పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 AD' సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రలలో నటిస్తుండగా కమల్ హాసన్ విలన్ పాత్రలో మెప్పించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే విడుదలైంది. హాలీవుడ్ రేంజ్‌లో స్క్రీన్ ప్రజెంటేషన్ ఉంది అంటూ పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు.
(ఇదీ చదవండి: యాంకర్ రష్మీపై వల్గర్ కామెంట్ చేసిన కమెడియన్)
కానీ తాజాగా కల్కి సినిమాకు సంబంధించి ఒక విషయం వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది చేదు వార్త అనే చెప్పవచ్చు. ఈ సినిమా విడుదల తేదీని మార్చేస్తున్నట్లు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రం 2024 జనవరి 12న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ తేదీన ప్రేక్షకుల ముందుకు కల్కి రావడం కష్టమేనని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదని సమాచారం. మే 9న 2024 సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చిత్ర నిర్మాత అశ్విన్ దత్ స్వయంగా సినిమా విడుదల తేదీని మార్చినట్లు పలు మీడియాలలో వార్తలు కూడా వస్తున్నాయి. కానీ సినిమా విడుదల తేదీలో మార్పుపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
విడుదల తేదీని మార్చడానికి కారణాలు
కల్కి 2898 AD విడుదల తేదీని మార్చడానికి ప్రధాన కారణం VFX పనులే అని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి ఎక్కువగా గ్రాఫిక్స్ నిర్మాణ విలువలు ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా భారీ సీన్లన్ని VFX మీదే అధారపడి ఉన్నాయి. ఈ కారణంగానే సినిమా విడుదల తేదీని పొడిగించారని సమాచారం.
(ఇదీ చదవండి: అరియానా లుక్‌పై ట్రోల్స్.. ఈ కార్యక్రమం ఏమైనా ప్లాన్ చేశావా అంటూ..?)
Comments
Please login to add a commentAdd a comment