
లండన్: భారత్‌లో రోగులను పరీక్షించేందుకు సగటున రెండు నిమిషాల సమయాన్ని మాత్రమే వైద్యులు వెచ్చిస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా స్వీడన్‌లో 22.5 నిమిషాలు, అత్యల్పంగా బంగ్లాదేశ్‌లో 48 సెకన్ల సమయాన్ని రోగులను పరీక్షించేందుకు వైద్యులు కేటాయిస్తున్నారని స్పష్టమైంది. ప్రపంచవ్యాప్తంగా 67 దేశాల్లోని 28.5 మిలియన్ల కన్సెల్టేషన్స్‌పై నిర్వహించిన సర్వేలలోని సమాచారం ఆధారంగా పరిశోధకులు ఈ మేరకు అంచనాకు వచ్చారు.
అధ్యయన వివరాలు బ్రిటీష్ మెడికల్ జర్నల్ బీఎమ్‌జేలో ప్రచురితమయ్యాయి. 2015లో భారత్‌లో రోగులను కేవలం రెండు నిమిషాలు మాత్రమే వైద్యులు పరీక్షించేవారని, అదే పాకిస్తాన్‌లో 1.79నిమిషాలు మాత్రమే కేటాయిస్తారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment