హైదరాబాద్,సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. మొదటిసారిగా ఓ రాజకీయ నాయకుడిని పోలీసులు విచారణకు పిలిచారు. తమ ఎదుట హాజరుకావాలంటూ బీఆర్‌ఎస్ పార్టీ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేశారు. అయితే సోమవారం(నవంబర్ 11) లింగయ్య ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన రాలేదు. అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయానని పోలీసులకు కబురందించారు. ఈ నెల 14వ తేదీన విచారణకు హాజరవుతానని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న బృందం.. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం కేంద్రంగా తమ విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేసింది. ఇప్పటిదాకా కేవలం పోలీస్ అధికారులు(మాజీ)లనే విచారణ జరిపిన దర్యాప్తు బృందం.. తొలిసారి ఓ రాజకీయ నేతను ప్రశ్నిస్తుండడం గమనార్హం. లింగయ్యనే కాకుండా పలువురు ఇతర నేతలను కూడా ఈకేసులో విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment