ప్రాణం తీసిన నిర్లక్ష్యం!
విద్యుత్ షాక్‌తో యువరైతు మృత్యువాత
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ యువ రైతును బలితీసుకుంది. సర్‌చార్జి చెల్లించలేదని విద్యుత్ సిబ్బంది సరిగా తొలగించని తీగ మృత్యుపాశమైంది. పెద్దేముల్ మండలం నాగులపల్లికి చెందిన బాలపొల్ల మోహన్‌రెడ్డి కుమారుడు బాల్‌రెడ్డి(22) మంగళవారం ఉదయం పసుపు పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు.
వీరి పొలం పక్కనే ఉన్న ఓ రైతు.. బోరుకు సంబంధించి విద్యుత్ సర్‌చార్జి కట్టకపోవడంతో రెండు రోజుల క్రితం సిబ్బంది కనెక్షన్ తొలగించారు. కట్ చేసిన వైరు మోహన్‌రెడ్డి బోరు వద్ద పడింది. ఇది గమనించని బాల్ రెడ్డికి విద్యుత్ తీగ తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఎదిగిన కొడుకు దూరం కావడంతో కన్నవారు కన్నీరుమున్నీరవుతున్నారు.
- పెద్దేముల్
పెద్దేముల్: విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. సర్‌చార్జీ కట్టలేదని విద్యుత్ వైర్ కట్ చేసి తీసుకెళ్లిన విద్యుత్ సిబ్బంది మిగిలిన వైర్ గురించి పట్టించుకోలేదు. ప్రవూదవశాత్తు దాన్ని తాకిని ఓ యుువరైతు అక్కడికక్కడే వుృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నాగులపల్లి గ్రావుంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాగులపల్లికి చెందిన బాలపొల్ల మెహన్‌రెడ్డి, లక్ష్మమ్మల కువూరుడు బాల్‌రెడ్డి(22) వ్యవసాయుం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అరుుతే వీరి పొలానికి ఆనుకొని దాసరి అనంతయ్య పొలం ఉంది.
అనంతయ్యు సర్‌చార్జీ కట్టలేదంటూ రెండు రోజుల క్రితం విద్యుత్ అధికారులు ఆ బోరుకు కరెంటును కట్ చేశారు. అరుుతే సర్వీస్ వైర్‌ను కట్ చేసి తీసుకెళ్లిన అధికారులు మిగిలిన వైర్ గురించి పట్టించుకోకపోవడమే కాకుండా స్తంభంపైనుంచి కనెక్షన్‌ను కూడా కట్ చేయులేదు. ఈ మిగిలిన వైర్ బాల్‌రెడ్డి పొలంలో పడింది. మంగళవారం ఉదయం తన పొలంలోని పసుపు పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన బాల్‌రెడ్డి చూడకుండా ఈ వైర్‌ను తాకాడు.
దీంతో వెంటనే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే వుృతి చెందాడు. ఈ విషయాన్ని మధ్యాహ్నం వరకు ఎవరూ గమనించలేదు. అదే గ్రామానికి చెందిన మట్ట మల్లప్ప తన పొలం నుంచి ఇంటికి వెళుతూ బాల్‌రెడ్డి వుృతదేహాన్ని గవునించి కుటుంబ సభ్యులకు సవూచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని వుృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
గ్రామస్తుల ఆందోళన
బాల్‌రెడ్డి వుృతదేహంతో స్థానిక కాంగ్రెస్ నాయుకుల ఆధ్వర్యంలో గ్రావుస్తులు తాండూరు-సంగారెడ్డి రహదారిపై బైఠాయించారు. అధికారుల నిర్లక్ష్యమే బాల్‌రెడ్డి వుృతి కారణమైందని, రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. వుూడు గంటలపాటుధర్నా కొనసాగడంతో రోడ్డుపై ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. తాండూరు రూరల్ సీఐ శివశంకర్ ఘటనా స్థలానికి వచ్చి నచ్చజెప్పినా వారు ఆందోళన విరమించలేదు. ఆందోళనలో జిల్లా డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి తదితరులతోపాటు దాదాపు 100 వుంది గ్రావుస్తులు పాల్గొన్నారు.