సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్‌ఎస్ పార్టీపై, ఆ పార్టీ నేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. 24 గంటల విద్యుత్ వెలుగుల వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చీకటి ఒప్పందాలున్నాయని ఆరోపించారు. రైతుల కోసం ఎంతైనా విద్యుత్ కొనుగోలు చేస్తామనే హామీ వెనుక రైతులపై ప్రేమ లేదని, కమీషన్‌పై మాత్రమే ప్రేమ ఉందన్నారు. తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని కేంద్రం చెబుతున్నా ప్రభుత్వం మాత్రం ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందాలు చేసుకుందని, అవన్నీ కూడా కమీషన్ కోసమేనన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన, ప్రారంభించబోతున్న విద్యుత్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏం అన్నారంటే..
'ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు వెనుక అంతర్యం ఏమిటో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. విద్యుత్ తక్కువ ధరకు అందించడానికి అనేక సంస్థలు ఉన్న ఎందుకు అధిక ధరలకు కొంటున్నారు. విద్యుత్ ఒప్పందాల కొనుగోళ్లను బయటపెట్టాలి. అఖిలపక్షం నిర్వహించి విద్యుత్ కొనుగోళ్ల విషయం బయటకు చెప్పాలి. 24 గంటల విద్యుత్ కొనుగోళ్ల వెనుక అక్రమాలు జరుగుతున్నాయి. మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలనే పక్కనబెట్టారు. 24 గంటలు నిరంతర కరెంటు ఇస్తామని ముఖ్యమంత్రి డబ్బాలు కొడుతున్నారు.
కానీ, కొడంగల్ నియోజకవర్గంలో 18 తండాలకు నేటికి కరెంటు లేదు. సొంత శాఖలో పరిస్థితులను కూడా తెలియకుండా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై బహిరంగ చర్చుకు కాంగ్రెస్ సిద్ధం. విద్యుత్ మంత్రి బహిరంగ చర్చకు రావాలి. తెలంగాణకు చెందిన రాజస్తాన్ క్యాడర్ ఐఏఎస్ రమేష్ సేవచేయడానికి వస్తే ఆయనను తిరిగి పంపించారు. తెలంగాణ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం సరిగా లేదన్నందుకు ఆయన్ను శంకరిగిరి మాన్యాలకు పంపించారు. ఇండియా బుల్స్ కంపెనీని కాపాడటానికి రోజువారీ కొనుగోళ్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఇండియా బుల్స్‌పై కేసీఆర్‌కు ప్రేమేందుకు పుట్టిందో చెప్పాలి. గుజరాత్ చెందిన కంపెనీపై ఎందుకు జాలి చూపిస్తున్నారో వెల్లడించాలి' అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
'కేసీఆర్‌కు ఇండియా బుల్స్‌పై ఎందుకంత ప్రేమ?'
Published Wed, Jan 10 2018 2:14 PM | Last Updated on Wed, Aug 15 2018 9:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment