నిజామాబాద్: స్నానంకోసం నదిలోకి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తడుపాకల్‌లోని గోదావరి నదీతీరంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. అదే మండలం పాలెం గ్రామానికి చెందిన చింటు(18) అనే యువకుడు శుక్రవారం ఉదయాన్నే స్నానం చేయడానికి గోదావరి నదిలో దిగాడు.
ప్రమాదవశాత్తు జారిపడి నీరు ఎక్కువ ఉన్న ప్రాంతంలోకి కొట్టుకుపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో ఊపిరాడక మృతిచెందాడు. ఈ విషయాన్ని గమనించిన కొందరు స్థానికులు మృతదేహాన్ని బయటకు తెచ్చారు. తాజాగా రెండు గంటల వ్యవధిలోనే మరో వ్యక్తి జారిపడటం భయాందోళనకు గురి చేస్తోంది.
గోదావరిలో పడి యువకుడి మృతి
Published Fri, Apr 10 2015 11:50 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
Advertisement
Advertisement