కొడుకును చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు | they treated as suicide attempt on my son | Sakshi
Sakshi News home page

కొడుకును చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు

Published Fri, Dec 12 2014 11:26 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

కొడుకును చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు - Sakshi

కొడుకును చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు

మునిపల్లి :  ‘నా కొడుకును చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారు.. నిందితులు గ్రామంలోనే ఉన్నారు.. వారిని పట్టుకుని కఠినంగా శిక్షించి నాకు న్యాయం చేయండి’ అని బాధిత తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. వివరాలిలా ఉన్నాయి.. రాయికోడ్ మండలం సంగాపూరం గ్రామానికి చెందిన ఉప్పరి అశోక్ గురువారం అనుమానాస్పద స్థితిలో మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామ శివారులో మృతి చెందిన విషయం తెలిసిందే. సంగాపురం గ్రామానికి చెందిన ఉప్పరి లక్ష్మయ్య, నర్సమ్మ దంపతులకు ఇద్దరు కుమారులతో పాటు ఇద్దరు కుమార్తెలున్నారు. లక్ష్మయ్య వీరందరికీ వివాహాలు చేయగా.. పదేళ్ల క్రితం లక్ష్మయ్య పెద్దకుమారుడు సంగయ్య మృతి చెందాడు.

ఉన్న ఒక్కగానొక్క కుమారుడు అశోక్‌తో తనకున్న కొద్ది పాటి భూమితో వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే దాయాదులతో అశోక్‌కు గొడవలుండేవి. ఇదిలా ఉండగా.. గురువారం మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామ శివారులో అశోక్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న బుదేరా ఎస్‌ఐ, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న మృతుడి తల్లిదండ్రులతో ఎస్‌ఐ మాట్లాడారు.

ఎవరిపైనైనా అనుమానం ఉందా అని ప్రశ్నించగా.. అనుమానితుల్లో ఒక్కరు ఇక్కడే ఉన్నాడని చెప్పడంతో ఎస్‌ఐ అక్కడే ఉన్న ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎస్‌ఐ గ్రామస్తులతో మాట్లాడి వివరాలు రాబపట్టారు. మృతుడి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. భార్యాభర్తల చిన్నపాటి గొడవతో మృతుడి భార్య (సరిత) సావిత్రి నాలుగు నెలల క్రితం తన పుట్టింటికి వెళ్లినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement