పాల్వంచ మండలం నాగారం పంచాయతీ రేపల్లెవాడలో దారుణం చోటుచేసుకుంది.
పాల్వంచ మండలం నాగారం పంచాయతీ రేపల్లెవాడలో దారుణం చోటుచేసుకుంది. పొలం వద్ద దారి విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. గ్రామానికి చెందిన బింగి శ్రీను(45), వెంకటేశ్‌లు అన్నదమ్ములు.
వీరి మధ్య సోమవారం రాత్రి దారి విషయంలో గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన వెంకటేశ్ కర్రతో శ్రీను తలపై గట్టిగా కొట్టడంతో తీవ్రరక్తస్రావమై కుప్పకూలి చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.