Chintu Alias Chandrasekhar
-
చింటూ ఆచూకీ తెలిపితే రూ.లక్ష రివార్డు
చిత్తూరు: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రశేఖర్ అలియాస్ ఆచూకీ తెలిపితే రూ. లక్ష రివార్డు అందజేస్తామని అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. మేయర్ దంపతుల హత్య జరిగిన కార్పొరేషన్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మేయర్ నివాసానికి బయలు దేరారు. మేయర్ దంపతుల హత్య కేసు విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారిగా రాయలసీమ రేంజ్ ఆర్పీ ఠాకూర్ ను ప్రభుత్వం నియమించిని సంగతి తెలిసిందే. అయితే ర నిందితుడిగా ఉన్న చింటూ అలియాస్ చంద్రశేఖర్ గురువారం పోలీసులకు లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. తొలుత ఇతడు గుడిపాల పోలీసు స్టేషన్లో లొంగిపోయినట్లు వార్తలొచ్చాయి. అయితే చింటూ తన న్యాయవాదితో కలిసి పుత్తూరులో అక్కడి పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. చింటూను శనివారం మీడియా ఎదుట చూపనున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. -
చింటూ లొంగుబాటు ?
చిత్తూరు(అర్బన్): చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ అలియాస్ చంద్రశేఖర్ గురువారం పోలీసులకు లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. తొలుత ఇతడు గుడిపాల పోలీసు స్టేషన్లో లొంగిపోయినట్లు వార్తలొచ్చాయి. అయితే చింటూ తన న్యాయవాదితో కలిసి పుత్తూరులో అక్కడి పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. రాయలసీమ అదనపు డీజీ ఆర్పీ. ఠాకూర్ గురువారం రాత్రి చిత్తూరు నగరానికి చేరుకున్నారు. నగరంలోని పోలీసు అతిథిగృహంలో ఉన్న ఆయన ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్‌తో కలిసి చింటూ కేసును సమీక్షిస్తున్నారు. చింటూ నుంచి హత్యకు సంబంధించిన వాంగ్మూల పత్రం, నిందితులు ఎవరెవరు పాల్గొన్నారు ? అసలు ఎందుకు కక్షలొచ్చాయనే వివరాల రిపోర్టును తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. చింటూను శనివారం మీడియా ఎదుట చూపనున్నట్లు తెలుస్తోంది.