరిస్థితి నాకెప్పుడూ రాలేదు. అంత మంచి వాతావరణంలో సినిమాలు నిర్మించాను. ∙నాకు కెమెరా ముందుకు రావాలనిపించలేదు. డైరెక్షన్ చేయాలనిపించలేదు. అన్నం ఉడికిన తర్వాత ఇది ఉంది.. అది లేదు అని చెప్పడంలో నా జడ్జిమెంట్ ఉంది. వాళ్లు చేయాల్సిన పనిని మనం చేయకూడదన్నదే నా సిద్ధాంతం. ∙సినిమా చేద్దాం అంటే ఏ తల్లిదండ్రులూ ఒప్పుకోరు. కానీ వారిని కన్విన్స్ చేసి విశ్వనాథ్‌గారితో ‘ఓ సీత కథతో’ సినిమా తీశాను. ఆ తర్వాత అభిమాన హీరోలతో సినిమాలు తీశాను. కానీ వాటి మధ్య చిన్న సినిమాలను మరిచిపోలేదు. అన్నీ పోయి ఇంటికెళ్లిపోయే పరిస్థతి వచ్చినప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డిగారితో ‘శుభలగ్నం’ సినిమా తీశాం. ఆ తర్వాత రాఘవేంద్రరావుగారితో తీసిన ‘పెళ్లి సందడి’ కూడా మంచి హిట్. చిన్న సినిమా అయినా,పెద్ద సినిమా అయినా కరెక్ట్ ఎటెమ్ట్ కాకపోతే, స్టోరీ ఆడియన్స్‌కి నచ్చకపోతే, ఆపై మన టైమ్ బాగోలేకపోతే కిందికీ, పైకి వెళ్తాం. ఎప్పుడూ తలదించుకునే సినిమాలు తీయాలనుకోలేదు. తీయగలను అనుకుంటేనే సినిమా తీశా. అందుకే ఏడేళ్ల గ్యాప్ కూడా వచ్చింది. ∙‘మహానటి’ సినిమాకు దాదాపు 17 కోట్లు బడ్జెట్ అవుతుందని స్వప్నా చెప్పింది. లేడీ ఒరియంటెడ్ సినిమాకు అంత బడ్జెట్ ఎక్కువ అనుకున్నాను. కానీ సావిత్రిగారి కథ. ఒకటీ రెండు కోట్ల ఎక్కువైనా పర్లేదు. గ్రాఫిక్స్ దగ్గర కాంప్రమైజ్ కావద్దు. ఆడియన్స్‌కు 1980 ఫీల్‌ను, కథను సరిగ్గా చెప్పకపోతే ఈ సినిమాను తీయవద్దు అని చెప్పాను. దాని కోసం ఏమైనా ఖర్చుపెట్టండి అన్నాను. చివరికి ఆ సినిమా బడ్జెట్ 29 కోట్ల దగ్గర ఆగింది. ∙అప్పట్లో విజయా ప్రొడక్షన్స్, రామానాయుడుగారు, జగపతి పిక్చర్స్ ఇలా ఓ నలుగురైదుగురు మాత్రమే భారీ బడ్జెట్ సినిమాలు తీయగలిగేవారు. ఇప్పుడు అందరూ తీస్తున్నారు. ఇప్పుడు వందకు 90 శాతం మంది అలాగే తీస్తున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ పెరగాలి. ఇప్పుడు నిర్మాతలకు డిజిటల్ రైట్స్, శాటిలైట్స్ రూపంలో మంచి ఆదాయం వస్తోంది. ఇది మంచి పరిణామం. నిర్మాతలకు కాస్త రిస్క్ తగ్గింది. ∙ఆ రోజుల్లో పద్మాలయావారు గొప్ప సినిమాలు తీశారు. కానీ మహేశ్‌బాబును (రాజకుమారుడు) నేను ఇంట్రడ్యూస్ చేశాను. చాలా గౌరవంగా భావించాను. అలాగే హరికృష్ణ కోరిక మేరకు ‘స్టూడెంట్ నెం. 1’ సినిమా తీశాం. చిరంజీవిగారికి పెద్ద బ్యానర్ ఉంది. అల్లు అరవింద్‌కి బ్యానర్ ఉంది. కానీ రామ్‌చరణ్‌ను నేను ఇంట్రడ్యూస్ చేశాను. నాకు, రాఘవేంద్రరావుకి, అరవింద్‌కి మంచి బాండింగ్ ఉంది. నేను, రాఘవేంద్రరావు మాట్లాడుకుని అల్లు అర్జున్‌ని ఇంట్రడ్యూస్ చేద్దామనుకున్నాం. అరవింద్‌కి చెబితే హ్యాపీ ఫీలయ్యారు. చంద్రబాబుగారు రోహిత్‌ను అడిగారు. కొత్తదనానికి, వారసత్వానికి పీట వేసుకుంటూ వచ్చాం. ∙నెక్ట్స్ సినిమా కోసం నాగీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడు. నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ చిరంజీవిగారి కోసమేనా? అంటే ఇప్పుడే చెప్పలేను. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఓ సినిమా స్టార్ట్ చేస్తాం. ఎన్టీఆర్‌తో ఒక సినిమా ఉంది. విజయ్ దేవరకొండతో రెండు సినిమాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ చేసే ఒక సినిమాకు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తారు. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలని ఉంది. -
రాజ్, డీకేలకు గ్రీన్ సిగ్నల్
చకచకా సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తూ... దూసుకుపోతున్నారు మహేష్. ప్రస్తుతం ఆయన ‘1’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ‘ఆగడు’ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేశారు. ఈ సినిమాల తర్వాత క్రిష్ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందని గతంలో వార్తలొచ్చాయి. అయితే... మహేష్ బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెలకు పచ్చజెండా ఊపేశారు. అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ దర్శక ద్వయం మహేష్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్‌ని తయారు చేసే పనిలో ఉన్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందిన ‘రాజకుమారుడు’ చిత్రం ద్వారానే మహేష్ హీరోగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘సైనికుడు’ లాంటి భారీ చిత్రాన్ని కూడా మహేష్‌తో నిర్మించారు అశ్వనీదత్. వైజయంతీ మూవీస్ బేనర్లో మహేష్ నటించనున్న మూడో సినిమా ఇది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుందని సమాచారం.