మనసు మార్చుకున్న మహేశ్‌.. ఇకపై తన టార్గెట్‌ అదేనట! | Mahesh Babu Focused On Bollywood Market | Sakshi
Sakshi News home page

Mahesh Babu : మనసు మార్చుకున్న మహేశ్‌.. ఇకపై తన టార్గెట్‌ అదేనట!

Published Fri, Jan 21 2022 1:07 PM | Last Updated on Fri, Jan 21 2022 1:14 PM

Mahesh Babu Focused On Bollywood Market - Sakshi

టాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. మన హీరోలు గతంలో నటించిన చిత్రాలు యూట్యూబ్ లో భారీ వ్యూస్ అందుకుంటున్నాయి. దాంతో తెలుగు హీరోలు అక్కడ బాగా పాపులర్ అయిపోయారు. సౌత్ నుంచి నార్త్ కు వెళ్తున్న సినిమాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కూడా బాలీవుడ్‌ వైపు అడుగులు వేస్తున్నారు. సర్కారు వారి పాట మూవీని తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేసేందుకు చర్చలు జరుగుతున్నాయట.

ఇండియాలో హ్యాండ్ సమ్ హీరోస్ లిస్ట్ తీస్తే అందులో టాప్ 5లో లిస్ట్ లో మహేశ్‌ పేరు కూడా ఉంటుంది. కేవలం టాలీవుడ్ మూవీస్ తోనే, బాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు సూపర్ స్టార్. అందుకే ఉత్తరాదిన చాలా మంది హీరోయిన్స్  మహేశ్‌తో నటించాలని ఉందని చాలా సార్లు స్టేట్ మెంట్ ఇచ్చారు. అక్కడి దర్శకులు కూడా ప్రిన్స్ బాలీవుడ్ ఎంట్రీ పై ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు.

పోకిరి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి లాంటి చిత్రాలతో మహేశ్‌ స్టార్ డమ్ గురించి బాలీవుడ్ లో బాగానే డిస్కషన్ జరిగింది. ఒక దశలో ప్రిన్స్ బాలీవుడ్ ఎంట్రీ కన్ ఫామ్ కూడా అయింది. కాని ఎందుకో మహేశ్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు ప్లాన్ మళ్లీ మారింది. మహేశ్‌ బాలీవుడ్ మార్కెట్ పై సీరియస్ గా టార్గెట్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ముందు సర్కారు వారి పాట, ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా, అల్టిమేట్ గా రాజమౌళి మూవీతో అక్కడ ఇండస్ట్రీ కొట్టాలని డిసైడ్ అయ్యాడట ప్రిన్స్. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement