bal reddy
-
మామిడిలో సస్యరక్షణకు హోమియో మందులు
మామిడి పూత, పిందె దశలో సస్యరక్షణకు హోమియో మందులు ఎంతగానో ఉపయోగపడతాయని యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురంలోని అమేయ కృషి వికాస కేంద్రం వ్యవస్థాపకులు, రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి చెబుతున్నారు. ఆయన మాటల్లోనే.. ► మామిడి చెట్లకు పూత సరిగ్గా రావాలంటే ZINCUMET-30, MAGPHOS-30, BORAN / BORAX-30 ఆౖఖఅగీ30 మందులను వారం రోజుల వ్యవధిలో 3 సార్లు చొప్పున.. ఒకదాని వెంట మరొకటి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అట్లనే పూత బలంగా రావటం కోసం PULSATILLA-30 ను కూడా పిచికారీ చేసుకోవాలి. ► దోమ నుంచి పూతను, పిందెను కాపాడుకోవడానికి COCCINELLA SEPTE - 30 పిచికారీ చేసుకోవాలి. ► రేగు కాయల పరిమాణంలోకి వచ్చిన మామిడి కాయలు రాలిపోతుంటే BOVISTA -30 పొటెన్సీలో పిచికారీ చేసుకోవాలి. మంచు ఎక్కువగా పడుతుంటే పూత, పిందెను రక్షించుకోవడానికి CUPRUM SULPH-30 పిచికారీ చేసుకోవాలి. ► మంగుతో కాయ నల్లగా మారుతూ ఉంటే, ముడ్డుపుచ్చు (ఆంత్రాక్నోస్)ను నివారించుకోవడానికి ALYSIC ACID-30 CARBOVEG-30 పిచికారీ చేసుకోవాలి. ► కొమ్మెండు తెగులు నుంచి రక్షించుకోవడానికి CUPRUM SULPH-30 పిచికారీ చేసుకోవాలి. ► పాత తోటల్లో మామిడి ఆకులపైన బుడిపెలు (మాల్ ఫార్మేషన్) వస్తే కొమ్మలను కత్తిరించి, దూరంగా తీసుకెళ్లి తగులబెట్టాలి. ఇది అంటు వ్యాధి. అరికట్టకపోతే దిగుబడిపై కూడా ప్రభావితం చూపిస్తుంది. TUJA-200 ను వారంలో 3 సార్లు పిచికారీ చేసుకుంటే పోతుంది. ► కాయ పెరుగుదల మొదటి దశలోAMONIUMPHOS-30 పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత కాయ పెరుగుతున్న దశలో UPHALA-30ను పిచికారీ చేసుకోవచ్చు. ఇది అమేయ కృషి వికాస కేంద్రం రూ΄పొం దించిన మందు. బయట మందుల షాపులో దొరకదు. త్రిబుల్19కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ► మామిడి రైతులకు మరో ముఖ్య సూచన ఏమిటంటే.. 15 రోజులకోసారి నీటి తడులతో పాటు ఎకరానికి 800 నుంచి 1,000 లీటర్ల వరకు గోకృపామృతం పారించుకుంటే.. కాయ పరిమాణం బాగుంటుంది, కాయ రాలకుండా ఉంటుంది. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడొచ్చు. www.youtube.com/@ameyakrishivikasakendram5143 -
విద్యుదాఘాతంతో రైతు మృతి
భువనగిరి: మోటర్ పైపులు బోరుబావిలోకి దించుతున్న సమయంలో విద్యుత్‌తీగలు తగిలి ఓ రైతు మృత్యు వాత పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి మండలం తుక్కపురం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి(38) సాగు కోసం గత నాలుగేళ్లలో పది బోర్లు వేశాడు. అయినా చుక్క నీరు పడలేదు. తాజాగా వేసిన బోరులో నీరు పడటంతో.. మోటర్ బిగించడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు పైపులు పైన ఉన్న హైటెన్షన్ తీగలకు తాకడంతో విద్యుధ్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన నిర్లక్ష్యం!
విద్యుత్ షాక్‌తో యువరైతు మృత్యువాత విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ యువ రైతును బలితీసుకుంది. సర్‌చార్జి చెల్లించలేదని విద్యుత్ సిబ్బంది సరిగా తొలగించని తీగ మృత్యుపాశమైంది. పెద్దేముల్ మండలం నాగులపల్లికి చెందిన బాలపొల్ల మోహన్‌రెడ్డి కుమారుడు బాల్‌రెడ్డి(22) మంగళవారం ఉదయం పసుపు పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. వీరి పొలం పక్కనే ఉన్న ఓ రైతు.. బోరుకు సంబంధించి విద్యుత్ సర్‌చార్జి కట్టకపోవడంతో రెండు రోజుల క్రితం సిబ్బంది కనెక్షన్ తొలగించారు. కట్ చేసిన వైరు మోహన్‌రెడ్డి బోరు వద్ద పడింది. ఇది గమనించని బాల్ రెడ్డికి విద్యుత్ తీగ తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఎదిగిన కొడుకు దూరం కావడంతో కన్నవారు కన్నీరుమున్నీరవుతున్నారు. - పెద్దేముల్ పెద్దేముల్: విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. సర్‌చార్జీ కట్టలేదని విద్యుత్ వైర్ కట్ చేసి తీసుకెళ్లిన విద్యుత్ సిబ్బంది మిగిలిన వైర్ గురించి పట్టించుకోలేదు. ప్రవూదవశాత్తు దాన్ని తాకిని ఓ యుువరైతు అక్కడికక్కడే వుృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నాగులపల్లి గ్రావుంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాగులపల్లికి చెందిన బాలపొల్ల మెహన్‌రెడ్డి, లక్ష్మమ్మల కువూరుడు బాల్‌రెడ్డి(22) వ్యవసాయుం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అరుుతే వీరి పొలానికి ఆనుకొని దాసరి అనంతయ్య పొలం ఉంది. అనంతయ్యు సర్‌చార్జీ కట్టలేదంటూ రెండు రోజుల క్రితం విద్యుత్ అధికారులు ఆ బోరుకు కరెంటును కట్ చేశారు. అరుుతే సర్వీస్ వైర్‌ను కట్ చేసి తీసుకెళ్లిన అధికారులు మిగిలిన వైర్ గురించి పట్టించుకోకపోవడమే కాకుండా స్తంభంపైనుంచి కనెక్షన్‌ను కూడా కట్ చేయులేదు. ఈ మిగిలిన వైర్ బాల్‌రెడ్డి పొలంలో పడింది. మంగళవారం ఉదయం తన పొలంలోని పసుపు పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన బాల్‌రెడ్డి చూడకుండా ఈ వైర్‌ను తాకాడు. దీంతో వెంటనే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే వుృతి చెందాడు. ఈ విషయాన్ని మధ్యాహ్నం వరకు ఎవరూ గమనించలేదు. అదే గ్రామానికి చెందిన మట్ట మల్లప్ప తన పొలం నుంచి ఇంటికి వెళుతూ బాల్‌రెడ్డి వుృతదేహాన్ని గవునించి కుటుంబ సభ్యులకు సవూచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని వుృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల ఆందోళన బాల్‌రెడ్డి వుృతదేహంతో స్థానిక కాంగ్రెస్ నాయుకుల ఆధ్వర్యంలో గ్రావుస్తులు తాండూరు-సంగారెడ్డి రహదారిపై బైఠాయించారు. అధికారుల నిర్లక్ష్యమే బాల్‌రెడ్డి వుృతి కారణమైందని, రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. వుూడు గంటలపాటుధర్నా కొనసాగడంతో రోడ్డుపై ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. తాండూరు రూరల్ సీఐ శివశంకర్ ఘటనా స్థలానికి వచ్చి నచ్చజెప్పినా వారు ఆందోళన విరమించలేదు. ఆందోళనలో జిల్లా డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి తదితరులతోపాటు దాదాపు 100 వుంది గ్రావుస్తులు పాల్గొన్నారు. -
అంత్వార్‌లో సారాను నిషేధిస్తూ తీర్మానం
విక్రయిస్తే ఆందోళన చేస్తామంటూ మహిళల హెచ్చరిక నారాయణఖేడ్ : సారా విక్రయం లేదా తాగడం చేస్తే ఆందోళనలతో పాటు దాడులు చేస్తామని మండలంలోని అంత్వార్ గ్రామానికి చెందిన మహిళలు హెచ్చరించారు. గ్రామస్తులు పాటు ఖేడ్ ఎస్ఐ బాల్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం గ్రామం లో సారా విక్రయాలు జరపరాదని, సారాను తాగరాదని తీర్మానం చేశారు. సారాను విక్రయిస్తే రూ. 5 వేలు, సారా సేవిస్తే రూ.2 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. అనంతరం తీర్మాన పత్రంలో గ్రామస్తుల సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నలుగురు వ్యక్తులు సారాను విక్రయిస్తున్నారన్నారు. దీనికి కారణంగా ఎస్సీ కాలనీ ప్రజలు సారాకు బానిసై రోజూ భార్య బిడ్డలతో గొడ వలు పడుతున్నారని తెలిపారు. గ్రామంలో నాటుసారా విక్రయిస్తున ్నట్లు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. అంతకుముందు గ్రామంలో సారాను పారబోసి నిరసన తెలిపారు. మళ్లీ సారా విక్రయాలు ప్రారంభిస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళలు రాణమ్మ, దుర్గమ్మ, అనిత, జయశీల, కాంతమ్మ, స్వరూపరాణి, శక్కమ్మ, అనితమ్మ, రూథమ్మ, పీరమ్మ, శామమ్మ, పద్మమ్మ, గ్రామ ఎంపీటీసీ డేవిడ్, సర్పంచ్ నిజలింగప్ప, ఉప సర్పంచ్ లింగమ్మ, ఖేడ్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ప్రసన్నకుమార్, గ్రామ పెద్దలు శంకర్రావు పాటిల్, శివరావ్, సాల్మన్, రాములు, వినోద్‌కుమార్, తదితరులు ఉన్నారు. సారాతో కాలనీలో శాంతి లేదు సారాతో మా కాలనీల్లో ప్రశాంతత లేదు. రోజూ ఎవరో ఒకరు సారా తాగి గొడవలకు పాల్పడుతున్నారు. సారా విక్రయాలు నిలిపివేయాలని గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో మహిళలంతా ఏకమై సారాను దూరం చేయాలని తీర్మానం చేశాం. - రాణమ్మ, అంత్వార్ గ్రామ మహిళ కుటుంబాల్లో సారా చిచ్చుపెడుతోంది సారా తాగడంతో కుటుంబాల్లో కలహాలు జరుగుతున్నాయి. సారా తాగిన వారు సైతం అనారోగ్యానికి గురవుతున్నారు. సారా విక్రయాలు లేకపోతే మా గ్రామంలో ఎలాంటి గొడవలు ఉండవనే ఉద్దేశంతో తీర్మానం చేసేందుకు ముందుకు వచ్చాం. మాకు అధికారులు సహకారం కావాలి. - దుర్గమ్మ, మహిళ, అంత్వార్