సయాటికాకు చికిత్స ఉందా? | Doctor Counseling on Back Pain | Sakshi
Sakshi News home page

సయాటికాకు చికిత్స ఉందా?

Published Thu, May 16 2019 9:29 AM | Last Updated on Thu, May 16 2019 9:29 AM

Doctor Counseling on Back Pain - Sakshi

నా వయసు 45 ఏళ్లు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటాను. నడుము నొప్పి ఎక్కువై ఎమ్మారై తీయిస్తే డిస్క్‌బల్జ్‌తో పాటు సయాటికా ఉందని అన్నారు. హోమియో వైద్యం ఉంటుందా?
– వెంకటరామ్, నాగాయలంక

ఈ రోజుల్లో సయాటికా అనే పదాన్ని వినని వారుండరు. ఈ వ్యాధి బాధితులు తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు. సయాటికాను త్వరగా గుర్తించి సరైన సమయంలో ఎలాంటి దుష్ప్రభావాలు లేని హోమియో చికిత్స చేయించుకోవడం ముఖ్యం. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఫిజియోథెరపీ, హోమియో సంపూర్ణ చికిత్సతో సయాటికా సమస్యను శాశ్వతంగా దూరం చేయవచ్చు. శరీరంలో అన్నిటికంటే పెద్దది, పొడవాటి నయం వీపు కిందిభాగం నుంచి పిరుదుల మీదుగా కాలు వెనక భాగంలో ప్రయాణిస్తుంది. దీన్ని సయాటికా నరం అంటారు. ఏదైనా కారణాల వల్ల ఈ నరం మీద ఒత్తిడి పడ్డప్పుడు ఈ నరం ప్రయాణించే మార్గంలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే... వీపు కిందిభాగం నుంచి మొదలై, తొడ, కాలివెనక భాగం, మడిమల వరకు ఆ నొప్పి పాకుతూ ఉన్నట్లుగా వస్తుంటుందన్నమాట. నొప్పితోబాటు తిమ్మిర్లు, స్పర్శ తగ్గడం, మంటలు, నడకలో మార్పు రావడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఈ సమస్యనే సయాటికా అని వ్యవహరిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా 62% మంది ఈ సమస్యతో విధులకు గైర్హాజరవుతుంటారు.

కారణాలు
నర్వ్‌ కంప్రెషన్‌ : నర్వ్‌ రూట్‌ ప్రెస్‌ అవడం వల్ల నొప్పి వస్తుంది.
స్పైనల్‌ డిస్క్‌ హర్నియేషన్‌: ఎల్‌4, ఎల్‌5 నరాల మూలాలు ఒత్తిడికి గురై సరైన పొజిషన్స్‌లో వంగక పక్కకు జరగడం వల్ల సయాటికా నొప్పి వస్తుంది.
పెరిఫార్మిస్‌ సిండ్రోమ్‌: దెబ్బలు, గాయాలు తగిలినప్పుడు పెరిఫార్మిస్‌ కండరం నర్వ్‌రూట్‌ను ప్రెస్‌ చేస్తుంది. దీనివల్ల సయాటికా నొప్పి వస్తుంది.
సాక్రోఇలియక్‌ జాయింట్‌ డిస్క్‌ ఫంక్షన్‌: శారీరక శ్రమ, వ్యాయామం లేక కీలు పనిచేయనప్పుడు సయాటికా రావచ్చు, ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ చివరినెలలో పిండం బరువు పెరిగి నర్వ్‌రూట్‌ ప్రెస్‌ అవ్వడం వల్ల సయాటికా నొప్పి వస్తుంది.

పరీక్షలు: ఎక్స్‌–రేతో పాటు ఎమ్మారై స్కాన్‌తో డిస్క్‌హెర్నియేషన్, డిస్క్‌ప్రొలాప్స్‌ నిర్ధారణ, ఏ నర్వ్‌రూట్‌ ఎక్కడ కంప్రెస్‌ అయ్యిందో నిర్ధారణ చేయవచ్చు. నొప్పి వస్తే ఏదో ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోతుందని నిర్లక్ష్యం చేసేవారు చాలామంది ఉంటారు. నొప్పి నివారణ మాత్రలు తరచూ వేసుకోవడం వల్ల సైడ్‌ఎఫెక్ట్స్‌ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీర్ణకోశవ్యవస్థకు సంబంధించిన వ్యాధులు అసిడిటీ, అల్సర్స్‌ రావచ్చు.
చికిత్స: సయాటికా నొప్పికి, వెన్నుపూస సమస్యలకు హోమియోపతిలో మంచి చికిత్స ఉంది. వైద్యపరీక్షల ఆధారంగా సయాటికా నొప్పికి కారణాలను తెలుసుకుంటారు. దాన్నిబట్టి రోగి శారీరక, మానసిక లక్షణాలను విశ్లేషించి, రోగలక్షణాలూ, మూలకారణాలను బట్టి హోమియో మందులను సూచిస్తారు. సాధారణంగా రస్టాక్స్, కిలోసింథ్, రోడోడెండ్రాన్, కాస్టికమ్‌ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన వైద్యనిపుణుల పర్యవేక్షణలో హోమియో మందులు వాడితే సయాటికా సమస్య శాశ్వతంగా నయమవుతుంది.డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా,ఎండీ (హోమియో),స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement