
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న 'కల్కి 2898 ఏడీ' థ్రిల్లింగ్ టీజర్‌ను ముందుగా శాన్ డియాగో కామిక్-కాన్‌లో ఆవిష్కరించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ విడుదల కార్యక్రమంలో పాల్గొనకపోవడంపై అమితాబ్ బచ్చన్ తాజాగా తన బ్లాగ్‌లో ఇలా వివరించారు.
(ఇదీ చదవండి: 'గుంటూరు కారం' నుంచి తమన్ ఔట్.. త్రివిక్రమే అసలు సమస్యా?)
'ప్రాజెక్ట్ కె' టైటిల్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఇదొక గ్రేట్ మూమెంట్‌గా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని దర్శకులు నాగ్ అశ్విన్ ఎంతగానో నన్ను కోరారు. కానీ రావాలనే కోరిక ఉన్నా రాలేని పరిస్థితి ఏర్పడింది. ఏం చేద్దాం..? వర్క్, వైద్య పరమైన పరిమితుల వల్ల ఇలాంటి మంచి కార్యక్రమాలకు దూరం కావాల్సి వస్తుంది. 'కల్కి 2898 ఏడీ' గురించి ఒక్కటి మాత్రం చెబుతా. ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఇందులో సంగీతం, ఫ్రేమ్‌లు అన్ని బాగున్నాయి.' అని ఆయన తెలిపారు.
(ఇదీ చదవండి: చంద్రముఖి–2 అభిమానులకు అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్)
అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. హాలీవుడ్ స్థాయిలో రానున్న ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్‌గా కనిపించనున్నారు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొణె నటించనుదంది. 'కల్కి 2898 ఏడీ' గ్లింప్స్ విడుదలైన వెంటనే ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇది విజువల్ వండర్‌గా ఉందని పలువురు ప్రశంసలు కురిపించారు. ఇప్పటి వరకు దీనిని 18 మిలియన్స్ పైగా చూశారు.
Comments
Please login to add a commentAdd a comment