Doctor Consultation
-
సయాటికాకు చికిత్స ఉందా?
నా వయసు 45 ఏళ్లు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటాను. నడుము నొప్పి ఎక్కువై ఎమ్మారై తీయిస్తే డిస్క్బల్జ్తో పాటు సయాటికా ఉందని అన్నారు. హోమియో వైద్యం ఉంటుందా? – వెంకటరామ్, నాగాయలంక ఈ రోజుల్లో సయాటికా అనే పదాన్ని వినని వారుండరు. ఈ వ్యాధి బాధితులు తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు. సయాటికాను త్వరగా గుర్తించి సరైన సమయంలో ఎలాంటి దుష్ప్రభావాలు లేని హోమియో చికిత్స చేయించుకోవడం ముఖ్యం. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఫిజియోథెరపీ, హోమియో సంపూర్ణ చికిత్సతో సయాటికా సమస్యను శాశ్వతంగా దూరం చేయవచ్చు. శరీరంలో అన్నిటికంటే పెద్దది, పొడవాటి నయం వీపు కిందిభాగం నుంచి పిరుదుల మీదుగా కాలు వెనక భాగంలో ప్రయాణిస్తుంది. దీన్ని సయాటికా నరం అంటారు. ఏదైనా కారణాల వల్ల ఈ నరం మీద ఒత్తిడి పడ్డప్పుడు ఈ నరం ప్రయాణించే మార్గంలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే... వీపు కిందిభాగం నుంచి మొదలై, తొడ, కాలివెనక భాగం, మడిమల వరకు ఆ నొప్పి పాకుతూ ఉన్నట్లుగా వస్తుంటుందన్నమాట. నొప్పితోబాటు తిమ్మిర్లు, స్పర్శ తగ్గడం, మంటలు, నడకలో మార్పు రావడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఈ సమస్యనే సయాటికా అని వ్యవహరిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా 62% మంది ఈ సమస్యతో విధులకు గైర్హాజరవుతుంటారు. కారణాలు నర్వ్ కంప్రెషన్ : నర్వ్ రూట్ ప్రెస్ అవడం వల్ల నొప్పి వస్తుంది. స్పైనల్ డిస్క్ హర్నియేషన్: ఎల్4, ఎల్5 నరాల మూలాలు ఒత్తిడికి గురై సరైన పొజిషన్స్‌లో వంగక పక్కకు జరగడం వల్ల సయాటికా నొప్పి వస్తుంది. పెరిఫార్మిస్ సిండ్రోమ్: దెబ్బలు, గాయాలు తగిలినప్పుడు పెరిఫార్మిస్ కండరం నర్వ్రూట్ను ప్రెస్ చేస్తుంది. దీనివల్ల సయాటికా నొప్పి వస్తుంది. సాక్రోఇలియక్ జాయింట్ డిస్క్ ఫంక్షన్: శారీరక శ్రమ, వ్యాయామం లేక కీలు పనిచేయనప్పుడు సయాటికా రావచ్చు, ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ చివరినెలలో పిండం బరువు పెరిగి నర్వ్‌రూట్ ప్రెస్ అవ్వడం వల్ల సయాటికా నొప్పి వస్తుంది. పరీక్షలు: ఎక్స్–రేతో పాటు ఎమ్మారై స్కాన్‌తో డిస్క్‌హెర్నియేషన్, డిస్క్‌ప్రొలాప్స్ నిర్ధారణ, ఏ నర్వ్‌రూట్ ఎక్కడ కంప్రెస్ అయ్యిందో నిర్ధారణ చేయవచ్చు. నొప్పి వస్తే ఏదో ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోతుందని నిర్లక్ష్యం చేసేవారు చాలామంది ఉంటారు. నొప్పి నివారణ మాత్రలు తరచూ వేసుకోవడం వల్ల సైడ్ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీర్ణకోశవ్యవస్థకు సంబంధించిన వ్యాధులు అసిడిటీ, అల్సర్స్ రావచ్చు. చికిత్స: సయాటికా నొప్పికి, వెన్నుపూస సమస్యలకు హోమియోపతిలో మంచి చికిత్స ఉంది. వైద్యపరీక్షల ఆధారంగా సయాటికా నొప్పికి కారణాలను తెలుసుకుంటారు. దాన్నిబట్టి రోగి శారీరక, మానసిక లక్షణాలను విశ్లేషించి, రోగలక్షణాలూ, మూలకారణాలను బట్టి హోమియో మందులను సూచిస్తారు. సాధారణంగా రస్టాక్స్, కిలోసింథ్, రోడోడెండ్రాన్, కాస్టికమ్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన వైద్యనిపుణుల పర్యవేక్షణలో హోమియో మందులు వాడితే సయాటికా సమస్య శాశ్వతంగా నయమవుతుంది.డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,ఎండీ (హోమియో),స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
రోగులను చూసేది రెండు నిమిషాలే..
లండన్: భారత్‌లో రోగులను పరీక్షించేందుకు సగటున రెండు నిమిషాల సమయాన్ని మాత్రమే వైద్యులు వెచ్చిస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా స్వీడన్లో 22.5 నిమిషాలు, అత్యల్పంగా బంగ్లాదేశ్‌లో 48 సెకన్ల సమయాన్ని రోగులను పరీక్షించేందుకు వైద్యులు కేటాయిస్తున్నారని స్పష్టమైంది. ప్రపంచవ్యాప్తంగా 67 దేశాల్లోని 28.5 మిలియన్ల కన్సెల్టేషన్స్‌పై నిర్వహించిన సర్వేలలోని సమాచారం ఆధారంగా పరిశోధకులు ఈ మేరకు అంచనాకు వచ్చారు. అధ్యయన వివరాలు బ్రిటీష్ మెడికల్ జర్నల్ బీఎమ్‌జేలో ప్రచురితమయ్యాయి. 2015లో భారత్‌లో రోగులను కేవలం రెండు నిమిషాలు మాత్రమే వైద్యులు పరీక్షించేవారని, అదే పాకిస్తాన్లో 1.79నిమిషాలు మాత్రమే కేటాయిస్తారని పేర్కొంది. -
దో మినిట్.. బస్
లండన్ : వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్లితే.. అక్కడి వైద్యులు రోగులు చెప్పేది(అనారోగ్యం గురించి) ఎంత శ్రద్ధగా వింటున్నారో తెలియజేస్తూ లండన్‌కు చెందిన ఓ సంస్థ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం భారతదేశంలో సగటున ఓ రోగిని వైద్యుడు కేవలం రెండే రెండు నిమిషాలు మాత్రమే పరిశీలిస్తున్నారంట(కన్సల్టేషన్ టైం). ఈ విషయాన్ని బ్రిటీష్ మోడల్ జర్నల్‌కు చెందిన బీఎంజే ఓపెన్ సంస్థ పరిశోధన చేసి నివేదికను విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ, ప్రభుత్వ, ప్రైవేట్ ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇలా వైద్యం అందించటం మూలంగానే వారి ప్రాణాలు ముప్పు బారిన పడుతున్నాయంట. వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ.. ఓవైపు వ్యాపార ధృక్పథం పెరిగిపోవటం.. మరోవైపు వైద్యులపై ఒత్తిడి ఇందుకు కారణాలు అవుతున్నాయని ఆ నివేదిక పేర్కొంది. అయితే ఆ ప్రభావం ప్రభుత్వ ఆస్పత్రులపైనే ఎక్కువగా ఉందని చెబుతున్నారు న్యూఢిల్లీలోని ఆకాశ్ హెల్త్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశిశ్ చక్రవర్తి. ఒత్తిడి కారణంగానే ప్రభుత్వ వైద్యులు ఇలా తక్కువ సమయం వారిని పరిశీలించాల్సి వస్తుందని చెబుతున్నారు. గరిష్ఠ జనాభా ప్రభుత్వాసుపత్రుల వైద్యం కోసం ఎగబడటం.. వారికి లక్ష్యాలు విధించటం.. ఆ సమయంలో ఒక్క గంట, రెండు గంటల్లోనే వంద మందిని వైద్యులను చూడాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం ఆయన చేశారు. కార్పొరేట్ వైద్య రంగంలో మాత్రం అది సవ్యంగానే ఉంటుందని ఆయన చెప్పారు. ఇక కన్సల్టేషన్ సమయం వివిధ దేశాల్లో ఎలా ఉందో పరిశీలిస్తే... స్వీడెన్ లో గరిష్టంగా ఒక వైద్యుడు ఫెషెంట్ను 22.5 నిమిషాలపాటు పరిశీలిస్తాడంట. భారత్ లో(2015) 2 నిమిషాలు, మన పొరుగున ఉన్న పాక్‌లో తక్కువగా 1 నిమిషం 79 సెకన్లు, మొత్తం మీద అతి తక్కువగా బంగ్లాదేశ్‌లో కేవలం 48 సెకన్లు మాత్రమే ఓ వైద్యుడు సగటున రోగికి సమయం కేటాయిస్తున్నారని బీఎంజే ఓపెన్ నివేదిక చెబుతోంది. -
క్లిక్ చేస్తే డాక్టర్!
• కన్సల్టెన్సీ సేవలందిస్తున్న ఐక్లినిక్ • మన దేశంతో పాటూ 150 దేశాల్లో సేవలు • రూ.15 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : నర్సింగ్ సేవలు అక్కర్లేదు. పరీక్షలూ అక్కర్లేదు. కేవలం డాక్టర్ కన్సల్టేషన్ దొరికితే చాలు. మరి దానికోసం వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిందేనా? లేదంటే వైద్యుడిని ఇంటికి పిలవాల్సిందేనా? అదేమీ అవసరం లేదంటోంది ఐక్లినిక్. ఇండియాతో పాటు అమెరికా, సింగపూర్, జర్మనీ ఇలా 160 దేశాల్లో సేవలందించే స్థాయికి ఎదిగిన ఈ స్టార్టప్ వ్యవస్థాపకుడు... తమిళనాడుకు చెందిన ధృవ్ సుయంప్రకాశం ఏమంటారంటే... ⇔ రూ.5 లక్షల పెట్టుబడితో 2012లో ఐక్లినిక్.కామ్‌ను ప్రారంభించాం. 160 దేశాల్లో ఎక్కడైనా, డాక్టర్‌తో అపాయింట్మెంట్ కల్పించడమే ఐక్లినిక్ ప్రత్యేకత. ఇంకా చెప్పాలంటే వైద్యులకు, పేషెంట్లకు మధ్య వారధిలా ఉంటుంది ఐక్లినిక్. ⇔ ప్రస్తుతం మా వద్ద 1,500 మంది వైద్యులు రిజిస్టరై ఉన్నారు. ఇందులో 80 మందికి పైగా డాక్టర్లు స్పెషలిస్టులే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 200 మంది డాక్టర్లు నమోదయ్యారు. ఇప్పటివరకు 2 లక్షల మంది మా సేవలను పొందారు. అమెరికా, మధ్యప్రాచ్య దేశాల నుంచి ఎక్కువ కన్సల్టేషన్ కాల్స్ వస్తున్నాయి. ⇔ వెబ్సైట్, యాప్ ద్వారా మాత్రమే కాకుండా టెలిగ్రాం, ఇన్స్టంట్ మెసెంజర్ యాప్ ద్వారా మా సేవలను వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా పేషెంట్లు తమ వైద్య రిపోర్ట్‌లను, మందుల చీటీలను వైద్యుడికి పంపిస్తూ నేరుగా సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ప్యాకేజీలను బట్టి చార్జీ ఉంటుంది. ప్రారంభ ధర రూ.99. ⇔ ప్రతి కన్సల్టేషన్‌కు కమీషన్ రూపంలో ఫీజు తీసుకుంటాం. ఉదాహరణకు డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు రూ.100 అనుకుంటే.. అందులో రూ.29 కమీషన్ తీసుకొని మిగిలింది వైద్యుడికి చెల్లిస్తాం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 280 శాతం వృద్ధిని నమోదు చేశాం. ⇔ ప్రస్తుతం మా సంస్థలో 12 మంది ఉద్యోగులున్నారు. ఇటీవలే డాక్టర్ మదన్ రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టారు. సహ వ్యవస్థాపకుడి హోదాలో సేవలందిస్తున్నారు. మరో 6 నెలల్లో రూ.15 కోట్ల నిధుల సమీకరిస్తాం. ఇద్దరు పీఈ ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం కూడా. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...