చింటూ డ్రైవర్ అరెస్ట్
Published Thu, Dec 3 2015 10:36 AM | Last Updated on Mon, Jul 30 2018 8:51 PM
చిత్తూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. చింటూ డ్రైవర్‌గా పని చేస్తున్న వెంకటేష్ ఈ కేసులో మూడవ నిందితుడిగా ఉన్నాడు.
ఈ రోజు ఉదయం వెంకటేష్ ను చిత్తూరు కోర్టు ఆవరణలో పోలీసలు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో లొంగిపోవడానికి వెంకటేష్ వచ్చాడని పోలీసులు చెబుతున్నారు. కాగా మరో నిందితుడు మొగిలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Advertisement
Advertisement