మేయర్ దంపతుల హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ ఆచూకి తెలుసుకోవడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా.. ఈనెల 17న మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ దారుణ హ్యతకు గురైన రోజు నుంచి అజ్ఞాతంలో ఉన్న చింటూ.. దేశ సరిహద్దులు దాటి పోయి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టీ.. చింటూ శ్రీలంకకు వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై. నెల్లూరు, పాండిచ్చేరి మార్గాల్లో ఏదో ఒక చోటి నుంచి చింటూ సరిహద్దులు దాటి ఉంటాడని భావిస్తున్నారు.
మెరైన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన చింటూ.. కొంత కాలం ఓడల్లో పనిచేశాడు. అతడికి ప్రపంచ వ్యప్తంగా 20 దేశాల్లో పట్టు ఉంది. ఓడల్లో పనిచేసే చాలా మందితో మంచి సంబంధాలు ఉన్నాయి. చింటూ పాస్ పోర్టు పోలీసులు సీజ్ చేసిన నేపధ్యంలో తనకున్న పరిచయాలతో దేశం దాటి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
మరో వైపు చింటూ ఎక్కడ ఉన్న పట్టుకుని తీరతామని పోలీసులు స్పష్టం చేశారు. దారుణ హత్యా కాండకు పాల్పడ్డ వ్యక్తిని ఎట్టిపరిస్ధితుల్లో వదిలేది లేదంటున్నారు. చింటూ ఆచూకీ పట్టుకోవడం కోసం ఒక పోలీసుల బృందం శ్రీలంక వెళ్లేందుకు సిద్ధమైతున్నట్లు తెలిసింది.
చింటూ శ్రీలంక వెళ్లాడా..?
Published Wed, Nov 25 2015 5:51 PM | Last Updated on Sun, Sep 3 2017 1:01 PM
Advertisement