బాలికపై లైంగిక దాడి | Sexual assault on girl | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి

Published Sat, Jul 16 2016 12:21 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

బాలికపై లైంగిక దాడి - Sakshi

బాలికపై లైంగిక దాడి

స్నేహితుడి కూతురిపై కీచకుడి దారుణం
 
మలక్‌పేట: మద్యం మత్తులో ఉన్న ఓ కీచకుడు ఆరే ళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. నలుగు కూతుళ్ల తండ్రి స్నేహితుడి కూతురిపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మలక్‌పేట సీఐ అల్లూరి గంగారెడ్డి కథనం ప్రకారం.. జీహెచ్‌ఎంసీలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్న ఓ వ్యక్తి తన భార్య చనిపోవడంతో  ఆరేళ్ల కూతురితో కలిసి సైదాబాద్ ఫరహా కాలనీలో ఫుట్‌పాత్‌పై నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఆస్మాన్‌గడ్ హమాలీబస్తీకి చెందిన ప్లంబర్ కొత్త శ్రీను అలియాస్ దొంగ శ్రీను (38) స్నేహితుడు. ఇద్దరూ మద్యం తాగి తిరుగుతుంటారు. శ్రీనుకు భార్య చనిపోవడంతో మరదలును రెండో పెళ్లి చేసుకున్నాడు.మొద టి భార్యకు ఆడపిల్ల పుట్టగా.. రెండో భార్యకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. గురువారం శ్రీను భార్యతో గొడవపడి చితకబాదాడు. దీంతో ఆమె తను ముగ్గురు పిల్లలను తీసుకుని మౌలాలిలోని తల్లిగారింటికి వెళ్లిపోయింది.


గురువారం సాయంత్రం శ్రీను, అతని స్నేహితుడైన పారిశుధ్య కార్మికుడు కలిసి మద్యం తాగారు. స్నేహితుడు తన కూతురిని శ్రీను కూతురితో పాటు వారి ఇంట్లో పడుకోబెట్టాడు. మద్యం మత్తులో ఉన్న శ్రీను స్నేహితుడి కూతురిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉద యం కూతురు వద్దకు వచ్చిన తండ్రి.. ఆమె దుస్తులపై రక్తపు మరకలు ఉండటంతో అనుమానం వచ్చి ప్రశ్నించగా విషయం చెప్పింది. పోలీసులు బాధిత బాలికను నిలోఫర్ ఆసుపత్రి తరలించి చికిత్స చేయిస్తున్నారు.  నిం దితుడు శ్రీనును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  శ్రీను పాతనేస్తుడని పలు ఠాణాల్లో కేసులున్నాయని పోలీసులు తెలిపారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement