Prabhas Kalki 2898 AD Movie Postponed Due To The Sentiment, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Kalki 2898 AD Movie Postponed: ప్రభాస్ 'కల్కి' వాయిదా?. అదే ట్రెండ్‌ ఫాలో అవుతున్నారా!

Jul 25 2023 9:41 PM | Updated on Jul 26 2023 10:26 AM

Prabhas Kalki 2898 AD Movie Postponed Due To The Sentiment - Sakshi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ దీపికా పదుకొణె జంటగా తెరకెక్కిస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 AD'. ఇటీవలే ఈ చిత్రానికి టైటిల్‌ రివీల్ చేసిన చిత్రబృందం.. శాన్‌ డియాగో కామిక్ కాన్‌ ఈవెంట్‌లో  గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా వచ్చిన గ్లింప్స్‌ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. 

అయితే ఈ మూవీ రిలీజ్ డేట్‌ ప్రకటిస్తారని ఆశించిన అభిమానులకు చిత్రబృందం పెద్ద షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ కానుందని అభిమానులు భావించగా.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దర్శకధీరుడు రాజమౌళి సైతం ట్వీట్ చేస్తూ రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ చిత్రం ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థమవుతోంది. 

(ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌- లక్ష్మీ ప్రణతి పెళ్లి.. ఆమె ధరించిన చీర ఎన్ని కోట్లంటే?)

ఈ నేపథ్యంలో కల్కికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. రిలీజ్ ప్రకటించకపోవడంతో వాయిదా పడనుందనే వార్తలు వినిపించాయి. మరోవైపు ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని.. మొదటి పార్ట్‌ను మే 9న విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఆ సెంటిమెంట్‌ కోసమేనా?

అయితే మరీ ముఖ్యంగా మే 9వ తేదీ అశ్వనీదత్‌కు చాలా సెంటిమెంట్‌ అని సమాచారం. గతంలో మే9న విడుదలైన మహానటి మళ్లీ బ్లాక్‌ బస్టర్‌ అందించింది.. చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా అదే రోజు రిలీజై వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో ఈ సినిమాకు సైతం ఆయన ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారని భావిస్తున్నారు. దీంతో ఈ సినిమా వాయిదా వేయడమే మంచిదని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్, కోలీవుడ్ స్టార్ కమల్‌హాసన్‌, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 

(ఇది చదవండి: కలెక్షన్స్‌లో 'బేబీ' ఆల్‪‌టైమ్ రికార్డ్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement