homeo
-
మామిడిలో సస్యరక్షణకు హోమియో మందులు
మామిడి పూత, పిందె దశలో సస్యరక్షణకు హోమియో మందులు ఎంతగానో ఉపయోగపడతాయని యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురంలోని అమేయ కృషి వికాస కేంద్రం వ్యవస్థాపకులు, రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి చెబుతున్నారు. ఆయన మాటల్లోనే.. ► మామిడి చెట్లకు పూత సరిగ్గా రావాలంటే ZINCUMET-30, MAGPHOS-30, BORAN / BORAX-30 ఆౖఖఅగీ30 మందులను వారం రోజుల వ్యవధిలో 3 సార్లు చొప్పున.. ఒకదాని వెంట మరొకటి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అట్లనే పూత బలంగా రావటం కోసం PULSATILLA-30 ను కూడా పిచికారీ చేసుకోవాలి. ► దోమ నుంచి పూతను, పిందెను కాపాడుకోవడానికి COCCINELLA SEPTE - 30 పిచికారీ చేసుకోవాలి. ► రేగు కాయల పరిమాణంలోకి వచ్చిన మామిడి కాయలు రాలిపోతుంటే BOVISTA -30 పొటెన్సీలో పిచికారీ చేసుకోవాలి. మంచు ఎక్కువగా పడుతుంటే పూత, పిందెను రక్షించుకోవడానికి CUPRUM SULPH-30 పిచికారీ చేసుకోవాలి. ► మంగుతో కాయ నల్లగా మారుతూ ఉంటే, ముడ్డుపుచ్చు (ఆంత్రాక్నోస్)ను నివారించుకోవడానికి ALYSIC ACID-30 CARBOVEG-30 పిచికారీ చేసుకోవాలి. ► కొమ్మెండు తెగులు నుంచి రక్షించుకోవడానికి CUPRUM SULPH-30 పిచికారీ చేసుకోవాలి. ► పాత తోటల్లో మామిడి ఆకులపైన బుడిపెలు (మాల్ ఫార్మేషన్) వస్తే కొమ్మలను కత్తిరించి, దూరంగా తీసుకెళ్లి తగులబెట్టాలి. ఇది అంటు వ్యాధి. అరికట్టకపోతే దిగుబడిపై కూడా ప్రభావితం చూపిస్తుంది. TUJA-200 ను వారంలో 3 సార్లు పిచికారీ చేసుకుంటే పోతుంది. ► కాయ పెరుగుదల మొదటి దశలోAMONIUMPHOS-30 పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత కాయ పెరుగుతున్న దశలో UPHALA-30ను పిచికారీ చేసుకోవచ్చు. ఇది అమేయ కృషి వికాస కేంద్రం రూ΄పొం దించిన మందు. బయట మందుల షాపులో దొరకదు. త్రిబుల్19కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ► మామిడి రైతులకు మరో ముఖ్య సూచన ఏమిటంటే.. 15 రోజులకోసారి నీటి తడులతో పాటు ఎకరానికి 800 నుంచి 1,000 లీటర్ల వరకు గోకృపామృతం పారించుకుంటే.. కాయ పరిమాణం బాగుంటుంది, కాయ రాలకుండా ఉంటుంది. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడొచ్చు. www.youtube.com/@ameyakrishivikasakendram5143 -
మిరపకు పునరుజ్జీవం.. నాకైతే నమ్మకం కుదిరింది!
నల్ల తామరపురుగు.. ఈ ఏడాది అనేక రాష్ట్రాల్లో మిరప తదితర పంటల పూతను ఆశించి రైతులకు పెనునష్టం కలిగించింది. యాదాద్రి జిల్లా భువనగిరికి సమీపంలోని రామకృష్ణాపురంలోని అమేయ కృషి వికాస కేంద్రం రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి సూచించిన హోమియో మందుల వివరాలు, వాడే విధానంపై 2022 జనవరి 11న ‘సాక్షి సాగుబడి’లో కథనం ప్రచురించాం. ఈ నేపధ్యంలో.. పీకేద్దామనుకున్న తోటలను సైతం పునరుజ్జీవింపజేయటంలో హోమియో మందులు అద్భుత ఫలితాలనిస్తున్నాయని రైతులు స్వానుభవంతో చెబుతున్నారు. డా.వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త కూడా హోమియో మందులతో మిరప చీడపీడల నియంత్రణలో సానుకూల ఫలితాలు వస్తున్నాయనటం విశేషం. రూ. 5 వేలతో గట్టెక్కాం... మా ప్రాంతంలో నల్ల తామరపురుగు దెబ్బకు చాలా గ్రామాల్లో మిరప తోటలు పీకేశారు. తోటలు మిగిలిన రెండు, మూడు గ్రామాల్లో మాది కూడా ఒకటి. గత నవంబర్ నుంచి మా 10 ఎకరాల్లో మిరప పొలానికి హోమియో మందులు వాడుతున్నాను. 4–5 రోజుల వ్యవధిలో ఇప్పటికి పది సార్లు పిచికారీ చేశాను. నల్ల తామరపురుగు మీద బాగానే పనిచేశాయి. 10 ఎకరాలకు కలిపి ఎంత తక్కువనుకున్నా పురుగుమందుల ఖర్చు రూ. 2 లక్షలైనా అయ్యేది. హోమియో మందులకు మాకు రూ. 5 వేలతో సరిపోయింది. దిగుబడి నలుగురితో సమానంగా వస్తున్నది. పురుగుమందులు వాడి మాకన్నా తక్కువగా దిగుబడితో సరిపెట్టుకుంటున్న కూడా ఉన్నారు. పంట మొదటి నుంచీ హోమియో మందులు మాత్రమే వాడితే ఇంకా బాగుంటుంది. వచ్చే సంవత్సరం నేనైతే మొదటి నుంచీ హోమియో మందులే వాడతా. – యెనిరెడ్డి శ్రీనివాసరెడ్డి (83286 72773), మిరప రైతు, గొరిజవోలు గుంట పాలెం, పెదనందిపాడు మం., గుంటూరు జిల్లా రూ. 5 వేలతో గట్టెక్కాం... మా ప్రాంతంలో నల్ల తామరపురుగు దెబ్బకు చాలా గ్రామాల్లో మిరప తోటలు పీకేశారు. తోటలు మిగిలిన రెండు, మూడు గ్రామాల్లో మాది కూడా ఒకటి. గత నవంబర్ నుంచి మా 10 ఎకరాల్లో మిరప పొలానికి హోమియో మందులు వాడుతున్నాను. 4–5 రోజుల వ్యవధిలో ఇప్పటికి పది సార్లు పిచికారీ చేశాను. నల్ల తామరపురుగు మీద బాగానే పనిచేశాయి. 10 ఎకరాలకు కలిపి ఎంత తక్కువనుకున్నా పురుగుమందుల ఖర్చు రూ. 2 లక్షలైనా అయ్యేది. హోమియో మందులకు మాకు రూ. 5 వేలతో సరిపోయింది. దిగుబడి నలుగురితో సమానంగా వస్తున్నది. పురుగుమందులు వాడి మాకన్నా తక్కువగా దిగుబడితో సరిపెట్టుకుంటున్న కూడా ఉన్నారు. పంట మొదటి నుంచీ హోమియో మందులు మాత్రమే వాడితే ఇంకా బాగుంటుంది. వచ్చే సంవత్సరం నేనైతే మొదటి నుంచీ హోమియో మందులే వాడతా. – యెనిరెడ్డి శ్రీనివాసరెడ్డి (83286 72773), మిరప రైతు, గొరిజవోలు గుంట పాలెం, పెదనందిపాడు మం., గుంటూరు జిల్లా నాకైతే నమ్మకం కుదిరింది! 6 ఎకరాల్లో మిరప వేస్తే ఈ ఏడాది నల్ల తామరపురుగు సోకి నాశనమైంది. ఎకరానికి రూ. 50 వేలు పెట్టుబడి పెట్టా. అయినా, పురుగు తీవ్రంగా నష్టపరిచింది. నెల రోజులు ఏమీ చేయకుండా వదిలేశా. ఇక గొడ్లకు మేపుదాం అనుకున్నా. ఆ దశలో 3 వారాల క్రితం ‘సాక్షి సాగుబడి’లో హోమియో మందులతో తామరపురుగును నియంత్రించవచ్చని కథనం చదివి తెలుసుకున్నా. ఆర్నేరియా డయాడెమా 30 మందును పిచికారీ చేశాను. చాలా బాగా పనిచేసింది. ఇప్పటికి 2 రోజుల వ్యవధితో 5 డోసులు పిచికారీ చేశాను. ఎర్రగా మారిన తోట అంతా ఆకుపచ్చగా మారింది. ఇగుర్లు, పూత వస్తున్నది. హోమియో మందుల సంగతి ముందే తెలిసి ఉంటే పంట నష్టం చాలా తగ్గి ఉండేది. ఖర్చు కూడా తక్కువే. ఇంగ్లిష్ (రసాయనిక పురుగు) మందులు ఎకరానికి పిచికారీకి రూ. 3 వేల వరకు ఖర్చవుతుంది. దీనికి రూ. 60–70 చాలు. 20 లీటర్ల ట్యాంకుకు 2.5 ఎం.ఎల్. హోమియో మందు కలిపి చల్లితే చాలు. నాతో పాటు మా వూళ్లో ఇంకో 15 మంది రైతులు కూడా హోమియో వాడుతున్నారు. – బండారు దేవేందర్‌రెడ్డి (96188 85878), మిరప రైతు, బీరోలు గ్రామం, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా తామరపురుగు కంట్రోల్ అయ్యింది 15 ఎకరాల కౌలు భూమిలో మిరప సాగు చేస్తున్నాం. నెల రోజుల నుంచి 4–5 రోజులకోసారి హోమియో మందులు పిచికారీ చేస్తున్నాను. నల్ల తామరపరుగు పూర్తిగా పోలేదు గానీ కంట్రోల్లోకి వచ్చింది. పూత, ఇగుర్లు వస్తున్నాయి. పంట మొదటి నుంచీ ఇంగ్లిష్ (రసాయన పురుగు) మందులు వాడలేదు. నూనెలు వాడేవాడిని. బూడిద తెగులు, తెల్లదోమ, తామరపురుగులకు హోమియో మందులు నెల నుంచి ఒకదాని తర్వాత మరొకటి పిచికారీ చేస్తున్నాను. బాగానే పనిచేస్తున్నాయి. సమస్యలు పెరగలేదు. అలాగని పూర్తిగానూ పోలేదు. ఆకుముడత రాలేదు. ఎకరానికి 12.15 క్వింటాళ్ల ఎండు మిరప దిగుబడి వస్తుంది. ఇంకో ఇద్దరు ముగ్గురు రైతులు కూడా వాడుతున్నారు. నూనెల కన్నా హోమియో మందుల ఖరీదు కూడా తక్కువే. – బొమ్మసాని సాంబయ్య (84669 23488), మిరప రైతు, అయనూర్, రాయచూర్ జిల్లా, కర్ణాటక హోమియో మందుల పిచికారీ ఇలా.. ద్రవ రూపంలో ఉండే హోమియో మందులు పంటలపై పిచికారీ చేసుకునేందుకు బాల్‌రెడ్డి ప్రత్యేక పద్ధతిని సూచిస్తున్నారు. ఒక లీటరు మంచినీటి సీసా తీసుకొని శుభ్రంగా కడిగి, సగానికి నీరు పోయాలి. ఎంపిక చేసుకున్న మందు 2,5 ఎం.ఎల్.ను కొలిచి ఆ సీసాలోని నీటిలో కలిపి గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత సీసాను కిందికి పైకి లెక్కపెట్టి మరీ 50 సార్లు గిలకొట్టినట్టు వేగంగా ఉపాలి. ఆ తర్వాత ఆ సీసాలోని మిశ్రమాన్ని 20 లీటర్ల తైవాన్ స్ప్రేయర్ ట్యాంక్‌లో పోసుకొని, నీటిని నింపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎంత ఎక్కువగా ఉన్నా ట్యాంకుకు 2.5 ఎం.ఎల్. కంటే ఎక్కువ మందు వాడవద్దు. అలా చేస్తే మందు పనిచేయదని, మోతాదు మించితే ప్రతికూల ఫలితాలు కూడా రావచ్చని బాల్‌రెడ్డి హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా, 2,3 హోమియో మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపి పిచికారీ చేయకూడదన్నారు. స్ప్రేయర్‌ను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత హోమియో మందుల పిచికారీకి వాడితేనే ఫలితాలు వస్తాయన్నారు. వేడి నీటితో కడిగి పైపులు శుభ్రం చేయాలి. వేడి నీటితో శుభ్రం చేసి నీడలో పంపును, స్ప్రేయర్ ను, బాటిళ్లను శుభ్రంగా పెట్టుకున్నప్పుడే ఈ మందులు పనిచేస్తాయన్నారు. (క్లిక్: మిన్నల్లి పనిపట్టే వై.ఎన్. ద్రావణం!) రెండు పిచికారీలతో సత్ఫలితాలు మిరప పంటపై ఆశించిన వెస్ట్రన్ తామరపురుగును నియంత్రించడానికి హోమియో మందులు తుజ 30, ఆర్నేరియా డైడిమా 30 పిచికారీ చేస్తే సానుకూల ప్రభావం కనిపించింది. రెండు సార్లు మాత్రమే ఈ మందులను వేర్వేరుగా వాడాము. పురుగు తాకిడి నుంచి తట్టుకొని పూత నిలబడడానికి, కొత్త పూత, పిందె రావడానికి ఈ మందులు ఉపయోగపడ్డాయి. నల్ల తామరపురుగుల సంఖ్య తగ్గింది. రసాయనాలతో పోల్చితే ఈ హోమియో మందులు ఖర్చు తక్కువే కాకుండా.. మనుషులకు కూడా హానికరం కాదు. పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంది. – డా. ఎ.రజని (99898 09554), సీనియర్ శాస్త్రవేత్త, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధనా స్థానం, లాం, గుంటూరు జిల్లా -
ఆర్‌ఆర్‌ఐలో అక్రమాలు: వారికి ధనార్జనే ధ్యేయం
గుడివాడ టౌన్: హోమియో ప్రాంతీయ పరిశోధనా సంస్థ (ఆర్ఆర్ఐ) అక్రమాలకు వేదికగా మారింది. ఈ అక్రమాలపై పత్రికల్లో కథనాలు వచ్చినా స్పందన లేకుండా పోతోంది. కనీసం ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఇవి వెళ్లడం లేదని సమాచారం. ఇక్కడ పనిచేసే అధికారులే ఎక్కువ శాతం ఈ వ్యవహారంలో భాగస్వాములు కావడంతో ఎవరూ కిమ్మనడం లేదని తెలుస్తోంది. అందుకే దీనిపై ఫిర్యాదులు వెళ్లినా మసిపూసి మారేడుకాయ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పందన నిల్.. ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’ దినపత్రిక గత నెల 25న ‘పరిశోధనం స్వాహా’ అనే శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇది వచ్చి పదిహేను రోజులు దాటినా ఇంతవరకు దీనిపై కనీస చర్యలకు పూనుకోలేదు. వాస్తవానికి దీనిపై విచారణకు ఆదేశించేందుకు ఏ అధికారి ముందుకు రావడం లేదని సమాచారం. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడి అధికారులు అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల నుంచి ఫలానా మెడికల్ షాపుల్లో మందులు కొనాలని ప్రిప్రస్కిప్షన్ రాయటం వరకు ఏదో ఒక మార్గంలో కమీషన్లు దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ వ్యవహారాలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం లేదని చెబుతున్నారు. మంచి సక్సెస్ రేటు.. గుడివాడ ప్రాంతీయ హోమియో పరిశోధనా స్థానం నుంచి గతంలో అనేక పరిశోధనలు విజయవంతం అయ్యాయి. హోమియో వైద్యం ద్వారా అనేక వంశపారంపర్య దీర్ఘ రోగాలను నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.90 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వెచ్చిస్తుంటే, ఇక్కడ పనిచేస్తున్న సైంటిస్టులు మాత్రం సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాక ముందు.. ఇక్కడ పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ ఉన్నతాధికారి మరో హోమియో స్టోర్స్ యజమానుల భాగస్వామ్యంతో పట్టణానికి సమీపంలో ఏర్పాటు చేసిన మందుల కంపెనీకి చెందిన మందులనే ఇక్కడకు వచ్చిన తమకు అంటగట్టేవారని రోగులు చెబుతున్నారు. ఈ తంతు రెండేళ్లుగా కొనసాగుతోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో వచ్చే రోగులకు కనీసం రెండు మూడు రకాల ‘మందులు ఇక్కడ లేవు. ఫలానా మందుల షాపులో కొనుక్కోండి’ అని చెప్పి పంపేవారని రోగులు వివరిస్తున్నారు. అయితే సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమయ్యాక ఫలానా షాపులో కొనండి అని రాసే స్లిప్పులను తొలగించారు. రోగి తనకిష్టం వచ్చిన చోట మందులు కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నట్లు సమాచారం. ఇక్కడా అక్కడా తీసుకుంటున్నారు.. ఆర్‌ఆర్‌ఐలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వైద్యులు ఇళ్ల వద్ద ప్రైవేట్ వైద్య సేవలు నిర్వహించరాదు. అందుకు ప్రతిగా వారికి బేసిక్ పేలో 20 శాతం అదనంగా జీతం అందజేస్తారు. అంటే రూ.2 లక్షలు బేసిక్ ఉంటే రూ.40 వేలు నెలకు అదనపు జీతం అందుతుంది. అయినప్పటికీ ఆర్‌ఆర్‌ఐలో పనిచేస్తున్న వారు ఇంటి వద్ద వైద్య వ్యాపారం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆరుగురు వైద్యులు ఇక్కడ పరి్మనెంట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అందరూ ఇక్కడా అక్కడా లాభం పొందుతూనే ఉన్నారు. ఇప్పటికైనా స్పందిస్తే.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన ఆర్‌ఆర్‌ఐలో అవినీతి ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకంలోనూ.. ఇక్కడ ఉద్యోగ విరమణ చేసిన ఉన్నత స్థాయి వ్యక్తి కాంట్రాక్టు ఉద్యోగాల నియామకంలో తన చేతివాటం చూపించి రూ.30 లక్షలకు పైగా వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో 2019 జూలై నెలలో ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ (177/2019) నమోదు చేశారు. సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఇందుకోసం ఇక్కడ పనిచేసిన విశ్రాంత ఉద్యోగి(యూడీసీ) కాంట్రాక్ట్ ఉద్యోగుల సహాయం తీసుకుని, నిరుద్యోగులను ప్రలోభపెట్టి ఈ వసూలు దందాకు పాల్పడ్డాడని చెబుతున్నారు. చదవండి: పత్రికల్లో వార్తలు సేకరించి.. ఇంటెలిజెన్స్ డీఎస్పీనంటూ.. మండుటెండలో సైతం.. భక్తిభావం ఉప్పొంగగా.. -
ఏపీలో హోమియో మందుల పంపిణీ
-
సయాటికాకు చికిత్స ఉందా?
నా వయసు 45 ఏళ్లు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటాను. నడుము నొప్పి ఎక్కువై ఎమ్మారై తీయిస్తే డిస్క్బల్జ్తో పాటు సయాటికా ఉందని అన్నారు. హోమియో వైద్యం ఉంటుందా? – వెంకటరామ్, నాగాయలంక ఈ రోజుల్లో సయాటికా అనే పదాన్ని వినని వారుండరు. ఈ వ్యాధి బాధితులు తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు. సయాటికాను త్వరగా గుర్తించి సరైన సమయంలో ఎలాంటి దుష్ప్రభావాలు లేని హోమియో చికిత్స చేయించుకోవడం ముఖ్యం. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఫిజియోథెరపీ, హోమియో సంపూర్ణ చికిత్సతో సయాటికా సమస్యను శాశ్వతంగా దూరం చేయవచ్చు. శరీరంలో అన్నిటికంటే పెద్దది, పొడవాటి నయం వీపు కిందిభాగం నుంచి పిరుదుల మీదుగా కాలు వెనక భాగంలో ప్రయాణిస్తుంది. దీన్ని సయాటికా నరం అంటారు. ఏదైనా కారణాల వల్ల ఈ నరం మీద ఒత్తిడి పడ్డప్పుడు ఈ నరం ప్రయాణించే మార్గంలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే... వీపు కిందిభాగం నుంచి మొదలై, తొడ, కాలివెనక భాగం, మడిమల వరకు ఆ నొప్పి పాకుతూ ఉన్నట్లుగా వస్తుంటుందన్నమాట. నొప్పితోబాటు తిమ్మిర్లు, స్పర్శ తగ్గడం, మంటలు, నడకలో మార్పు రావడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఈ సమస్యనే సయాటికా అని వ్యవహరిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా 62% మంది ఈ సమస్యతో విధులకు గైర్హాజరవుతుంటారు. కారణాలు నర్వ్ కంప్రెషన్ : నర్వ్ రూట్ ప్రెస్ అవడం వల్ల నొప్పి వస్తుంది. స్పైనల్ డిస్క్ హర్నియేషన్: ఎల్4, ఎల్5 నరాల మూలాలు ఒత్తిడికి గురై సరైన పొజిషన్స్‌లో వంగక పక్కకు జరగడం వల్ల సయాటికా నొప్పి వస్తుంది. పెరిఫార్మిస్ సిండ్రోమ్: దెబ్బలు, గాయాలు తగిలినప్పుడు పెరిఫార్మిస్ కండరం నర్వ్రూట్ను ప్రెస్ చేస్తుంది. దీనివల్ల సయాటికా నొప్పి వస్తుంది. సాక్రోఇలియక్ జాయింట్ డిస్క్ ఫంక్షన్: శారీరక శ్రమ, వ్యాయామం లేక కీలు పనిచేయనప్పుడు సయాటికా రావచ్చు, ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ చివరినెలలో పిండం బరువు పెరిగి నర్వ్‌రూట్ ప్రెస్ అవ్వడం వల్ల సయాటికా నొప్పి వస్తుంది. పరీక్షలు: ఎక్స్–రేతో పాటు ఎమ్మారై స్కాన్‌తో డిస్క్‌హెర్నియేషన్, డిస్క్‌ప్రొలాప్స్ నిర్ధారణ, ఏ నర్వ్‌రూట్ ఎక్కడ కంప్రెస్ అయ్యిందో నిర్ధారణ చేయవచ్చు. నొప్పి వస్తే ఏదో ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోతుందని నిర్లక్ష్యం చేసేవారు చాలామంది ఉంటారు. నొప్పి నివారణ మాత్రలు తరచూ వేసుకోవడం వల్ల సైడ్ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీర్ణకోశవ్యవస్థకు సంబంధించిన వ్యాధులు అసిడిటీ, అల్సర్స్ రావచ్చు. చికిత్స: సయాటికా నొప్పికి, వెన్నుపూస సమస్యలకు హోమియోపతిలో మంచి చికిత్స ఉంది. వైద్యపరీక్షల ఆధారంగా సయాటికా నొప్పికి కారణాలను తెలుసుకుంటారు. దాన్నిబట్టి రోగి శారీరక, మానసిక లక్షణాలను విశ్లేషించి, రోగలక్షణాలూ, మూలకారణాలను బట్టి హోమియో మందులను సూచిస్తారు. సాధారణంగా రస్టాక్స్, కిలోసింథ్, రోడోడెండ్రాన్, కాస్టికమ్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన వైద్యనిపుణుల పర్యవేక్షణలో హోమియో మందులు వాడితే సయాటికా సమస్య శాశ్వతంగా నయమవుతుంది.డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,ఎండీ (హోమియో),స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
తినగానే కడుపునొప్పితో టాయిలెట్‌కు...
