చింటూ ఆచూకీ తెలిపితే రూ.లక్ష రివార్డు | police announce the reward on accused chittoor mayor murder case | Sakshi
Sakshi News home page

చింటూ ఆచూకీ తెలిపితే రూ.లక్ష రివార్డు

Published Fri, Nov 20 2015 10:27 AM | Last Updated on Sun, Sep 3 2017 12:46 PM

చింటూ ఆచూకీ తెలిపితే రూ.లక్ష రివార్డు

చింటూ ఆచూకీ తెలిపితే రూ.లక్ష రివార్డు

చిత్తూరు: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రశేఖర్ అలియాస్ ఆచూకీ తెలిపితే రూ. లక్ష రివార్డు అందజేస్తామని అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. మేయర్ దంపతుల హత్య జరిగిన కార్పొరేషన్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మేయర్ నివాసానికి బయలు దేరారు. మేయర్ దంపతుల హత్య కేసు విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారిగా రాయలసీమ రేంజ్ ఆర్పీ ఠాకూర్ ను ప్రభుత్వం నియమించిని సంగతి తెలిసిందే.

అయితే ర నిందితుడిగా ఉన్న చింటూ అలియాస్ చంద్రశేఖర్ గురువారం పోలీసులకు లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. తొలుత ఇతడు గుడిపాల పోలీసు స్టేషన్‌లో లొంగిపోయినట్లు వార్తలొచ్చాయి. అయితే చింటూ తన న్యాయవాదితో కలిసి పుత్తూరులో అక్కడి పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. చింటూను శనివారం మీడియా ఎదుట చూపనున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement