పాకపూడి(బాలాయపల్లి): మద్యం మత్తులో 65 ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన పాకపూడిలో గురువారం రాత్రి జరిగింది. పాకపూడికి చెందిన ఓ వృద్ధురాలు ఊరి చివర ఒంటరిగా నివాసం ఉంటోంది. గురువారం రాత్రి గ్రామానికి చెందిన పాల్చూరు రమణయ్య అల్లుడు సుబ్బరామయ్య మద్యం సేవించి ఒంటరిగా ఉన్న వృద్దురాలి ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలతో చుట్టుపక్కల వారు సుబ్బరామయ్యను పట్టుకుని దేహశుద్ధి చే యగా తప్పించుకుని పరారయ్యాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా వృద్ధురాలిని చికిత్స నిమిత్తం వెంకటగిరి ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.