మామిడి పూత, పిందె దశలో సస్యరక్షణకు హోమియో మందులు ఎంతగానో ఉపయోగపడతాయని యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురంలోని అమేయ కృషి వికాస కేంద్రం వ్యవస్థాపకులు, రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి చెబుతున్నారు. ఆయన మాటల్లోనే..
► మామిడి చెట్లకు పూత సరిగ్గా రావాలంటే ZINCUMET-30, MAGPHOS-30, BORAN / BORAX-30 ఆౖఖఅగీ30 మందులను వారం రోజుల వ్యవధిలో 3 సార్లు చొప్పున.. ఒకదాని వెంట మరొకటి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అట్లనే పూత బలంగా రావటం కోసం PULSATILLA-30 ను కూడా పిచికారీ చేసుకోవాలి.
► దోమ నుంచి పూతను, పిందెను కాపాడుకోవడానికి COCCINELLA SEPTE - 30 పిచికారీ చేసుకోవాలి.
► రేగు కాయల పరిమాణంలోకి వచ్చిన మామిడి కాయలు రాలిపోతుంటే BOVISTA -30 పొటెన్సీలో పిచికారీ చేసుకోవాలి. మంచు ఎక్కువగా పడుతుంటే పూత, పిందెను రక్షించుకోవడానికి CUPRUM SULPH-30 పిచికారీ చేసుకోవాలి.
► మంగుతో కాయ నల్లగా మారుతూ ఉంటే, ముడ్డుపుచ్చు (ఆంత్రాక్నోస్)ను నివారించుకోవడానికి ALYSIC ACID-30 CARBOVEG-30 పిచికారీ చేసుకోవాలి.
► కొమ్మెండు తెగులు నుంచి రక్షించుకోవడానికి CUPRUM SULPH-30 పిచికారీ చేసుకోవాలి.
► పాత తోటల్లో మామిడి ఆకులపైన బుడిపెలు (మాల్ ఫార్మేషన్) వస్తే కొమ్మలను కత్తిరించి, దూరంగా తీసుకెళ్లి తగులబెట్టాలి. ఇది అంటు వ్యాధి. అరికట్టకపోతే దిగుబడిపై కూడా ప్రభావితం చూపిస్తుంది. TUJA-200 ను వారంలో 3 సార్లు పిచికారీ చేసుకుంటే పోతుంది.
► కాయ పెరుగుదల మొదటి దశలోAMONIUMPHOS-30 పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత కాయ పెరుగుతున్న దశలో UPHALA-30ను పిచికారీ చేసుకోవచ్చు. ఇది అమేయ కృషి వికాస కేంద్రం రూ΄పొం దించిన మందు. బయట మందుల షాపులో దొరకదు. త్రిబుల్19కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
► మామిడి రైతులకు మరో ముఖ్య సూచన ఏమిటంటే.. 15 రోజులకోసారి నీటి తడులతో పాటు ఎకరానికి 800 నుంచి 1,000 లీటర్ల వరకు గోకృపామృతం పారించుకుంటే.. కాయ పరిమాణం బాగుంటుంది, కాయ రాలకుండా ఉంటుంది. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడొచ్చు. www.youtube.com/@ameyakrishivikasakendram5143
మామిడిలో సస్యరక్షణకు హోమియో మందులు
Published Tue, Feb 14 2023 2:34 AM | Last Updated on Tue, Feb 14 2023 2:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment