
చిత్తూరు బంద్ ప్రశాంతం
చిత్తూరు నగర మేయర్ దంపతుల హత్యకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు నడవటం లేదు. దుకాణాలు, సినిమా హాళ్లు, విద్యా, వాణిజ్య సంస్థలు మూత బడ్డాయి. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా, మేయర్ కఠారి అనూరాధ, మోహన్ దంపతుల భౌతికకాయాలను మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు. సాయంత్రం 2.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు చేరుకుంటారు. అనంతరం మేయర్ దంపతుల అంత్యక్రియలు జరుగనున్నాయి.