Seenu
-
‘నా సినిమాలన్నింటిని బ్యాన్ చేయండి’
‘నా సినిమాలన్నింటిని బ్యాన్ చేయండి.. అప్పుడు ఎవరూ వాటిని చూడలేరు.. దాంతో వాటిని రీమేడ్ చేయాలనే ఆలోచన కూడా ఎవరికి రాదు’ అంటూ చమత్కరించారు నటి, నిర్మాత, రచయిత ట్వింకిల్ ఖన్నా. తన పుస్తకం ‘పైజమాస్ ఆర్ ఫర్గివింగ్’ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ట్వింకిల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు ‘మీరు నటించిన ఏ చిత్రాన్ని రీమేడ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు’ అని అడగ్గా ట్వింకిల్ కాస్తా భిన్నంగా స్పందించారు. ‘నేను ఒక్క హిట్ కూడా ఇవ్వలేదు. అందువల్ల నేను నటించిన సినిమాలన్నింటిని బ్యాన్ చేస్తే మంచిది. అప్పుడు ఎవరూ వాటిని చూడలేరు.. రీమేడ్ చేయాలనే ఆలోచన కూడా రాదం’టూ ట్వికిల్ జోక్ చేశారు. ‘బర్సాత్’ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ట్వింకిల్ ఖన్నా.. ఆపై వరుసగా ‘ఇతిహాస్’, ‘జుల్మి’, ‘మేలా’ వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో వెంకటేష్ సరసన ‘శీను’ చిత్రంలో నటించారు. ఆపై వరుస వైఫల్యాలు రావడంతో సినిమాలకు స్వస్తి చెప్పి 2001లో బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్‌ని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ట్వింకిల్ ఖన్నా రచయిత్రిగా బిజీ అయ్యారు. గతంలో ట్వింకిల్ షార్ట్ స్టోరీస్ సమాహారంగా రచించిన ‘ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్’ పుస్తకంలోని ఓ కథ ఆధారంగా అక్షయ్ కుమార్ ‘ప్యాడ్ మాన్’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ట్వింకిల్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. -
బాక్సింగ్ నేపథ్యంగా మరో చిత్రం
తమిళసినిమా: తమిళనాడులోని ఉత్తర చెన్నై బాక్సింగ్‌కు ప్రసిద్ధి. ఈ క్రీడను ప్రభుత్వం నిషేధించినా అనధికారకంగా ఇప్పటికీ జరుగుతుంటాయంటారు. ఉత్తర చెన్నై బాక్సింగ్ క్రీడ నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కాయి. తాజాగా అలాంటి 1970–71లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రం వాండు. అప్పట్లో స్ట్రీట్ ఫైటే ఆ తరువాత బాక్సింగ్గా మారిందంటారు. అలా హీరో తండ్రి, విలన్ తండ్రికి మధ్య జరిగిన పోరాటంలో హీరో తండ్రి గాయాల పాలవుతాడు. ఆ తరువాత విలన్ కొడుకు బాక్సింగ్‌లో శిక్షణ పొందుతాడు. అదే చోటుకు హీరో బాక్సింగ్ నేర్చుకోవడానికి వస్తాడు. దీంతో వారిద్దరి మధ్య పగ మొదలవుతుంది. అది ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం వాండు అని దర్శకుడు వాసన్ షాజీ తెలిపారు. దర్శకుడు సెల్వరాఘవన్ వద్ద సహాయదర్శకుడిగా పని చేసిన ఈయన ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎంఎం.పవర్ సినీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఇందులో నవ నటుడు శీను కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. నటి షికా నాయకిగానూ, తడయారతాక్క, కొంబన్ చిత్రాల ఫేమ్ మహాగాంధీ, మెడ్రాస్ చిత్రం ఫేమ్ రామ, తెరి చిత్రం ఫేమ్ సాయిదీనా, రోమియోజూలియట్ భువనేశ్వరి, 2.ఓ చిత్రం ఫేమ్ రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ నేశన్ సంగీతాన్ని, రమేశ్, వి.మహేంద్రన్ ద్వయం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
పురుగు మందు తాగి బలవన్మరణం
బుక్కరాయసముద్రం(శింగనమల): బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లిలో బోయ శీను(46) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టడంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు. కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు విచారణలో ఉంది. మల్లాపురంలో వివాహిత... కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని మల్లాపురంలో చిరంజీవి భార్య లక్ష్మీ(23) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పుట్టింటికి వెళ్తానని భర్తను అడగ్గా.. అందుకు అతను అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకున్నట్లు వివరించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదని సమాచారం. -
ఇంటి సరిహద్దు సమస్య ..చంపేసింది
(దేవరపల్లి)తూర్పుగోదావరి: ఇంటి సరిహద్దు సమస్య నిండు ప్రాణాన్ని బలిగొంది. మండలంలోని కురుకూరు దళితవాడలో రెండు కుటుంబాల మధ్య ఇంటి సరిహద్దు సమస్య గత కొంత కాలంగా జరుగుతోంది. పత్తిపాటి శ్రీను(53), యంగల సత్యనారాయణ పక్కపక్క ఇళ్లు కలిగి ఉన్నారు. రెండు ఇళ్లు మధ్య సరిహద్దు వివాదం జరుగుతోంది. వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. కొవ్వూరు సీఐ ఎం. సుబ్బారావు వివరాల ప్రకారం పత్తిపాటి శ్రీను, యంగల సత్యనారాయణ గత రెండు సంవత్సరాలుగా ఇంటి సరిహద్దు విషయంలో గొడవలు పడుతున్నారు. శనివారం రాత్రి పొద్దుపోయాక ఇద్దరి మధ్య వివాదం జరిగింది. దీనితో సత్యనారాయణ కత్తితో శ్రీనుపై దాడిచేసి మెడపై బలంగా నరికాడు. మెడ భాగంపై బలమైన గాయం కావడంతో శ్రీను అక్కడక్కడే మృతిచెందాడు. శ్రీనుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సీఐ ఎం. సుబ్బారావు, ఎస్సై పి. వాసు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
దొంగతనం నింద మోపారని..
చేయని దొంగతనానికి తనపై నింద మోపారని మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం ధర్మారం గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన డి. శ్రీను(25) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పదిహేను రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన యాదగిరి ఇంట్లో రూ. 30 వేలు చోరీకి గురయ్యాయి. ఈ దొంగ తనం శ్రీను చేసాడని యాదగిరి ఆరోపించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన అతని బంధువులు మృతదేహంతో యాదగిరి ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. -
బైక్ ఢీకొని యువకుని మృతి
నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామం వద్ద గురువారం ఉదయం బైక్ ఢీకొన్న సంఘటనలో శ్రీను(20) అనే యువకుడు మృతిచెందాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న శీనును వెనుకనుంచి వేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
బాలికపై లైంగిక దాడి
స్నేహితుడి కూతురిపై కీచకుడి దారుణం మలక్‌పేట: మద్యం మత్తులో ఉన్న ఓ కీచకుడు ఆరే ళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. నలుగు కూతుళ్ల తండ్రి స్నేహితుడి కూతురిపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మలక్‌పేట సీఐ అల్లూరి గంగారెడ్డి కథనం ప్రకారం.. జీహెచ్ఎంసీలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్న ఓ వ్యక్తి తన భార్య చనిపోవడంతో ఆరేళ్ల కూతురితో కలిసి సైదాబాద్ ఫరహా కాలనీలో ఫుట్‌పాత్‌పై నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఆస్మాన్‌గడ్ హమాలీబస్తీకి చెందిన ప్లంబర్ కొత్త శ్రీను అలియాస్ దొంగ శ్రీను (38) స్నేహితుడు. ఇద్దరూ మద్యం తాగి తిరుగుతుంటారు. శ్రీనుకు భార్య చనిపోవడంతో మరదలును రెండో పెళ్లి చేసుకున్నాడు.మొద టి భార్యకు ఆడపిల్ల పుట్టగా.. రెండో భార్యకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. గురువారం శ్రీను భార్యతో గొడవపడి చితకబాదాడు. దీంతో ఆమె తను ముగ్గురు పిల్లలను తీసుకుని మౌలాలిలోని తల్లిగారింటికి వెళ్లిపోయింది. గురువారం సాయంత్రం శ్రీను, అతని స్నేహితుడైన పారిశుధ్య కార్మికుడు కలిసి మద్యం తాగారు. స్నేహితుడు తన కూతురిని శ్రీను కూతురితో పాటు వారి ఇంట్లో పడుకోబెట్టాడు. మద్యం మత్తులో ఉన్న శ్రీను స్నేహితుడి కూతురిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉద యం కూతురు వద్దకు వచ్చిన తండ్రి.. ఆమె దుస్తులపై రక్తపు మరకలు ఉండటంతో అనుమానం వచ్చి ప్రశ్నించగా విషయం చెప్పింది. పోలీసులు బాధిత బాలికను నిలోఫర్ ఆసుపత్రి తరలించి చికిత్స చేయిస్తున్నారు. నిం దితుడు శ్రీనును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీను పాతనేస్తుడని పలు ఠాణాల్లో కేసులున్నాయని పోలీసులు తెలిపారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
నూజెండ్ల మండలం తంగిరాలలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పొలంలో ఉన్న మోటారు ఆన్ చేసేందుకు వెళ్లిన శ్రీను(35) అనే వ్యక్తికి కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. షాక్ తగిలిన భర్తను పట్టుకున్న రామాంజమ్మ, కుమారుడు లక్ష్మయ్యకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
అన్నచేతిలో తమ్ముడి హతం
పాల్వంచ మండలం నాగారం పంచాయతీ రేపల్లెవాడలో దారుణం చోటుచేసుకుంది. పొలం వద్ద దారి విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. గ్రామానికి చెందిన బింగి శ్రీను(45), వెంకటేశ్‌లు అన్నదమ్ములు. వీరి మధ్య సోమవారం రాత్రి దారి విషయంలో గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన వెంకటేశ్ కర్రతో శ్రీను తలపై గట్టిగా కొట్టడంతో తీవ్రరక్తస్రావమై కుప్పకూలి చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిడుగుపడి యువకుని మృతి
శ్రీకాకుళం జిల్లా హిర మండలం తుంగతంపర గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగుపడి గుణుపూరు శ్రీను(30) అనే యువకుడు మృతిచెందాడు. శ్రీను పొలం పనులు చేస్తుండగా భారీ వర్షం కురిసింది. చెట్టు నీడన సేద దీరుతుండగా పిడిగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. -
గురవాంలో పేలుడు..ఇద్దరి మృతి
- ఆరుగురికి తీవ్రగాయాలు రాజాం(శ్రీకాకుళం జిల్లా) రాజాం మండలం గురవాం గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం పేలుడు సంభవించింది. అక్రమంగా బాణసంచా తయారీ చేస్తున్న పాలవలస శ్రీను అనే వ్యక్తి ఇంటిలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా..ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఒకరి శవం మాత్రమే కనపడుతోంది. మరొకరి శవం శిథిలాల కింద ఉండవచ్చునని భావిస్తున్నారు. గాయపడిన పాలవలస శ్రీను, పాలవ లస లావణ్య, గేదెల ఈశ్వరరావు, గేదెల దుర్గమ్మ, గేదెల గోవిందమ్మ , ఈగల ప్రసన్న కుమార్‌లను రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
తమ పెళ్లి విషయం ఇంట్లో తెలుస్తుందన్న భయంతో ఓ యువ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పిల్లల చెరువు గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన శ్రీను, అనిత పెద్దలకు చెప్పకుండా ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమంటారోనన్న భయంతో ఆదివారం వారు ఇద్దరూ పురుగుల ముందు తాగారు. స్థానికులు గమనించి వారిని నర్సారావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
యువకుడి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో విసిగిపోయిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండలం ఖానాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీను(27) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. ఈ రోజు ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తిరైతు ఆత్మహత్య
పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పుటు రైతు పీక మీద కత్తిలా దాపరించడంతో.. వాటిన తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా డిండి మండలం కానాపూర్ పంచాయతి పరిధిలోని జోత్యతండాలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నామర్ల శ్రీను(36) తనకున్న ఎనిమిదెరాలతో పాటు మరో ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం భారీ మొత్తంలో ప్రైవేటు వ్యక్తులనుంచి అప్పు తీసుకొచ్చాడు. కానీ పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. అప్పులు తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అత్యాచారానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్
పెదవాల్తేరు : భార్య చెల్లెలు.. అందులోనూ బాలింత.. అయిదు నెలల శిశువుకు త ల్లైన మరదలుపైనే అత్యాచారానికి యత్నించాడు ఓ ప్రబుద్ధుడు. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం... చినవాల్తేరు కొయ్యవీధిలో నివాసముంటున్న తోకడ శ్రీను(38) ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతంలోని రజకవీధికి చెందిన యువతితో శ్రీనుకు వివాహమైంది. అతనికి ఓ మరదలు ఉంది. ఆమెకు విజయనగరానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. గర్భిణి కావడంతో తొమ్మిది నెలల కిందట చినవాల్తేరు రజకవీధిలోని పుట్టింటికి వచ్చింది. అయిదు నెలల కిందట ఓ శిశువుకు జన్మనిచ్చింది. బలింతైన ఆమెపై శ్రీను కన్నుపడింది. సోమవా రం రాత్రి మరదలు ఇంటికి వెళ్లాడు. ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారానికి యత్నిం చాడు. తప్పించుకునేందుకు యత్నించడంతో కర్కశంగా దాడి చేసి పైశాచికంగా ప్రవర్తించా డు. ఇంతలో చుట్టుపక్కల వారు రావడంతో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. -
అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య
నల్లగొండ జిల్లా వేములపల్లి మండం తోపుచర్ల గ్రామంలో ఓ రైతు అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వల్లపుదాసు శ్రీను (35) తనకున్న రెండెకరాలతోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. అయితే, సాగు కోసం గతంలోను, ఇప్పుడు కలిపి మొత్తం రూ.2 లక్షల మేర అప్పులు చేశాడు. పంట దిగుబడి రాని పరిస్థితి కనిపిస్తుండడంతో అప్పులు తీర్చలేనమోనని దిగులుతో శనివారం అర్ధరాత్రి తన ఇంటివద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితుడే చంపేశాడు
నల్గొండ: మద్యం మత్తులో ప్రాణ స్నేహితులే బద్దశత్రువులయ్యారు. అప్పటివరకు 'దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్' అంటూ పాటలు పాడుకున్న వాళ్లే.. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా సూర్యపేట శివారులోని భగత్‌సింగ్‌నగర్‌లో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన టి.శ్రీను, నాగభూషణం ఇద్దరు గురువారం రాత్రి మద్యం సేవిస్తూ గొడవపడ్డారు. ఘర్షణలో భాగంగా శ్రీను అనే వ్యక్తి నాగ భూషణంపై చేయి చేసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన నాగభూషణం కొబ్బరి బోండాలు నరికే కత్తితో శ్రీనును నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. నిందితుడు పరారయ్యాడు. -
రేషన్ డీలర్లపై కేసులు
న్యూస్‌లైన్ నెట్వర్క్ : బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు డీలర్లపై తహశీల్దార్ వెంకటిశివ కేసులు నమోదు చేయించారు. ఆయన సోమవారం దొప్పెర్ల, నునపర్తి, గండివానిపాలెం, మడుతూరు రేషన్డిపోలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. గండివానిపాలెంలో డీలర్ నాగులపల్లి కన్నయ్య బియ్యం పంపిణీలో చేతివాటం చూపించారు. బియ్యం తూయడానికి కిలో బరువైన ఇనుప డబ్బాని వినియోగించారు. డబ్బా బరువును తూనిక రాళ్లవైపు చూపించడానికి గుడ్డలతో తయారు చేసిన మూటను కట్టారు. చూసేవారికి సక్రమంగా ఉన్నట్టు కనిపించింది. తూనికలో కిలో తరుగు వస్తోంది. పదికిలోలు ఇచ్చేవారికి ఐదుకిలోల వంతున రెండుదఫాలు తూయడంతో లబ్దిదారుడికి ఎనిమిది కిలోలే అందాయి. మడుతూరులో డీలర్ శ్రీను ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాన్ని వినియోగిస్తున్నారు. ఇక్కడ ప్లాస్టిక్ డబ్బా, ప్రత్యేకంగా తయారు చేసిన ఇనుపడబ్బా ఉన్నాయి. ప్లాస్టిక్ డబ్బాతో 20 గ్రాముల తరగు వచ్చింది. ఇనుప డబ్బాతో కిలో తరుగు వచ్చింది. తనిఖీ సమయంలో ఇనుపడబ్బా వినియోగించి అడ్డంగా దొరికిపోయారు. మడుతూరు, దోసూరు పంచాయతీల రేషన్‌డిపోలను ఈయన నిర్వహిస్తున్నారు. తహశీల్దార్ ఇద్దరి డిపోలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తుపాను బాధితులకు సరుకుల పంపిణీ బాధ్యత విఆర్ఓలకు అప్పగించారు. ఇద్దరిపై కేసు పెట్టినట్టు ఎస్ఐ నర్సింగరావు తెలిపారు. విజిలెన్స్ తనిఖీలు సోమవారం మాకవరపాలెం మండల కేంద్రంతోపాటు శెట్టిపాలెం గ్రామాల్లో ఉన్న రేషన్‌డిపోలను విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. మండల కేంద్రంలోని షాపు నంబర్ 17లో డీలర్ బియ్యం కొలతల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. దీనిపై రేషన్ డీలర్‌పై కేసు నమోదు చేశారు. శెట్టిపాలెంలో రేషన్‌డిపోలో కాకుండా వేరొక ప్రదేశంలో సరుకులు నిల్వచేసినట్టు గుర్తించి డీలర్‌ను హెచ్చరించారు. దీంతో డీలర్ అక్కడి నుంచి సరుకులను డిపోకు తరలించారు. డీలర్ సస్పెన్షన్ నక్కపల్లి మండలం బంగారయ్యపేట రేషన్‌డిపో డీలర్ చేపల జ్యోతిపై సస్పెన్షన్ వేటుపడింది. డీలర్ కార్డుదారుల నుంచి రూ.20లు చొప్పున వసూలు చేయడం, బియ్యంలో కోత విధించడం వంటి అక్రమాలకు పాల్పడ్డారని గ్రామస్తులు ఆదివారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆర్డీవో విచారణకు ఆదేశించారు. సోమవారం డిప్యూటీ తహశీల్దార్లు లక్ష్మీనరసమ్మ, రమాదేవి, ఆర్ఐ రమలు గ్రామంలో విచారణ చేపట్టారు. గ్రామస్తులంతా డీలర్ పాల్పడుతున్న అక్రమాలను విచారణాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డిపోలో స్టాకు పరిశీలించగా ఏడు క్వింటాళ్ల 80 కిలోల బియ్యం తక్కువ ఉన్నట్టు గుర్తించారు. డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేసి సస్పెండ్ చేసినట్టు విచారణాధికారులు తెలిపారు. బంగారయ్యపేటకు ఇన్చార్జ్గా డీఎల్‌ఫురం డీలర్‌కు బాధ్యతలు అప్పగించినట్టు వారు తెలిపారు. తూనికల్లో తేడా కె.కోటపాడు మండలంలోని ఆనందపురం, కె.సంతపాలెం, గొల్లలపాలెం, చంద్రయ్యపేట, కింతాడ, ఆర్లి గ్రామాలలో గల రేషన్ డిపోలలో విజిలెన్స్ ఎస్ఐ జి.సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఆనందపురం, కె.సంతపాలెం గ్రామాల రేషన్ డిపోల్లో తూనికల్లో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. విషయాన్ని విజిలెన్స్ ఎస్పీ వి.సురేష్‌బాబు దృష్టికి తీసుకువెళ్లి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
'టెన్త్ లో లక్ ,ఇంటర్ లో కిక్ , బిటెక్ లో ..?' స్టిల్స్
-
వెయ్యి కిలోల గంజాయి పట్టివేత
విలువ రూ.అరకోటి పైనే... రెండు వాహనాలు సీజ్ ఆరుగురికి రిమాండ్ మరొకరు పరార్ మాడుగుల : జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ఆగడంలేదు. ఎక్సైజ్ అధికారుల ఉదాసీనత పుణ్యమాని రోజూ ఏదో ప్రాంతంలో గంజాయి పట్టుబడుతూనే ఉంది. తాజాగా పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు ఓ వ్యాను, మరో జీపులో తరలిస్తున్న సుమారు వెయ్యి కిలోల గంజాయిని మాడుగుల పోలీసులు పట్టుకున్నారు. మాడుగుల ఎస్ఐ తేజేశ్వరరావు కథనం ప్రకారం.. పాడేరు నుంచి వడ్డాదికి జీపుతోపాటు వ్యానులో గంజాయి బస్తాలు తరలిస్తుండగా, ముందస్తు సమాచారం మేరకు మాడుగుల మండలం గరికబంద చెక్‌పోస్టు వద్ద మాటువేసి పట్టుకున్నారు. తొలుత వ్యానును ఆపి తనిఖీ చేసి వదిలిపెట్టినా, చివరి క్షణంలో అనుమానం వచ్చి క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో వ్యానులోపలి భాగంలో, క్యాబిన్‌కు-తొట్టెకు ఆనుకుని ఉన్న రేకు వద్ద ప్రత్యేకంగా రూపొందించిన అరలో దాచిన గంజాయి బస్తాలను గుర్తించారు. మరో పావుగంట సమయం తర్వాత అదే మార్గంలో వచ్చిన ప్రైవేటు జీపును గంజాయి బస్తాలతో సహా పట్టుకున్నారు. వ్యాను చింత నిప్పుల అగ్రహారం గ్రామానికి చెందిన పొలిమరశెట్టి నాగరాజుదని, జీపు వడ్డాదికి చెందిన లోవ అనే వ్యక్తిదని ఎస్ఐ తేజేశ్వరరావు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న ముద్దాయిలు చింతనిప్పుల అగ్రహారం గ్రామానికి చెందిన శిలపరశెట్టి నాగరాజు, షేక్ అస్లాంభాషా, శిలపరశెట్టి రమణబాబు, బైలపూడి గ్రామానికి చెందిన గాడి అప్పారావు, జి. మాడుగులకు చెందిన ఒంతాలపెద్దబ్బాయి, పెదబయలు కు చెందిన వంచరంగి చిన్నాల దొరలను అరెస్టు చేసిర రి మాండుకు తరలించామన్నారు. మరో ముద్దాయి పొలిమరశెట్టి శ్రీను పరారీలో ఉన్నారని, పట్టుబడిన గంజాయి సుమా రు రూ 50 లక్షలు విలువ ఉంటుందనిఎస్‌ఐ తెలిపారు. -
అందమైన మాయ
సతీష్, శీను, కిరణ్, బాలరాజ్ తదితరులు ముఖ్య తారలుగా మణీంద్రన్ దర్శకత్వ పర్యవేక్షణలో నాగరాజు కొట్టె నిర్మించిన చిత్రం ‘అందమైన మాయ’. ఇటీవలే టాకీపార్ట్ పూర్తయ్యింది. ఇందులో ఓ ప్రముఖ హీరోయిన్ ప్రత్యేక పాత్ర చేశారని, పోలూర్ ఘటికాచలం ఇచ్చిన డైలాగ్స్ హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాతలు చెప్పారు. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సత్య సోమేష్, కథ-దర్శకత్వం: దినకరన్.