ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లి సమీపంలో కొర్ర వెంకటేష్(32) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుని తలపై గొడ్డలితో నరికిన ఆనవాళ్లు ఉన్నాయి. పక్కనే ద్విచక్రవాహనం పడి ఉంది. దుండగులు వెంబడించి తల నరికి హతమార్చి ఉంచారని భావిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.