రాజ్, డీకేలకు గ్రీన్ సిగ్నల్ | Mahesh babu signed new movie with bollywood director raj nidimoru and krishna D.K | Sakshi
Sakshi News home page

రాజ్, డీకేలకు గ్రీన్ సిగ్నల్

Published Sun, Nov 3 2013 11:20 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

రాజ్, డీకేలకు గ్రీన్ సిగ్నల్ - Sakshi

రాజ్, డీకేలకు గ్రీన్ సిగ్నల్

చకచకా సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తూ... దూసుకుపోతున్నారు మహేష్. ప్రస్తుతం ఆయన ‘1’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ‘ఆగడు’ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేశారు. ఈ సినిమాల తర్వాత క్రిష్ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందని గతంలో  వార్తలొచ్చాయి. అయితే... మహేష్ బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెలకు పచ్చజెండా ఊపేశారు. అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 
 
 ప్రస్తుతం ఈ దర్శక ద్వయం మహేష్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్ని తయారు చేసే పనిలో ఉన్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందిన ‘రాజకుమారుడు’ చిత్రం ద్వారానే మహేష్ హీరోగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘సైనికుడు’ లాంటి భారీ చిత్రాన్ని కూడా మహేష్తో నిర్మించారు అశ్వనీదత్. వైజయంతీ మూవీస్ బేనర్లో మహేష్ నటించనున్న మూడో సినిమా ఇది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్కి వెళ్లనుందని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement