చింటూ లొంగుబాటు ? | Chintu killed the mayor! | Sakshi
Sakshi News home page

చింటూ లొంగుబాటు ?

Published Fri, Nov 20 2015 3:56 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

చింటూ లొంగుబాటు ? - Sakshi

చింటూ లొంగుబాటు ?

చిత్తూరు(అర్బన్): చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ అలియాస్ చంద్రశేఖర్ గురువారం పోలీసులకు లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. తొలుత ఇతడు గుడిపాల పోలీసు స్టేషన్‌లో లొంగిపోయినట్లు వార్తలొచ్చాయి. అయితే చింటూ తన న్యాయవాదితో కలిసి పుత్తూరులో అక్కడి పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. రాయలసీమ అదనపు డీజీ ఆర్‌పీ. ఠాకూర్ గురువారం రాత్రి చిత్తూరు నగరానికి చేరుకున్నారు.

నగరంలోని పోలీసు అతిథిగృహంలో ఉన్న ఆయన ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్‌తో కలిసి చింటూ కేసును సమీక్షిస్తున్నారు. చింటూ నుంచి హత్యకు సంబంధించిన వాంగ్మూల పత్రం, నిందితులు ఎవరెవరు పాల్గొన్నారు ? అసలు ఎందుకు కక్షలొచ్చాయనే వివరాల రిపోర్టును తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. చింటూను శనివారం మీడియా ఎదుట చూపనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement