
సాక్షి, నల్గొండ: తెలంగాణలోని హుజూర్‌నగర్ శాసనసభ స్థానానికి అక్టోబర్ 21న ఉప ఎన్నిక జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మీడియాతో మాట్లాడారు. హుజుర్‌నగర్‌లో టీఆర్‌ఎస్సే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్ ఉత్త మెంటల్ కేసని..మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండడని ఆరోపించారు. ఆమె ప్రజలకు అందుబాటులో ఉండదని తెలిసే.. పద్మావతిని కోదాడలో ఓడించారని పేర్కొన్నారు. పద్మావతి ఓడిపోతుందని.. ఆమెను గెలిపిస్తామన్న నేతలకు కూడా తెలుసని లింగయ్య స్పష్టం చేశారు.
ఇక పోతే హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి ఖరారయినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.