సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగిని స్ట్రెచర్‌లో వార్డుకు తరలించేందుకు సిబ్బంది ఎవరూ లేక పోవడంతో బంధువులే కాళ్లు పట్టుకుని ఈడ్చుకు వెళ్లిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని డీఎంఈ రమేశ్‌రెడ్డిని ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణకు రూ.లక్షల్లో వెచ్చిస్తున్నప్పటికీ రోగులకు స్ట్రెచర్లు, వీల్‌చైర్లు అందుబాటులో ఉంచకపోవడంపై మంత్రి సీరియస్ అయినట్లు తెలిసింది.
జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సైతం ఆస్పత్రి సిబ్బందిపై తీవ్రంగా సీరియస్ అయ్యారు. స్ట్రెచర్ లేకుండా రోగిని బంధువులే కాళ్లు పట్టు కుని లిఫ్ట్ వరకు ఈడ్చుకెళ్లిన వీడియో ఫుటేజీని పరిశీలించా రు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్‌ను ఆదేశించారు. కాగా, ఈ ఘటనపై డాక్టర్ ప్రతిమారాజ్ మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిలో స్ట్రెచర్లు, వీల్‌చైర్ల కొరత లేదన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి 10 సెకండ్ల పాటు వీడియో తీసి 15 రోజుల తర్వాత వైరల్ చేయటం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తనకు తెలియదన్నారు.
ఈనెల 1న ఆస్పత్రికి వచి్చన రోగి బోధన్ మండలం అచన్‌పల్లి గ్రామానికి చెందిన హన్మాండ్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. అయితే.. సూపరింటెండెంట్ తన తప్పును సరిదిద్దుకోకుండా కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు దేగాం యదాగౌడ్ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు.
మారని తీరు..
కాగా, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిపై ఎన్ని ఆరోపణలు వచి్చనా సిబ్బంది తీరు మారడం లేదు. స్ట్రెచర్, వీల్ చైర్లపై రోగులను తరలించాల్సి ఉండగా వాటర్ బాటిళ్లు, వాటర్ క్యాన్‌లు, బెడ్ షీట్‌లు తరలిస్తున్న దృశ్యం శనివారం ఆస్పత్రికి వెళ్లిన ‘సాక్షి’ కి కనిపించింది. రోగులను వార్డులోని డాక్టర్ల వద్దకు తుప్పు పట్టిన వీల్ చైర్లపై బంధువులే తోసుకుంటూ వెళ్తున్న దృశ్యం కంటపడింది.
Comments
Please login to add a commentAdd a comment