నా వయసు 42 ఏళ్లు. భోజనం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. తేన్పులు, కడుపుఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉన్నాయి. ఈ సమస్యతో ఏ అంశంపైనా దృష్టి పెట్టలేకపోతున్నాను. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి.– ఎమ్. సత్యవతి, విజయనగరం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే ∙జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు దీర్ఘకాల జ్వరాలు ∙మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ∙జన్యుపరమైన కారణలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ఒత్తిడిని నివారించుకోవాలి పొగతాగడం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలిరోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. హోమియోలో చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు.డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్,పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
అయ్యో...హోమియో
ప్రభుత్వ హోమియో వైద్య విభాగాల్లో వైద్యుల కొరత వెంటాడుతోంది. 2008లో అప్పటి ప్రభుత్వం రాష్ట్రంలో 557 హోమియో వైద్య విభాగాలను ఏర్పాటు చేసింది. వీటిలో పని చేసేందుకు 1114మంది పారామెడికల్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించింది. నేషనల్ రూరల్ హెల్త్‌మిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్యాధికారులను కొంత మందిని 2011లో జీవో నంబర్ 254 ప్రకారం 449 మందిని ప్రభుత్వం వైద్యులుగా రెగ్యులర్ చేసింది. తర్వాత వీరిని వేరే విభాగాలకు బదిలీ చేయడంతో వెద్యులు కొరత ఏర్పడింది. అప్పటి నుంచి కాంపౌండర్, ఎస్ఎంవోలే రోగులకు వైద్యం అందిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 557 వైద్యశాలలకు 136 మంది మాత్రమే డాక్టర్లు ఉన్నారు. కృష్ణాజిల్లాలో 48 విభాగాలకు ఎనిమిది మందే సేవలందిస్తున్నారు. ► డాక్టర్ల కొరతతో హోమియో వైద్యశాలలు వెలవెల ► కాంపౌండర్లతోనే వైద్య సేవలు 48 విభాగాలకు ► ఎనిమిది మందే వైద్యులు జి.కొండూరు (మైలవరం) : ప్రభుత్వం హోమియో వైద్యశాలలపై చిన్న చూపు చూస్తోంది. సిబ్బందికి జీతాలు, సరైన మందులను అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలకు మెరుగైన హోమియో వైద్యం అందుబాటులోకి తేవాలని ఉద్దేశంతో 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హోమియో విభాగాలను ప్రారంభించింది. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హోమియో వైద్యాన్ని సామాన్యులకు అందకుండా చేస్తుంది. ఇప్పుడిప్పుడే హోమియో వైద్యానికి అలవాటు పడుతున్న రోగులు డాక్టర్ల కొరత, సరైన మందులు అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. వేతనాలు లేవు ప్రభుత్వ హోమియో వైద్య విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి 11 నెలలుగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వడంలేదు. డాక్టర్లు ఉన్న విభాగాల్లో మాత్రమే వేతనాలు ఇస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 11 నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతున్నారు. ఈ విషయమై వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ఎన్నిసార్లు కలిసి వినతిపత్రాలు అందజేసినా ఉపయోగంలేదని ఆవేదన చెందుతున్నారు. అందుబాటులో లేని మందులు హోమియో విభాగాల్లో డాక్టర్ల కొరతతో పాటు మందులు కూడా అందుబాటులో ఉండడంలేదు. ప్రభుత్వం హోమియో విభాగాలకు అన్నిరకాల మందులను సరఫరా చేయడం లేదు. సరైన వైద్యం,మందులు అందుబాటులో లేకపోవడంతో రోగులు హోమిమో వైద్యానికి దూరమవుతున్నారు. 11 నెలలుగా జీతాలు లేవు 11 నెలలుగా జీతాలు రావడంలేదు. కుటుంబ పోషణ కష్టంగా మారింది. ప్రభుత్వం వెంటనే జీతాలు ఇవ్వాలి. కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యలర్ చేయడంతోపాటు వైద్యులను నియమించాలి. –శ్రీనివాసరావు, హోమియో వైద్య విభాగం ఎస్ఎన్వో -
నిద్రలేవగానే కీళ్లనొప్పి...!
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 58 ఏళ్లు. రెండు వారాల నుంచి నేను ఉదయం నిద్రలేచిన వెంటనే నడవడం చాలా కష్టంగా ఉంటోంది. కీళ్లనొప్పి, వాపు, బిగుసుకుపోవడం, కాళ్లలో బలహీనత, మొద్దుబారడం జరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? నాకు తగిన సలహా ఇవ్వండి. - కె. బలరామ్, కొత్తగూడెం మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కీళ్లలోని కార్టిలేజ్ అనే మృదులాస్థి అరుగుదలకు గురికావడం, తద్వారా చుట్టూ ఉన్న కణజాలంపై అరుగుదల ప్రభావం పడటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్‌గా పేర్కొంటారు. ఇది 40 ఏళ్ల వయసు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఇది ఎక్కువ. ఎక్కువగా మోకాలిలో కనిపించే సమస్య అయినప్పటికీ చేతివేళ్లు, వెన్నుపూస, తుంటి ప్రాంతం, కాలివేళ్లలోనూ ఆస్టియో ఆర్థరైటిస్ తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్య సాధారణంగా గతంలో కీళ్లకు ఏదైనా దెబ్బ తగిలి ఉండటం, అధిక బరువు, కాళ్ల ఎదుగుదలలో హెచ్చుతగ్గులు ఉండటం, కీళ్లపై అధిక ఒత్తిడి కలిగించే పనులు చేయడం వంటివి కారణాలు. కొందరిలో వంశపారంపర్యంగానూ ఈ సమస్య కనిపించవచ్చు. మీరు కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపరీక్ష, మోకాలి నుంచి కొద్దిగా ద్రవాన్ని తీసి పరీక్షించడం, ఎక్స్-రే, సీటీ స్కాన్ వంటి పరీక్షల ద్వారా ఈ సమస్యను నిర్ధారణ చేయవచ్చు. మీకు దగ్గర్లోని వైద్య నిపుణులను సంప్రదించండి. - డా. ప్రవీణ్ మేరెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్,కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. నాకు చాలాకాలంగా తలలో, ముఖం మీద, కనురెప్పల దగ్గర చర్మం ఎర్రటి, తెల్లటి పొరలతో దురదగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సెబోరిక్ డర్మటైటిస్ అని చెప్పారు. మందులు వాడితే సమస్య తగ్గుతోంది, కానీ మళ్లీ కొంతకాలానికే తిరగబెడుతోంది. అసలు సమస్య ఎందుకు వస్తోంది? హోమియోలో ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. - పురుషోత్తమరావు, మంచిర్యాల చర్మంలో సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉండే భాగాలు ఎర్రగా మారడంతో పాటు, దురదతో ఈ వ్యాధి కనిపిస్తుంటుంది. సాధారణంగా ఇది దీర్ఘకాలిక సమస్య. ఇది 30 నుంచి 70 ఏళ్ల వారితో పాటు మూడు నెలల శిశువులలోనూ కనిపిస్తుంది. వీళ్లలో 6 నుంచి 12 నెల వయసు వరకు ఇది తగ్గిపోతుంటుంది. తలలో వచ్చే తేలికపాటి సెబోరిక్ డర్మటైటిస్‌ని చుండ్రు అని అంటారు. ఇది ఎక్కువ మందిని వేధించే సమస్య. ఈ వ్యాధి ఎక్కువగా తల, ముఖం, ఛాతీ, వీపు, చెవి లోపలి భాగాలతో పాటు వెంట్రుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కనిపిస్తుంటుంది. కారణాలు : ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ చర్మంలోని సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉన్న చోట మలసేజియా అనే ఒక రకం జీవజాతి అధికంగా అభివృద్ధి చెంది కొన్ని హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ అంశం సెబోరిక్ డర్మటైటిస్‌ను ప్రేరేపిస్తుంది. * రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల్లోనూ, పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ. * మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేవారిలో, జిడ్డు చర్మం ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలు అధికం. * వాతావరణం, హార్మోన్ సమస్యలు, కొన్ని జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధిని ప్రభావితం చేయవచ్చు. లక్షణాలు : సెబోరిక్ డర్మటైటిస్ లక్షణాలు క్రమంగా ఏర్పడతాయి చర్మంపై ఎర్రటి, తెల్లటి లేదా పసుపు వర్ణంలో పొరలు ఏర్పడతాయి. దురద, మంట కనిపిస్తుంటుంది దీని తీవ్రత సాధారణంగా చలికాలంలో ఎక్కవగానూ, వేసవిలో ఒకింత తక్కువగానూ ఉంటుంది. చిన్నపిల్లల్లో : తలపై చర్మం జిడ్డుగా, పొరలుగా, ఎర్రటి దద్దుర్లలా కనిపిస్తాయి. దీనినే ‘క్రెడిల్ క్యాప్’ అని అంటారు. ఇది చంకలకు, గజ్జలకు వ్యాపిస్తుంది. వీళ్లలో దురద ఎక్కువగా ఉండకపోవచ్చు. నిర్ధారణ : వ్యాధి లక్షణాలను బట్టి దీన్ని గుర్తించవచ్చు. ఇది సోరియాసిస్‌ను పోలి ఉంటుంది. కానీ సోరియాసిన్ ముఖాన్ని ప్రభావితం చేయకపోవడం వల్ల ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించవచ్చు. * మీరు ఆందోళన చెందకండి. ఆధునిక జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని సరిచేయడం వల్ల సెబోరిక్ డర్మటైటిస్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్ యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. నేను ఉద్యోగం చేస్తుంటాను. చాలాకాలం నుంచి నాకు వేసవి కాలంలో మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ వస్తోంది. ఈ కాలంలోనే మూత్ర విసర్జన సమయంలో మంట, కొద్దికొద్దిగా రావడం, నొప్పి వంటివి వస్తున్నాయి. ప్రతి ఏటా డాక్టర్‌ను ఇలా సంప్రదించడం, మందులు వాడటం పరిపాటిగా మారింది. ఎందుకిలా జరుగుతోంది. దయచేసి కారణాలు వివరించండి. - రాణి, హైదరాబాద్ మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ రావడానికి ప్రధాన కారణం ‘ఈ-కొలై’ అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా బయట వాతావరణంలోనే ఉంటుంది. ఇది మూత్రవిసర్జన సమయంలో గానీ లేదా సెక్స్ వల్లగాని మూత్రనాళాల్లోకి వెళ్లినప్పుడు కిడ్నీకి సైతం దీనివల్ల అత్యంత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇందులో ‘క్లెబ్సియల్లా, ఇంటరోకోకస్ ఫైకలిస్’ అనే రెండు బ్యాక్టీరియాలు చాలా కీడు చేసేవి. యాంటీబయాటిక్స్ లాంటి మందులకు కూడా ఇవి లొంగవు. ఇటీవలి అధ్యయనాల వల్ల 55 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళల్లో 50 శాతం మంది దీని బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు వేసవిలోనే ఎక్కువ కాబట్టి మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వేసవిలోనే వస్తుంటాయి. సాధారణంగా మంచినీళ్లు ఎక్కువగా తాగని వారు ఈ కాలంలోనూ అదే ధోరణిని కొనసాగిస్తుంటారు. దాంతో కిడ్నీలకు సరైన మంచినీరు అందక అవి శరీర మలినాలను సరిగా శుద్ధి చేయలేవు. ఫలితంగా ఇన్ఫెక్షన్ పెరుకుపోయి మంట పుట్టడం, నొప్పి రావడంతో పాటు కొద్దికొద్దిగా మూత్రం వస్తూ ఇబ్బందులకు గురిచేస్తుంది. దీనికి తోడు శారీరక శ్రమ ఉండటం, పని ఒత్తిడికి లోనై నీళ్లు చాలాసేపు తాగకపోవడం వల్ల మూత్రనాళల్లో ఉన్న మూత్రం అలాగే కొన్ని గంటల పాటు ఉండటంతో బ్యాక్టీరియాకు అవి నివాస కేంద్రాలుగా మారి ఇన్ఫెక్షన్కు కారణమవుతుంటాయి. మూత్ర సంబంధిత సమస్యలను సాధారణంగా వైద్యులు మందులతోనే తగ్గిస్తుంటారు. మీరు మరోసారి మీ డాక్టర్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. - డా.ఎ.సూరిబాబు -
స్వైన్ ఫ్లూ : హోమియో వర్సెస్ అల్లోపతి!
-
బ్రాంకైటిస్...
ఈ సీజన్లో శ్వాస సరిగా అందకపోవడంతో దమ్ము, ఆయాసంతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ప్రస్తుతం నెలకొన్నట్లుగా ముసురు, చినుకులతో ఉన్న వాతావరణం ఉంటే చాలు కొందరిలో ఆ ప్రభావం వెంటనే కనిపిస్తుంటుంది. అంటే వాతావరణంలో మార్పు లేదా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వంటి మార్పులతో కొందరికి ఊపిరి సక్రమంగా అందదు. ఊపిరితిత్తుల్లోని శ్వాసకోశవాహికల్లోని లోపలి పొరలో సంభవించే ఇన్ఫ్లమేషన్ (వాపు) వల్ల శ్వాసకోశనాళాలు సన్నబడతాయి. దాంతో ఊపిరితీసుకోడానికి ఇబ్బంది కలుగుతుంది. ఈ కండిషన్‌నే వైద్యపరిభాషలో ‘బ్రాంకైటిస్’ అంటారు. కారణాలు చల్లటి వాతావరణం సరిపడకపోవడం జలుబు ఫ్లూ జ్వరం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నిమోనియా దుమ్మూ, ధూళి, పొగ, రసాయనాలు, సిగరెట్ పొగ వల్ల శ్వాసకోశనాళాలు సన్నబడటం పొగతాగేవారు ఉన్న కుటుంబాల్లోని చిన్నపిల్లల్లో శ్వాసకోశనాళాలు పొగ పెంపుడుజంతువుల వెంట్రుకలు గాలీ వెలుతురు సరిగా సోకని గదుల వంటి అనేక కారణాలు బ్రాంకైటిస్‌కు దోహదపడతాయి. లక్షణాలు శ్వాసనాళాలు బిగదీసుకుని పోయినట్లుగా ఉండి ఊపిరి సరిగా అందకపోవడం జ్వరం చలి కండరాలనొప్పులు ముక్కుదిబ్బడ ముక్కుకారడం గొంతునొప్పి తలనొప్పి కొన్ని సందర్భాల్లో ఒకటి నుంచి రెండు వారాల పాటు దగ్గు ఛాతీలో నొప్పి ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం పిల్లికూతలు ఆయాసం ఎక్కువదూరం నడవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలం కనిపించే అవకాశాలు శ్వాసకోశ నాళాల్లో కలిగే మార్పుల వల్ల ఆయాసం, దగ్గు, కఫం, జ్వరం, నీరసం వంటి మాటిమాటికీ కనిపిస్తూ ఒక్కోసారి అది దీర్ఘకాలం కనిపించే వ్యాధిగా మారుతుంది. దీన్నే ‘క్రానిక్ బ్రాంకైటిస్’ అని అంటారు. దీనితో రోగనిరోధకశక్తి తగ్గడం, ఆస్తమాలోకి దింపడం వంటి పరిణామాలు కూడా సంభవిస్తాయి. రోగనిర్ధారణ ఛాతీ ఎక్స్-రే కఫం కల్చర్ (స్పుటమ్ కల్చర్) పీఎఫ్‌టీ (స్పైరోమెట్రీ), పూర్తి రక్త పరీక్ష (సీబీపీ), ఈఎస్ఆర్ హోమియోలో వాడదగ్గమందులు ఆంటిమ్ టార్ట్, కార్బోవెజ్, లొబీలియా, కాలీకార్బ్, ఆర్సినికమ్, స్పాంజియా, బ్రయోనియా, ఫాస్ఫరస్, ఇపికాక్ లాంటి మందులను రోగి లక్షణాలను, మానసిక ప్రవృత్తి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మోతాదును, మందులను నిర్ణయించాల్సి ఉంటుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్