భువనగిరి ఖిల్లాపై డీజీపీ కుమార్తె సాహసం
నల్లగొండ జిల్లాలోని భువనగిరి ఖిల్లాను డీజీపీ అనురాగ్ శర్మ భార్య, కుమార్తె సోమవారం ఉదయం సందర్శించారు. వీరి వెంట ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. డీజీపీ కుమర్తె, ఇద్దరు విదేశీయులు ఖిల్లాపైకి ఎక్కి పరిశీలించారు. అనంతరం ఖిల్లాలో ఏర్పాటు చేసిన రాఫ్టింగ్ సెక్షన్ లో సాహసాలు చేశారు. ఖిల్లా పై నుంచి తాడు సాయంతో కిందకు దిగారు. ఈ పర్యటనలో డీజీపీ కుటుంబ సభ్యులతో పాటు.. డీఎస్పీ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు.