Power authorities
-
వందేళ్లకు సరిపడా విద్యుత్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు 33 వేల మెగావాట్ల సామర్థ్యం గల 29 చిన్న జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో వందేళ్లకు సరిపడా విద్యుత్ లభించే వీలుంది. సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం నియమించిన టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్, వ్యాప్కోస్ సంస్థలు క్షేత్ర స్థాయి అధ్యయనం తర్వాత రాష్ట్ర సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన (నెడ్‌క్యాప్) సంస్థ ఎమ్డీ రమణారెడ్డికి ముసాయిదా నివేదిక అందజేశాయి. దీనిపై ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబుతోపాటు పలువురు విద్యుత్ అధికారులు విజయవాడలోని విద్యుత్ సౌధలో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. కొండ కోనల నుంచి కాంతులు - సముద్రం పాలవుతున్న వాగులు, వంకలు, జలపాతాల్లో నీటి లభ్యత ఉన్న ప్రాంతంలో మినీ హైడల్స్ ఏర్పాటు చేస్తారు. ఇలాంటివి రాష్ట్రంలో 30 ప్రాంతాలను గుర్తించారు. ఇందులో 29 అనుకూలంగా ఉన్నాయని తేల్చారు. - మినీ హైడల్ విద్యుత్ ప్లాంట్లను రెండు కేటగిరీలుగా విభజిస్తారు. ఆన్ రివర్ విధానంలో.. పారే నదిపై కొత్తగా రిజర్వాయర్ నిర్మిస్తారు. కిందకెళ్లే నీటిని రిజర్వాయర్‌లోకి రివర్స్ పంపింగ్ విధానంలో పంపి నిల్వ చేస్తారు. ఆఫ్ రివర్ విధానంలో.. డొంకలు, వాగులు, జలపాతాలను ఎంపిక చేస్తారు. ఎగువ, దిగువ భాగంలో రెండు రిజర్వాయర్లు నిర్మించి నీటిని మళ్లిస్తారు. - విద్యుత్ ఉత్పత్తి తర్వాత నీరు కింద ఉన్న రిజర్వాయర్‌లోకి వెళ్తుంది. మళ్లీ దీన్ని ఎగువ రిజర్వాయర్‌కు పంప్ చేస్తారు. ఇలా 25 చోట్ల ఏర్పాటు చేసే వీలుంది. - డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మినీ హైడల్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. చౌకగా లభించే సౌర విద్యుత్‌ను రివర్స్ పంపింగ్ కోసం ఉపయోగిస్తారు. పెట్టుబడి మాటేంటి ఈ ప్రాజెక్టుకు రూ.లక్షా 25 వేల కోట్ల నిధులు అవసరం. వీటిని పలు ఆర్థిక సంస్థల ద్వారా సమకూర్చుకునే వీలుంది. వాస్తవానికి మినీ హైడల్ నిర్మాణ వ్యయం మెగావాట్‌కు కనీసం రూ.5 కోట్లు అవుతుందని అంచనా. థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు వెచ్చించే సొమ్మును మినీ హైడల్‌కు ఖర్చు చేస్తే భారీ ప్రయోజనం ఉంటుంది. మంచి ఆలోచన వచ్చే పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మరో 10 వేల మెగావాట్లు పెరుగుతుంది. భవిష్యత్ తరాలకు విద్యుత్ కోతలు లేకుండా చేసేందుకు మినీ హైడల్స్ ఉపయోగపడతాయి. వందేళ్లకు సరిపడా విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవచ్చు. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి ఇది ఆదాయం కూడా.. 32,740 మెగావాట్ల మినీ హైడల్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. ముసాయిదా నివేదికను పరిశీలించి, తుది నివేదికను ప్రభుత్వానికి త్వరలో సమర్పిస్తాం. ప్రైవేటు సంస్థలు ముందుకొస్తే ప్లాంట్లు నిర్మించుకునే వీలు కల్పిస్తాం. మన వనరులు వాడుకున్నందుకు వాళ్లు చెల్లించే మొత్తం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. – రమణారెడ్డి, నెడ్‌క్యాప్ ఎండీ -
మేమేం చేశాం నేరం..!
సాక్షి, మద్నూర్(కామారెడ్డి) : గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మేం ఏం తప్పు చేశామని అధికారులు మాకు ఈ శిక్ష వేస్తున్నారు.. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మద్నూర్ మండలంలోని సోమూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 48 గంటల నుంచి గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేదని, దీంతో తాగునీటికి తంటాలు పడుతున్నామని వారు వాపోయారు. గ్రామస్తులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులపై గ్రామస్తులు దాడి చేయడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆది, సోమవారం రెండు రోజులుగా నిరంతరంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌కో సిబ్బందిపై ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దాడి చేస్తే పూర్తిగా ఊరందరికి శిక్ష ఎందుకు వేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌కో అధికారులపై దాడి చేసిన ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని, కాని ఉళ్లో ఉన్న అందరి ఇళ్లకు కరెంట్ నిలిపివేయడంపై వారు మండిపడుతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీరు దొరకడం లేదని వారు వాపోయారు. గ్రామ శివారులోని వ్యవసాయ బోరు వద్ద నుంచి తాగునీటిని తెచుకోవాల్సిన దుస్థితి నెలకొందని మహిళలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. చీకట్లో ఆరుబయట నిద్రిస్తున్న ప్రజలు ఫోన్లన్నీ స్విచ్ఆఫ్లోనే.. రెండు రోజులుగా గ్రామానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఊర్లో ఉన్న ఫోన్లన్నీ స్వీచ్ఆఫ్లోనే ఉన్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో ఎవరికైనా ఫోన్లు చేయాల్సి వస్తే పక్క గ్రామాలకు వెళ్లి ఫో న్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయా రు. రాత్రి సమయాల్లో ఉక్కపోత మరోవైపు దోమలతో జాగారం చేయాల్సివస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. చిన్న పిల్లలు ఫ్యాన్లు తిరగనిదే పడుకోవడం లేదని తెలిపారు. ఆరుబయట నిద్రి ద్దామంటే వర్షపు చినుకులు పడుకోనివ్వడం లేద ని చెబుతున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై మద్నూర్ ట్రాన్స్‌కో ఏఈ అరవింద్ ను సంప్రదించగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే కరెంట్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు ఉన్నాయని, త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. రెండు రోజులుగా కరెంట్ కట్ రెండు రోజులుగా కరెంట్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. తాగునీటి కోసం వ్యవసాయ బోర్లకు వెళ్లాల్సి వస్తోంది. వేసవికాలంలో కూడా వ్యవసాయ బోరు వద్దకు వెళ్లలేదని, కానీ ఇప్పుడు వెళ్లాల్సి వస్తోంది. వారు చేసిన తప్పుకు శిక్ష మేం అనుభవించడం న్యాయమా..? –గంగారాం పటేల్, గ్రామస్తుడు, సోమూర్ తాగునీటికి ఇబ్బందులు 48 గంటలుగా మా గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. సెల్ఫోన్లు అన్ని స్విచ్ఆఫ్ అయ్యాయి. చిన్న చిన్న వ్యాపారులు కష్టాలు పడుతున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి. –ఆనంద్, సోమూర్ -
'కేసీఆర్‌కు ఇండియా బుల్స్‌పై ఎందుకంత ప్రేమ?'
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ నేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. 24 గంటల విద్యుత్ వెలుగుల వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చీకటి ఒప్పందాలున్నాయని ఆరోపించారు. రైతుల కోసం ఎంతైనా విద్యుత్ కొనుగోలు చేస్తామనే హామీ వెనుక రైతులపై ప్రేమ లేదని, కమీషన్‌పై మాత్రమే ప్రేమ ఉందన్నారు. తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని కేంద్రం చెబుతున్నా ప్రభుత్వం మాత్రం ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందాలు చేసుకుందని, అవన్నీ కూడా కమీషన్ కోసమేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన, ప్రారంభించబోతున్న విద్యుత్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏం అన్నారంటే.. 'ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు వెనుక అంతర్యం ఏమిటో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. విద్యుత్ తక్కువ ధరకు అందించడానికి అనేక సంస్థలు ఉన్న ఎందుకు అధిక ధరలకు కొంటున్నారు. విద్యుత్ ఒప్పందాల కొనుగోళ్లను బయటపెట్టాలి. అఖిలపక్షం నిర్వహించి విద్యుత్ కొనుగోళ్ల విషయం బయటకు చెప్పాలి. 24 గంటల విద్యుత్ కొనుగోళ్ల వెనుక అక్రమాలు జరుగుతున్నాయి. మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలనే పక్కనబెట్టారు. 24 గంటలు నిరంతర కరెంటు ఇస్తామని ముఖ్యమంత్రి డబ్బాలు కొడుతున్నారు. కానీ, కొడంగల్ నియోజకవర్గంలో 18 తండాలకు నేటికి కరెంటు లేదు. సొంత శాఖలో పరిస్థితులను కూడా తెలియకుండా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై బహిరంగ చర్చుకు కాంగ్రెస్ సిద్ధం. విద్యుత్ మంత్రి బహిరంగ చర్చకు రావాలి. తెలంగాణకు చెందిన రాజస్తాన్ క్యాడర్ ఐఏఎస్ రమేష్ సేవచేయడానికి వస్తే ఆయనను తిరిగి పంపించారు. తెలంగాణ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం సరిగా లేదన్నందుకు ఆయన్ను శంకరిగిరి మాన్యాలకు పంపించారు. ఇండియా బుల్స్ కంపెనీని కాపాడటానికి రోజువారీ కొనుగోళ్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఇండియా బుల్స్‌పై కేసీఆర్‌కు ప్రేమేందుకు పుట్టిందో చెప్పాలి. గుజరాత్ చెందిన కంపెనీపై ఎందుకు జాలి చూపిస్తున్నారో వెల్లడించాలి' అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. -
పూరింటికి రూ.18 లక్షల కరెంటు బిల్లు
రావికమతం: ఏపీలో అదో పూరిల్లు.. అందులో ఉన్నవి రెండు బల్బులు, ఒక ఫ్యాన్.. మరి ఆ ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు ఎంతో తెలుసా.. అక్షరాలా 18,68,026 రూపాయలు. ఏంటీ.. ఈ అంకెలు చూడగానే షాక్ తిన్నారా! ఆ ఇంటి యజమానురాలి పరిస్థితీ అదే. విశాఖ జిల్లా రావికమతం మండలం దొండపూడి గ్రామానికి చెందిన గొంతిన దేముళ్లమ్మ (60) కుమారుడితో కలసి పూరిపాకలో నివసిస్తోంది. రెండు బల్బులు, ఒక ఫ్యాన్ మాత్రమే ఉన్న ఆ ఇంటికి ప్రతి నెలా రూ.50-60 మధ్య బిల్లు వస్తుంటుంది. ఇదిలాఉండగా జనవరి నెలకు సంబంధించి ఈ నెలలో బిల్లు వచ్చింది. ఎప్పటిలాగే బిల్లు మొత్తం ఉంటుందన్న ధీమాతో ఆమె బిల్లులోని అంకెలను గమనించలేదు. బుధవారం కొత్తకోటలోని మీ సేవా కేంద్రంలోని కౌంటర్లో బిల్లుతో పాటు రూ.వంద నోటు ఇచ్చింది. రూ.18 లక్షలకు పైగా బిల్లు వస్తే రూ.100 ఇచ్చావేమిటని మీసేవ నిర్వాహకుడు ప్రశ్నించడంతో ఆ వృద్ధురాలు ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. అట్నుంచి అటే రావికమతం వెళ్లి విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఏఈ గొంపస్వామిని వివరణ కోరగా రీడింగ్ నమోదులో జరిగిన పొరపాటు వల్ల అలా జరిగిందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. -
చర్చల ద్వారా పరిష్కరించుకోండి
పురోగతి లేకుంటే మాకు చెప్పండి ♦ అప్పుడు మేమే తగిన ఆదేశాలు జారీ చేస్తాం ♦ విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై ♦ ఇరు రాష్ట్రాలకూ హైకోర్టు స్పష్టీకరణ ♦ తదుపరి విచారణ 9వ తేదీకి వాయిదా సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంలో తలెత్తిన వివాదాన్ని చర్చలద్వారా పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. రెండురాష్ట్రాల విద్యుత్ అధికారులు చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించింది. చర్చల్లో పురోగతి లేకుంటే పూర్తిస్థాయి విచారణ అనంతరం తామే తగిన ఆదేశాలు జారీ చేస్తామంది. ఉద్యోగుల విభజన ప్రక్రియను కొలిక్కితెచ్చే బాధ్యతను షీలాభిడే కమిటీకి అప్పగించాలా? లేదా ఇరురాష్ట్రాల అంగీకారంతో కోర్టు పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేయాలా? అన్నదానిపై అభిప్రాయం చెప్పాలని ఉభయరాష్ట్రాల అడ్వొకేట్ జనరల్స్(ఏజీ)ను ఆదేశించింది. వచ్చే విచారణ నాటికి ఏ విషయం చెబితే తదనుగుణంగా ఆదేశాలిస్తామంది. తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఏపీ స్థానికత ఆధారంగా విద్యుత్ ఉద్యోగుల విభజన మార్గదర్శకాలకు తెలంగాణ విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదముద్ర వేస్తూ జారీచేసిన ఉత్తర్వుల్ని, వాటికనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుదిజాబితాను సవాలుచేస్తూ పలువురు ఉద్యోగులు పిటిషన్లు వేయడం తెలిసిందే. వీటిని జస్టిస్ సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. చట్ట నిబంధనలమేరకే విభజన: తెలంగాణ ఏజీ స్థానికత ఆధారంగా చేపట్టిన ఉద్యోగుల విభజన ప్రక్రియ పునర్విభజన చట్టం మేరకే జరిగిందని తెలంగాణ ఏజీ కె.రామకృష్ణారెడ్డి వాదించారు. నిబంధనలకు అనుగుణంగా లేదు: ఏపీ ఏజీ ఏపీ స్థానికత ఆధారంగా విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలు, తదనుగుణంగా తెలంగాణ విద్యుత్‌శాఖ ముఖ్యకార్యదర్శి జారీచేసిన ఉత్తర్వులు, వాటికనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితా నిబంధనలకు అనుగుణంగా లేదని ఏపీ ఏజీ పి.వేణుగోపాల్ తెలిపారు. ఇదేసమయంలో గతవారం ధర్మాసనం జారీచేసిన ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్-82 ప్రకారం ఆ సంస్థలే ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తిచేయాలని తెలిపింది. వివాద పరిష్కార బాధ్యతను షీలాబిడే కమిటీకి అప్పగించే ఉద్దేశం తమకుందని, దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
పవర్ ఆఫీసులో చెలరేగిన మంటలు
♦ అగ్నికి ఆహుతైన మరమ్మతులో ఉన్న టాన్స్‌ఫార్మర్స్ ♦ వాటితోపాటు ఆయిల్ డ్రమ్ములు ♦ తృటిలో తప్పిన ప్రాణాపాయం ♦ రూ.10 లక్షల మేర నష్టం ♦ {పమాద స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ ఎస్ఈ జయకుమార్ ఒంగోలు క్రైం : ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో ఉన్న పవర్ ఆఫీసులో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. పనులు ముగించుకొని సిబ్బంది 6.30 గంటలకల్లా ఉద్యోగులు బయటకొచ్చిన కొంత సేపటికే ట్రాన్స్ఫార్మర్స్ మరమ్మతు విభాగంలో ఒక్క సారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆయిల్ ఫిల్టర్ నుంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన వాచ్మెన్ వెంటనే అక్కడున్న విద్యుత్ అధికారులకు, ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే మరమ్మతుకు సిద్ధంగా ఉన్న మూడు ట్రాన్స్ఫార్మర్లకు అంటుకున్నాయి. వాటితోపాటు ఐదు ఆయిల్ డ్రమ్ములకు కూడా మంటలు వ్యాపించాయి. ఈలోగా అగ్నిమాపక శాఖకు చెందిన రెండు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. లేకుంటే పెను ప్రమాదమే సంభవించేది. ఎందుకంటే చుట్టూ మరమ్మతు చేసిన ట్రాన్స్ఫార్మర్లు కూడా ఉన్నాయి. మరోవైపు ట్రాన్స్ఫార్మర్ల స్క్రాప్ కూడా ఉంది. ప్రస్తుతం జరిగిన అగ్ని ప్రమాదంతో రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లింది. విద్యుత్ శాఖ ఎస్ఈ ఎ.జయకుమార్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. నష్టం ఏవిధంగా జరిగిందీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. -
ప్రాణం తీసిన నిర్లక్ష్యం!
విద్యుత్ షాక్‌తో యువరైతు మృత్యువాత విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ యువ రైతును బలితీసుకుంది. సర్‌చార్జి చెల్లించలేదని విద్యుత్ సిబ్బంది సరిగా తొలగించని తీగ మృత్యుపాశమైంది. పెద్దేముల్ మండలం నాగులపల్లికి చెందిన బాలపొల్ల మోహన్‌రెడ్డి కుమారుడు బాల్‌రెడ్డి(22) మంగళవారం ఉదయం పసుపు పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. వీరి పొలం పక్కనే ఉన్న ఓ రైతు.. బోరుకు సంబంధించి విద్యుత్ సర్‌చార్జి కట్టకపోవడంతో రెండు రోజుల క్రితం సిబ్బంది కనెక్షన్ తొలగించారు. కట్ చేసిన వైరు మోహన్‌రెడ్డి బోరు వద్ద పడింది. ఇది గమనించని బాల్ రెడ్డికి విద్యుత్ తీగ తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఎదిగిన కొడుకు దూరం కావడంతో కన్నవారు కన్నీరుమున్నీరవుతున్నారు. - పెద్దేముల్ పెద్దేముల్: విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. సర్‌చార్జీ కట్టలేదని విద్యుత్ వైర్ కట్ చేసి తీసుకెళ్లిన విద్యుత్ సిబ్బంది మిగిలిన వైర్ గురించి పట్టించుకోలేదు. ప్రవూదవశాత్తు దాన్ని తాకిని ఓ యుువరైతు అక్కడికక్కడే వుృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నాగులపల్లి గ్రావుంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాగులపల్లికి చెందిన బాలపొల్ల మెహన్‌రెడ్డి, లక్ష్మమ్మల కువూరుడు బాల్‌రెడ్డి(22) వ్యవసాయుం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అరుుతే వీరి పొలానికి ఆనుకొని దాసరి అనంతయ్య పొలం ఉంది. అనంతయ్యు సర్‌చార్జీ కట్టలేదంటూ రెండు రోజుల క్రితం విద్యుత్ అధికారులు ఆ బోరుకు కరెంటును కట్ చేశారు. అరుుతే సర్వీస్ వైర్‌ను కట్ చేసి తీసుకెళ్లిన అధికారులు మిగిలిన వైర్ గురించి పట్టించుకోకపోవడమే కాకుండా స్తంభంపైనుంచి కనెక్షన్‌ను కూడా కట్ చేయులేదు. ఈ మిగిలిన వైర్ బాల్‌రెడ్డి పొలంలో పడింది. మంగళవారం ఉదయం తన పొలంలోని పసుపు పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన బాల్‌రెడ్డి చూడకుండా ఈ వైర్‌ను తాకాడు. దీంతో వెంటనే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే వుృతి చెందాడు. ఈ విషయాన్ని మధ్యాహ్నం వరకు ఎవరూ గమనించలేదు. అదే గ్రామానికి చెందిన మట్ట మల్లప్ప తన పొలం నుంచి ఇంటికి వెళుతూ బాల్‌రెడ్డి వుృతదేహాన్ని గవునించి కుటుంబ సభ్యులకు సవూచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని వుృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల ఆందోళన బాల్‌రెడ్డి వుృతదేహంతో స్థానిక కాంగ్రెస్ నాయుకుల ఆధ్వర్యంలో గ్రావుస్తులు తాండూరు-సంగారెడ్డి రహదారిపై బైఠాయించారు. అధికారుల నిర్లక్ష్యమే బాల్‌రెడ్డి వుృతి కారణమైందని, రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. వుూడు గంటలపాటుధర్నా కొనసాగడంతో రోడ్డుపై ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. తాండూరు రూరల్ సీఐ శివశంకర్ ఘటనా స్థలానికి వచ్చి నచ్చజెప్పినా వారు ఆందోళన విరమించలేదు. ఆందోళనలో జిల్లా డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి తదితరులతోపాటు దాదాపు 100 వుంది గ్రావుస్తులు పాల్గొన్నారు.