kathari anuradha
-
ఏప్రిల్ 15లోపు ఎన్నిక నిర్వహించండి: హైకోర్టు
హైదరాబాద్‌సిటీ: చిత్తూరు మేయర్ స్థానానికి ఏప్రిల్ 15లోపు ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. 2015 సంవత్సరం నవంబర్ నెలలో చిత్తూరు మేయర్ కఠారీ అనురాధ దంపతులు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో హత్యకు గురైన సంగతి తెల్సిందే. అప్పటి నుంచి మేయర్ ఎన్నిక నిర్వహించకుండా ఆ స్థానం ఖాళీగా ఉంచారు. కొత్త మేయర్ ని ఎన్నుకోకుండా ఖాళీగానే ఉంచారని, దానివల్ల చిత్తూరు ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని, వెంటనే కొత్త మేయర్ కు ఎన్నిక జరపాలంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. దీనిపై శుక్రవారం విచారించిన హైకోర్టు వచ్చే నెల 15లోపు ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. -
చింటూ శ్రీలంక వెళ్లాడా..?
మేయర్ దంపతుల హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ ఆచూకి తెలుసుకోవడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా.. ఈనెల 17న మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ దారుణ హ్యతకు గురైన రోజు నుంచి అజ్ఞాతంలో ఉన్న చింటూ.. దేశ సరిహద్దులు దాటి పోయి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టీ.. చింటూ శ్రీలంకకు వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై. నెల్లూరు, పాండిచ్చేరి మార్గాల్లో ఏదో ఒక చోటి నుంచి చింటూ సరిహద్దులు దాటి ఉంటాడని భావిస్తున్నారు. మెరైన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన చింటూ.. కొంత కాలం ఓడల్లో పనిచేశాడు. అతడికి ప్రపంచ వ్యప్తంగా 20 దేశాల్లో పట్టు ఉంది. ఓడల్లో పనిచేసే చాలా మందితో మంచి సంబంధాలు ఉన్నాయి. చింటూ పాస్ పోర్టు పోలీసులు సీజ్ చేసిన నేపధ్యంలో తనకున్న పరిచయాలతో దేశం దాటి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు చింటూ ఎక్కడ ఉన్న పట్టుకుని తీరతామని పోలీసులు స్పష్టం చేశారు. దారుణ హత్యా కాండకు పాల్పడ్డ వ్యక్తిని ఎట్టిపరిస్ధితుల్లో వదిలేది లేదంటున్నారు. చింటూ ఆచూకీ పట్టుకోవడం కోసం ఒక పోలీసుల బృందం శ్రీలంక వెళ్లేందుకు సిద్ధమైతున్నట్లు తెలిసింది. -
చింటూ ఆచూకీ తెలిపితే రూ.లక్ష రివార్డు
చిత్తూరు: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రశేఖర్ అలియాస్ ఆచూకీ తెలిపితే రూ. లక్ష రివార్డు అందజేస్తామని అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. మేయర్ దంపతుల హత్య జరిగిన కార్పొరేషన్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మేయర్ నివాసానికి బయలు దేరారు. మేయర్ దంపతుల హత్య కేసు విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారిగా రాయలసీమ రేంజ్ ఆర్పీ ఠాకూర్ ను ప్రభుత్వం నియమించిని సంగతి తెలిసిందే. అయితే ర నిందితుడిగా ఉన్న చింటూ అలియాస్ చంద్రశేఖర్ గురువారం పోలీసులకు లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. తొలుత ఇతడు గుడిపాల పోలీసు స్టేషన్లో లొంగిపోయినట్లు వార్తలొచ్చాయి. అయితే చింటూ తన న్యాయవాదితో కలిసి పుత్తూరులో అక్కడి పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. చింటూను శనివారం మీడియా ఎదుట చూపనున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. -
చింటూ లొంగుబాటు ?
చిత్తూరు(అర్బన్): చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ అలియాస్ చంద్రశేఖర్ గురువారం పోలీసులకు లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. తొలుత ఇతడు గుడిపాల పోలీసు స్టేషన్లో లొంగిపోయినట్లు వార్తలొచ్చాయి. అయితే చింటూ తన న్యాయవాదితో కలిసి పుత్తూరులో అక్కడి పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. రాయలసీమ అదనపు డీజీ ఆర్పీ. ఠాకూర్ గురువారం రాత్రి చిత్తూరు నగరానికి చేరుకున్నారు. నగరంలోని పోలీసు అతిథిగృహంలో ఉన్న ఆయన ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్‌తో కలిసి చింటూ కేసును సమీక్షిస్తున్నారు. చింటూ నుంచి హత్యకు సంబంధించిన వాంగ్మూల పత్రం, నిందితులు ఎవరెవరు పాల్గొన్నారు ? అసలు ఎందుకు కక్షలొచ్చాయనే వివరాల రిపోర్టును తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. చింటూను శనివారం మీడియా ఎదుట చూపనున్నట్లు తెలుస్తోంది. -
మేయర్ ను చంపింది చింటూనే..!
♦ సూత్రధారి, పాత్రధారి అతనేనని నిర్ధారణ ♦ మేయర్ దంపతులు సహా ఐదుగురు టార్గెట్ ♦ దుండగుల టార్గెట్‌లో మేయర్ కొడుకు, ఓ కార్పొరేటర్ ♦ గంట నుంచి మేయర్ వెంటే రెక్కీలో పాల్గొన్న వైనం ♦ పోలీసుల విచారణలో వెల్లడైన వాస్తవాలు సాక్షి, చిత్తూరు: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్యలో ప్రధాన నిందితుడు మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూగా పోలీసులు నిర్ధారించారు. మేయర్ దంపతులను మట్టుబెట్టేందుకు చేసిన హత్యాకాండలో సూత్రధారి, పాత్రధారి చింటూనే అని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసుల వద్ద ఇద్దరు లొంగిపోగా, ప్రధాన నిందితుడు చింటూను పోలీసులు వెంటాడి పట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. విచారణలో నిందితులు వెల్లడించిన విషయాలకు పోలీసులే దిగ్భ్రాంతికి గురైనట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. మేయర్ దంపతులను హత్య చేయాలని వ్యూహరచన చేసిన చింటూ తన సన్నిహితులు మంజునాథ్, వెంకటేష్‌తో పాటు ఇద్దరు కిరాయి హంతకుల సాయం తీసుకున్నాడు. కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్‌తో పాటు ఆమె భర్త కఠారి మోహన్, కుమారుడు ప్రవీణ్, సంతపేటకు చెందిన కార్పొరేటర్ కమల ప్రసాద్ అలియాస్ కంద, మోహన్‌కు నమ్మినబంటుగా ఉంటున్న ప్రసన్నను హతమార్చాలని స్కెచ్ వేశాడు. అయితే మంగళవారం ప్రవీణ్, ప్రసన్న వేర్వేరు పనుల్లో బయటకు వెళ్లడంతో వారి ప్రాణాలు నిలిచాయి. మేయర్‌ను ఆమె చాంబర్లోనే హత్య చేసేటప్పుడు తానెవరో తెలిసేందుకే ముఖానికి ఉన్న బురఖాను తొలగించాడు. చింటూను చూసి నిశ్చేష్టురాలైన మేయర్ కుర్చీలో నుంచి కిందకు దిగి, నేలపై కూర్చుని, ‘వద్దురా.. నన్ను చంపొద్దురా..’ అని రోదిస్తూ ప్రాధేయపడినా కర్కశంగా పిస్టల్‌తో ఆమెను కాల్చేశాడు. అనంతరం కఠారి మోహన్‌పై కిరాయి హంతకులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. అలాగే, చింటూ ఆయనపై కాల్పులు జరిపాడు. తరువాత ‘ వాడెక్కడరా..? కందా ఎక్కడ..?’ అంటూ రెండు గదుల్లో వెతుకుతూ దుండగులు పారిపోయారు. అప్పటికే కార్పొరేటర్ కందా పరుగులు పెడుతూ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న మరో గదిలో దాక్కోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మారణకాండకు గంట ముందు నుంచే దుండగుల్లో ఇద్దరు ముసుగులు ధరించి మేయర్ వెంటే ద్విచక్రవాహనాల్లో వెంబడించారు. ఈ ప్రణాళికలో దుండగులు రెండు పిస్టళ్లను వాడినట్లు తెలుస్తోంది. ఒకటి సంఘటన స్థలంలోని మరుగుదొడ్డిలో పడేసి పారిపోగా, మరో పిస్టల్‌ను పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసుల అదుపులో ముగ్గురు దుండగులు ఉండగా, కిరాయికి వచ్చిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మేయర్ తలలో బుల్లెట్ చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ భౌతిక కాయానికిబుధవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆ వివరాలను వైద్యులు వెల్లడించారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో మేయర్ తలపై పిస్టల్‌తో కాల్చడం వల్ల బుల్లెట్ అనురాధ తలలో ఉండిపోయిందని పోస్టుమార్టం చేసిన వైద్యులు తెలిపారు. దీనివల్ల తలలో రక్తం గడ్డ కట్టడంతోబాటు పుర్రె ఎముకలు పగిలిపోయి, తీవ్ర రక్తస్రావం సంభవించి ఆమె చనిపోయినట్లు వెల్లడించారు. శవపరీక్ష పూర్తయిన తరువాత అనురాధ భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రశాంతంగా చిత్తూరు బంద్ చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్యకు నిరసనగా జిల్లా కాపునాడు చిత్తూరు బంద్‌కు పిలుపునిచ్చింది. నగరంలో వ్యాపారులంతా స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయటకు కదల్లేదు. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు వీరే హత్య కేసులో పోలీసుల ఎదుట లొంగిపోయిన వారు వెంకటాచలం, మంజుగా తెలుస్తోంది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూకు వీళ్లిద్దరూ అనుచరులు. చిత్తూరు సమీపంలోని ఓ పోలీసు స్టేషన్లో నిందితులను విచారణ చేస్తున్నారు. పారిపోతూ పట్టుబడ్డ వ్యక్తి చింటూగా భావిస్తున్నారు. హత్యాకాండలో మొత్తం ఐదుగురు పాల్గొన్నట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సీఎం సీరియస్ కఠారి దంపతుల దారుణ హత్యకు సంబంధించి పోలీసులు, ఇంటెలిజెన్స్ వైఫల్యంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ భౌతిక కాయాలను సందర్శించి నివాళులర్పించారు. -
చిత్తూరు బంద్ ప్రశాంతం
చిత్తూరు నగర మేయర్ దంపతుల హత్యకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు నడవటం లేదు. దుకాణాలు, సినిమా హాళ్లు, విద్యా, వాణిజ్య సంస్థలు మూత బడ్డాయి. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, మేయర్ కఠారి అనూరాధ, మోహన్ దంపతుల భౌతికకాయాలను మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు. సాయంత్రం 2.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు చేరుకుంటారు. అనంతరం మేయర్ దంపతుల అంత్యక్రియలు జరుగనున్నాయి. -
మేయర్ హత్య జరిగిన తీరు ఇలా..
తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు మేయర్ అనూరాధ, ఆమె భర్త మోహన్‌లపై దాడికి దుండగులు పక్కాగా ప్లాన్ చేసుకుని వచ్చారు. కార్పొరేషన్లో నిర్వహించే గ్రీవెన్స్ డే సందర్భంగా ఆమెకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలనే పేరుతో నలుగురు వ్యక్తులు మేయర్ ఛాంబర్లోకి వచ్చారు. నలుగురూ బురఖాలు ధరించి వచ్చారు. ఒక్కసారిగా లోపలకు వస్తూనే మేయర్‌పై కాల్పులు జరిపారు, మోహన్‌పై కత్తులతో దాడి చేశారు. దాంతో మేయర్ అక్కడికక్కడే మరణించారు. ఈ దాడితో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉండేవాళ్లు భయపడి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు తప్ప వచ్చిన వాళ్లెవరూ చూసే సాహసం కూడా చేయలేకపోయారు. దాదాపు 15 రోజుల నుంచి నెల రోజుల పాటు పక్కాగా ప్లాన్ చేసుకుని చేసిన హత్య అని పోలీసులు భావిస్తున్నారు. మేయర్ ఏ సమయానికి కార్పొరేషన్‌కు వస్తారో అన్నీ ముందుగానే చూసుకుని వచ్చి ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి నలుగురు వ్యక్తులు గ్రూపుగా వచ్చి ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు దుండగుల లొంగుబాటు మేయర్ అనురాధ హత్యకేసులో ఇద్దరు దుండగులు చిత్తూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. మంగళవారం మధ్యాహ్నం మేయర్ దంపతులపై కాల్పులు జరిపిన తర్వాత.. తామే కాల్పులు జరిపామంటూ ఇద్దరు వ్యక్తులు లొంగిపోయారు. కానీ వాళ్ల వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్పెషల్ బ్రాంచి డీఎస్పీ రామ్‌కుమార్, క్రైమ్ బ్రాంచి డీఎస్పీ రామకృష్ణ ఆధారాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. -
చిత్తూరు ‘దేశం’లో అసమ్మతి రాగం !
కౌన్సిల్లో కార్పొరేటర్ కు భంగపాటు ఆదికేశవులునాయుడు ఫొటోతో ధర్నా పాలకవర్గంపై అవినీతి ఆరోపణలు చిత్తూరు (అర్బన్) : చిత్తూరు తెలుగుదేశం పార్టీలో అసమ్మతి రాగానికి మళ్లీ తెరతీసింది. ఇప్పటికే నగర మేయర్ కఠారి అనురాధ, ఎమ్మెల్యే సత్యప్రభ మధ్య ఉన్న విభేదాలు తార స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా కార్పొరేటర్ల మధ్య కూడా వర్గవిభేదాలు పొడచూపాయి. శనివారం చిత్తూరులో కార్పొరేషన్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం ఏర్పాటైన ప్రత్యేక సమావేశం ఇందుకు వేదికయింది. సమావేశం ప్రారంభమవగానే ఎమ్మెల్యేలు లేరని, కో-ఆప్ష న్ సభ్యుల జాబితా ఇవ్వనందున సమావేశం వాయిదా వేయాలని సభ్యులు పట్టుబట్టారు. సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. అయితే దీనిపై 27వ డివిజన్ కార్పొరేటర్ ఇందు (టీడీపీ) అభ్యంతరం వ్యక్తం చేశారు. తన డివిజన్లో మూడిళ్లకు ఒక నీటి ట్యాంకరు వస్తోందని, వార్డు సమస్యలు తీర్చడంలో పాలకవర్గం, అధికారులు వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. ఇంతలో పక్కనున్న కొందరు కార్పొరేటర్లు(టీడీపీ) కల్పించుకుని ఇందును కూర్చోమని వారించారు. ఆమె సమస్యలను ప్రస్తావిస్తుండగానే సభ్యులంతా లేచి వెళ్లిపోయారు. దీంతో ఇందు తీవ్ర మనస్తాపానికి గురై కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. మాజీ ఎంపీ ఆదికేశవులునాయుడు ఫొటో పెట్టుకుని నిరసన వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతం లో చిత్తూరు కార్పొరేషన్లో ఉన్న అవినీతి ఇప్పుడు కూడా కొనసాగుతోందన్నారు. మహి ళా కార్పొరేటర్‌గా సమస్యల్ని ప్రస్తావిస్తుంటే కొందరు సభ్యులు తనను అడ్డుకోవడం, గదమాయించడం ఎంత వరకు సమంజమని ప్రశ్నించారు. పెద్దల అండ ఉంటే కావాల్సిన వారికి పాలకవర్గం అన్ని పనులు చేస్తోందని దుయ్యబట్టారు. తమలాంటి బడుగులకు ఇక్కడ మాట్లాడే హక్కు కూడా కల్పించకపోవడం అన్యాయమన్నారు. మహిళా మేయర్ ఉన్న కార్పొరేషన్లో సాటి మహిళను అవమానిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధికారపక్షంలో ఉన్నప్పటికీ ఇక్కడ జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించి తీరుతానని స్పష్టం చేశారు. అనంతరం కమిషనర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ వచ్చి సర్ది చెప్పడంతో ఇందు నిరసన విరమించారు. కుదరని సయోధ్య... చిత్తూరు నగర పాలక సంస్థ పాలకవర్గంలో 38 మంది టీడీపీ కార్పొరేటర్లు, నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, 8 మంది స్వతంత్రులు. ఏ ఒక్క అంశాన్నైనా ఆమోదించాలన్నా, తిరస్కరించాలన్నా టీడీపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. అభ్యంతరం వ్యక్తం చేస్తే ప్రతిపక్షమో, స్వతంత్య్ర అభ్యర్థులో చేయాలి. కానీ పాలకవర్గం తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీ సభ్యుల మధ్య సఖ్యతను అనుమానించే విధంగా ఉంది. ఇటీవల పాలక మం డలి కౌన్సిల్ సమావేశాల్లో చోటు చేసుకుం టున్న సంఘటనలు ఇందుకు నిదర్శనం. కౌన్సిల్ సమావేశానికి ముందుగానే సమావేశంలో ఏయే అంశాలకు సంబంధించి నోట్‌ఫైల్ పెట్టాలో అధికారులు మేయర్‌తో చర్చించి అజెండాలో చేరుస్తారు. ఈ నెల 11న జరిగిన చిత్తూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో 36 అంశాలను మేయర్ అనుమతితోనే అధికారులు అజెండాలో ఉంచారు. మేయర్ సంతకంతో కార్పొరేటర్లకు ప్రతులు అందాయి. అం టే దాదాపు అన్ని అంశాల్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లే అవుతుంది. కానీ కౌన్సిల్ సమావేశానికి వచ్చే సరికి 36 అంశాల్లో 26 మాత్రమే ఆమోదం పొందాయి. మిగిలిన పది అంశాలు ఆమోదం పొందలేదు. ఇక శనివారం కో- ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కూడా వాయిదా పడింది. అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు సభకు రాలేరని, కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల జాబితా ఇవ్వలేద ని సమావేశం వాయిదా వేశారు. కానీ వాస్తవానికి కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం మేయర్ అనుమతితో ఈ నెల 21వ తేదీనే సమావేశం నిర్వహించాలని అధికారులు ఖరారు చేశారు. అయితే సీఎంతో మేయర్ భేటీ ఉండటంతో, మేయర్ అభ్యర్థన మేరకు 23న ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి అధికారులు తేదీ మార్చారు. తీరా సమావేశానికి సభ్యులు హాజరైన తరువాత అసెంబ్లీ ఉందని, తమకు తుది జాబితా అందలేదని చెబుతూ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ పరిణామాలు టీడీపీ కార్పొరేటర్ల మధ్య వర్గ విభేదాలకు ఆజ్యం పోశాయూనే విషయూన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. -
‘పుర' పాలకులు
సాక్షి, చిత్తూరు: చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల పాలకవర్గాలు గురువారం కొలువుదీరాయి. చిత్తూరు తొలి మేయర్‌గా కఠారి అనురాధ ఎన్నికయ్యారు. డెప్యూటీ మేయర్‌గా సుబ్రమణ్యాన్ని ఎన్నుకున్నారు. అనురాధతో పాటు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో కలెక్టర్ రాంగోపాల్ ప్రమాణస్వీకారం చేయించారు. వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణస్వీకారానికి గైర్హాజరయ్యారు. ప్రలోభాలతో పీఠాన్ని లాగేసుకుని.. మదనపల్లె మునిసిపల్ చైర్మన్ ఎన్నిక రసాభాసగా మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఇక్కడ 35 వార్డుల్లో వైఎస్సార్సీపీ 17, టీడీపీ 15 స్థానాల్లో గెలుపొందాయి. ముగ్గురు స్వతంత్రులుగా గెలిచారు. స్పష్టమైన మెజారిటీ ఉన్న వైఎస్సార్సీపీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలి. అధికార పార్టీ మదనపల్లెలో పీఠాన్ని దక్కించుకునేందుకు అడ్డదారిలో నడిచింది. వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికైన 20, 25 వార్డు కౌన్సిలర్లు నజీరా, మహాలక్ష్మిని టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేసి తమ క్యాంపునకు తరలించారు. గురువారం మునిసిపాలిటీలోకి వచ్చిన తమ పార్టీ కౌన్సిలర్లతో మాట్లాడేందుకు ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే తిప్పారెడ్డి ప్రయత్నించారు. దీనికి టీడీపీ నేతలు అడ్డు తగిలారు. దీంతో రెండు పార్టీల కౌన్సిలర్ల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. చివరకు ఇద్దరు కౌన్సిలర్లతో మాట్లాడారు. కానీ వారు మాత్రం టీడీపీ చైర్మన్ అభ్యర్థి కొడవలి శివప్రసాద్‌కే మద్దతు ఇస్తామని చెప్పారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు పీఠంపై ఆశలు వదిలేశారు. ముగ్గురు స్వతంత్రులు, ఇద్దరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల మద్దతుతో టీడీపీ బలం 20కి చేరింది. ఎక్స్అఫిషియో సభ్యులుగా ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఓటును వినియోగించుకున్నా వైఎస్సార్సీపీ 17 మంది సభ్యులకే పరిమితమైంది. దీంతో అనివార్యంగా శివప్రసాద్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నగరి వైఎస్సార్సీపీ వశం నగరి మునిసిపల్ పీఠాన్ని వైఎస్సార్పీకీ దక్కించుకుంది. ఇక్కడ 27వార్డులకుగాను వైఎస్సార్సీపీ 11, టీడీపీ నుంచి 13 మంది కౌన్సిలర్లుగా గెలుపొందారు. ముగ్గురు స్వతంత్రులు గెలిచారు. వీరిలో ఒకరు టీడీపీ గూటికి చేరారు. తక్కిన ఇద్దరు వైఎస్సార్సీపీకి అండగా నిలిచారు. అయితే టీడీపీలో చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో విభేదాలు తలెత్తాయి. చైర్మన్ అభ్యర్థిగా చెండామరైను మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రకటించారు. దీంతో టీడీపీకి చెందిన 21వార్డు కౌన్సిలర్ హరిహరన్ వైఎస్సార్సీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఎక్స్అఫిషియో సభ్యురాలిగా ఎమ్మెల్యే రోజా సెల్వమణి ఓటుతో కలిపి వైఎస్సార్సీపీ బలం 15 మంది సభ్యులకు చేరింది. టీడీపీ ఎంపీ శివప్రసాద్ కూడా తన ఓటును వినియోగించుకున్నా టీడీపీ బలం 14 మందికే పరిమితమైంది. దీంతో చైర్మన్ పీఠం వైఎస్సార్సీపీ కైవశమైంది. పుంగనూరు, పలమనేరులో సుస్పష్టమైన మెజారిటీ దక్కించుకున్న వైఎస్సార్సీపీ పాలకవర్గాలను ఏర్పాటు చేసింది. శ్రీకాళహస్తి, పుత్తూరు పుర పీఠాలను టీడీపీ దక్కించుకుంది.