హైదరాబాద్‌సిటీ: చిత్తూరు మేయర్ స్థానానికి ఏప్రిల్ 15లోపు ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. 2015 సంవత్సరం నవంబర్ నెలలో చిత్తూరు మేయర్ కఠారీ అనురాధ దంపతులు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో హత్యకు గురైన సంగతి తెల్సిందే. అప్పటి నుంచి మేయర్ ఎన్నిక నిర్వహించకుండా ఆ స్థానం ఖాళీగా ఉంచారు.
కొత్త మేయర్ ని ఎన్నుకోకుండా ఖాళీగానే ఉంచారని, దానివల్ల చిత్తూరు ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని, వెంటనే కొత్త మేయర్ కు ఎన్నిక జరపాలంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. దీనిపై శుక్రవారం విచారించిన హైకోర్టు వచ్చే నెల 15లోపు ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.
ఏప్రిల్ 15లోపు ఎన్నిక నిర్వహించండి: హైకోర్టు
Published Fri, Mar 3 2017 4:46 PM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM
Advertisement