సాక్షి, భూదాన్‌పోచంపల్లి : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించి భువనగిరి ఖిలాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పెద్దరావులపల్లి రజక సంఘం నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ, రూ.3వేల నిరుద్యోగ భృతి, లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు. కార్యకర్తలంతా సమష్టిగా పనిచేసి కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. పోచంపల్లి రెడీమేడ్ వస్త్ర వ్యాపారులు కుంభం సమక్షంలో కాంగ్రెస్ చేరారు.
పార్టీలో చేరిన వారిలో సంగెం రంగులు, రాములు, కిష్టయ్య, యాదయ్య, వెంకయ్య, నర్సింహ, గణేశ్, బాలకృష్ణ, సంజీవ, తోటకూర బాలయ్య, దానయ్య, సంగెం శ్రీను, లింగం, శ్రీకాంత్, నాగేశ్, మహేశ్, మక్తాల కృష్ణ, గుర్రం నర్సింహ, జెల్ల బాలయ్య, భువనగిరి రాములు, కీర్తి భాస్కర్, దోర్నాల బాలరాజు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో తడక వెంకటేశం, కొట్టం కరుణాకర్‌రెడ్డి, భారత లవకుమార్, మలిపెద్ది అంబరీష్‌రెడ్డి, ఎంపీటీసీ ఆర్.సంధ్యాలాలయ్య, గంజి గణేశ్, కందాల గణేశ్, శీలం అంజయ్య, వడకాల రమేష్, బాలకృష్ణ, జంగయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గాన్ని సస్యశామలం చేస్తా
బీబీనగర్ : ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతన్న తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే భువనగిరి నియోజకవర్గాన్ని సస్యశామలం చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని జంపల్లి, గుర్రాలదండి, చిన్న, పెద్ద పలుగుతుండాలతో పాటు ముగ్దుంపల్లి, రావిపహాడ్, మాదారం తదితర గ్రామాల్లో శనివారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని పదేపదే చెప్పుకుంటున్న పైళ్ల శేఖర్‌రెడ్డి ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేశాడని దుయ్యబట్టారు. పబ్లిసిటీ కోసం ప్రజలను మభ్యపెడుతూ నీటి క్యాన్లు, హెల్మెట్లు పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నారాయణరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శ్యామ్‌గౌడ్, జెడ్పీటీసీ బస్వయ్య, ఎంపీటీసీ వెంకటేష్, రామాంజనేయులు, మంగ్తానాయక్, రాజేశ్వర్, రాజేందర్, గోపి, రాములు, రాము, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment