చింటూ కారుడ్రైవర్ అరెస్ట్ | chintu car driver arrested in mayor murder case | Sakshi
Sakshi News home page

చింటూ కారుడ్రైవర్ అరెస్ట్

Published Fri, Dec 11 2015 12:44 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

చింటూ కారుడ్రైవర్ అరెస్ట్ - Sakshi

చింటూ కారుడ్రైవర్ అరెస్ట్

చిత్తూరు జిల్లా: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న గంగనపల్లి వెంకటేశ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రధాన ముద్దాయి చింటూ అలియాస్ చంద్రశేఖర్ కారు డ్రైవర్గా వెంకటేష్ పని చేసేవాడు. చింటూతో కలిసి వెంకటేశ్ ప్రత్యక్షంగా నేరంలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి ఓ కత్తి, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారిసంఖ్య 19కి చేరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement