old age women
-
వృద్ధురాలిపై టీడీపీ నేతలు దాడి
-
89 ఏళ్ల పంచాయతీ ప్రెసిడెంట్!ఆమె ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే!
కొందరూ వయసులో వృద్ధులుగా ఉన్నప్పటికీ పనులు మాత్రం యువకుల కంటే మిన్నగా ఉంటాయి. వృద్ధులమన్నా భావనే లేశమంత లేకుండా భలే చాకచక్యంగా అసాధ్యమైన పనులు చేసి ఔరా! అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందిన వారే తమిళనాడుకు చెందిన 89 ఏళ్ల బామ్మ. రెస్ట్ తీసుకునే వయసులో పంచాయతీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ..అధికారుల చేత శభాష్! అనిపించుకుంటున్నారు. వివరాల్లోకెళ్తే..తమిళనాడుకి చెందిన 89 ఏళ్ల వీరమ్మాళ్ స్ఫూర్తిదాయకమైన మహిళ. ఆమె స్థైర్యం, దృఢ సంకల్పం ప్రజలనే కాదు అధికారులను విస్మయానికి గురిచేసింది. అత్యంత వృద్ధురాలైన పంచాయతీ ప్రెసిడెంట్ తనదైన ముద్ర వేసింది. పెదాలపై చెరగని చిరునవ్వు, హద్దుల్లేని ఉత్సాహం అందర్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఏం చేయలేనంటూ వణుకుతూ మూలన కూర్చొనే వయసులో.. ఎంతో ఉత్సహాంగా అరిట్టపట్టి పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేసి ప్రెసిడెంట్‌గా గెలవడమే కాగా అందరూ మెచ్చుకునేలా బాధ్యతలను నిర్వర్తించి శభాష్ అనిపించుకుంటోంది. మిల్లెట్స్ వంటి సంప్రదాయ భోజనం, వ్యవసాయ క్షేత్రంలో రోజంతా పనిచేయడం అదే తన ఫిట్నెస్ రహస్యం అని చెబుతోంది వీరమ్మాళ్. వీరమ్మాళ్ నాయకత్వంలో అరిట్టపట్టి మధురై జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందడం విశేషం. ఈ విషయాన్ని ఇండియన్ అడ్మిన్‌స్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఆన్లైన్ వేదికగా పంచుకుంటూ నెట్టింట ఆమె ఫోటోని, వీడియోని షేర్ చేసింది. దీంతో నెటిజన్లు 'సాధారణ జీవన విధానం ఎల్లప్పుడూ ఉత్తమమైందే'! అని ఒకరు, ఆ ఏజ్‌లో కూడా లీడర్‌గా ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నందుకు ఆమెకు అవార్డు ఇవ్వాలి అని మరోకరూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. Veerammal Amma, popularly known as "Arittapatti Paati' the 89 years old Panchayat President of Arittapatti Panchayat is truly an inspiring woman. Fit as a fiddle she is the oldest Panchayat President in TN. Her infectious smile & unbridled enthusiasm is so heatwarming. When I… pic.twitter.com/ol7M2tpqIr — Supriya Sahu IAS (@supriyasahuias) August 30, 2023 (చదవండి: ఇండియన్ బ్యాలెరినా! బ్యాలె డ్యాన్స్‌లో రాణిస్తున్న హైదరాబాదీ!) -
హుషారైన స్టెప్పులతో శ్రీదేవిని దించేసిన బామ్మ.. వీడియో వైరల్
తమ డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్న వారిని చాలానే చూశాం. ఏ కార్యక్రమం అయిన తమ డ్యాన్స్‌తోనే జనాలను అట్రాక్ట్ చేస్తున్నారు. చిన్నారులు, యువతతోపాటు ఈ మధ్యకాలంలో వయసు మళ్లిన బామ్మలు కూడా డ్యాన్స్ చేస్తూ ఏజ్ ఇజ్ జస్ట్ ఏ నంబర్ అంటూ నిరూపిస్తున్నారు. వీరిలో ఒకరు డ్యాన్సింగ్ దాదిగా పేరొందిన రవి బాల శర్మ. 63 ఏళ్ల యవసులోనూ తనదైన స్టైల్లో డ్యాన్స్ చేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. చదవండి: చీరకట్టు ‘ప్రియుడు’.. ఇది ఏ ఫ్యాషనో తెలుసా? డాన్సింగ్ దాది మరోసారి తన డ్యాన్స్ వీడియోతో నెటిజన్లను అలరించారు. 2012లో వచ్చిన శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలోని నవ్రాయ్ మాఝీకి పాటకు ఎంతో ఉల్లాసంగా డ్యాన్స్ చేశారు. చీర కట్టులో అందంగా ముస్తాబై పర్ఫెక్ట్ స్పెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్‌తో చించేసింది. ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో శ్రీదేవి లోటును తీర్చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. రవి బాల శర్మ డ్యాన్స్ మూమెంట్స్‌కి ఎప్పటిలాగే నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘సూపర్ స్టెప్పులతో శ్రీదేవిని దించేసింది. అద్భుతమైన డ్యాన్స్.. అంటూ పొగిడేస్తున్నారు. చదవండి: లాహోర్ రోడ్లపై పరుగెత్తిన నిప్పుకోడి.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by Ravi Bala Sharma (@ravi.bala.sharma) -
వయసు వందకు పైనే.. ‘ఔరా’ అనిపిస్తున్న బామ్మలు
నేటి ఉరుకులు, పరుగుల జీవితం.. ఆహారపు అలవాట్ల నేపథ్యంలో మనషులు నలభై ఏళ్లు దాటితే అనేక రోగాలతో సతమతమవుతున్నారు. 60 ఏళ్లు దాటి ఆరోగ్యంగా ఉండటం అంటే అతిశయోక్తి అన్న మాదిరిగా మారింది. కొందరు మహిళలు వృద్ధాప్యంలోనూ ఎంతో చురుకుగా ఉంటూ ఔరా.. అనిపిస్తున్నారు. నిత్యం వ్యవసాయ పనులు, ఇంట్లో పనులు చేస్తూ కుటుంబీకులకు ఆసరాగా ఉంటున్నారు. పాతకాలం ఆహారమైన గట్కా, సంకటి, అంబలి ఎంతో బలవర్ధకమైన ఆహారం అని చెబుతున్నారు. సాక్షి, వికారాబాద్: పైన చిత్రంలో పనిచేస్తున్న వృద్ధురాలిది బొంరాస్‌పేట మండలం చౌదర్పల్లి. ఆమె పేరు సాయమ్మ (103). వందేళ్లు దాటినా ఇప్పటికీ తాను పొలం పనుల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు తెలిపింది. తనకు ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పింది. చదవండి: సున్నాతో సున్నం! ఇదేం బాదుడు బాబోయ్.. రెండో చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు కీరిబాయి(92), గ్రామం పోల్కంపల్లి తండా. ప్రస్తుతం ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉంది. వందేళ్లు సమీపిస్తున్నా నిత్యం తన పనులు తాను చేసుకుంటూ పొలం పనులు కూడా చేస్తూ కుటుంబీకులకు ఆసరాగా ఉంటోంది. -
కోడలే సూత్రధారి..! ఆస్తికోసం ప్రియుడితో కలిసి
సాక్షి, సూర్యాపేట (నల్లగొండ): సూర్యాపేట మండలం కుసుమవారిగూడెంలో వెలుగుచూసిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం కోడలే ప్రియుడితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం సీఐ బి.విఠల్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. కుసుమవారిగూడెం గ్రామానికి చెందిన కుసుమ లలిత అలియాస్ లలితమ్మకు ఇద్దరు కుమార్తెలు వెన్న చంద్రకళ, ముప్పని సూర్యకళ, కుమారుడు మధుసూదన్‌రెడ్డి సంతానం. వివాహ సమయంలో ఒక్కో కుమార్తెకు కట్నం కింద రెండెకరాల భూమి ఇచ్చారు. మిగిలిన 3.24 గుంటల వ్యవసాయ భూమి లలితమ్మ భర్త వీరారెడ్డి పేరుపై ఉంది. రెండేళ్ల క్రితం లలితమ్మ భర్త వీరారెడ్డి అనారోగ్యంతో మృతిచెందాడు. వీరారెడ్డి పేరిట ఉన్న భూమిని కుమారుడు మధుసూదన్‌రెడ్డి సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 3.24గుంటల భూమి కోసం మధుసూదన్‌రెడ్డి తన భార్యతో కలిసి సూర్యాపేట పట్టణంలో కిరాణ షాపు నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా మధుసూదన్‌రెడ్డికి మూర్చ రోగం ఉండడంతో అప్పుడప్పుడు కిందపడిపోతుంటాడు. విజయలక్ష్మి కొన్నేళ్లుగా వ్యవసాయ భూమి విషయంలో అత్తతో తరచుగా ఘర్షణ పడేది. అత్త వద్ద ఉన్న నగదుతో పాటు భూమిలో పండుతున్న పంటను బిడ్డలకు పెడుతుందని అత్తపై కోపం పెంచుకుంది. గ్రామంలో ఉన్న 3.24 గుంటల వ్యవసాయ భూమిని తనభర్త పేరుపై మార్చాలని గ్రామానికి వచ్చినప్పుడుల్లా కోడలు విజయలక్ష్మి అత్త లలితమ్మతో గొడవ పడుతుండేది. దీంతో అత్తను చంపి భూమిని కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు తమకు మూడుసంవత్సరాలుగా కూలి పనులకు వచ్చే పెన్‌పహాడ్ మండలం అనాజిపురం గ్రామానికి చెందిన నూకల సైదులు సహాయంతో విజయలక్ష్మి తన అత్త లలితమ్మను హత్య చేయించింది. తనకేమీ తెలియదన్నట్లుగా.. ఆస్తి కోసం కోడలే ప్రియుడితో గ్రామంలోని ఒంటరిగా ఉండే కుసుమ లలితమ్మ ఈనెల 9వ తేదీన ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉంది. తోడి కోడలు గమనించి కుమారుడు మధుసూదన్‌రెడ్డి, కోడల విజయలక్ష్మిలకు సమాచారం చేరవేసింది. కోడలు విజయలక్ష్మి అత్త హత్య విషయం తనకేమి తెలియనట్లుగా నటిస్తూ వచ్చింది. ఈనెల 10న ఇంట్లో పనిచేసే నూకల సైదులుపై అనుమానం వచ్చిన పోలీసులు అనాజిపురం గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. సైదులును లోతుగా విచారించగా.. కుసుమ లలితమ్మ కోడలు విజయలక్ష్మి తమ అత్తను హత్య చేయాలని చెప్పడంతోనే తాను కత్తితో దాడిచేసి చంపినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. వెంటనే సూర్యాపేట పట్టణంలో నివాసముంటున్న కోడలు విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. సైదులు వద్ద ఉన్న ముంజకత్తి, రెండు తులాల బంగారు గొలుసు, ఇత్తడి గాజులు, సెల్‌ఫోన్, ఎక్సెల్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. కే సును ఛేదించిన రూరల్ పోలీసులను సీఐ విఠల్‌రెడ్డి అభినందించారు. సమావేశంలో ఎస్ఐ లవకుమార్, ఐడీ పార్టీ సిబ్బంది కల్యాణి, లింగనాయక్, డి.మరేష్, బాబు, రాంబాబు, గుర్వయ్య పాల్గొన్నారు. -
పింఛన్ కోసం వెళ్తూ వృద్ధురాలు మృతి
-
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి
గీసుకొండ : అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి చెం దిన సంఘటన మండలంలోని ఎలుకుర్తి హవేలి గ్రామంలో ఆది వారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎలుకుర్తిహవేలి గ్రామానికి చెందిన బొల్లం సాంబలక్ష్మి (70), మల్ల య్య దంపతులకు ఇద్దరు కుమారులు కుమారస్వామి, రవీందర్ ఉన్నారు. ఇం దులో చిన్న కుమారుడు రవీందర్ పోలీస్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ హన్మకొండలో నివాసముంటున్నారు. కాగా, మల్లయ్య తన భార్య తో కొద్ది రోజులుగా గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో చిన్న కుమారుడు రవీందర్ తల్లిని హన్మకొండలోని తన నివాసానికి ఇటీవల తీసుకుని వెళ్లాడు. అయితే సాంబలక్ష్మిని తన వద్దకు పంపించాలని తండ్రి మల్లయ్య గొడవ చేస్తుండడంతో రవీందర్ పది రోజుల క్రితం ఆమెను ఎలుకుర్తిహవేలి గ్రామానికి పంపించారు. ఈ క్రమంలో ఇంటికి చేరిన సాంబ లక్ష్మిని.. మల్లయ్య, అత డి పెద్ద కుమారుడు కలిసి చం పారని చిన్న కుమారుడు రవీందర్ ఫిర్యాదు చేసినట్లు పో లీసులు తెలిపారు. కాగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
గీసుకొండ : మండలంలోని వరంగల్ – నర్సంపేట రహదారిపై మంగళవారం రాత్రి కారు ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ సంఘటన దస్రుతండా వద్ద చోటుచేసుకుంది. నందనాయక్ తండా శివారు దస్రు తండాకు చెందిన మూడు జాంకీ(70), ఆమె భర్త దేస్లా, కోడలు వరంగల్‌కు వెళ్లి రాత్రి 7.40 గంటలకు దస్రు తండా వద్ద బస్సు దిగారు. తండాలోకి వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా నర్సంపేట వైపు నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న కారు జాంకీని ఢీకొట్టింది. దీంతో ఆమె ప్రాణాలు విడిచింది. -
మద్యం మత్తులో వృద్ధురాలిపై లైంగిక దాడి
పాకపూడి(బాలాయపల్లి): మద్యం మత్తులో 65 ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన పాకపూడిలో గురువారం రాత్రి జరిగింది. పాకపూడికి చెందిన ఓ వృద్ధురాలు ఊరి చివర ఒంటరిగా నివాసం ఉంటోంది. గురువారం రాత్రి గ్రామానికి చెందిన పాల్చూరు రమణయ్య అల్లుడు సుబ్బరామయ్య మద్యం సేవించి ఒంటరిగా ఉన్న వృద్దురాలి ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలతో చుట్టుపక్కల వారు సుబ్బరామయ్యను పట్టుకుని దేహశుద్ధి చే యగా తప్పించుకుని పరారయ్యాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా వృద్ధురాలిని చికిత్స నిమిత్తం వెంకటగిరి ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పింఛన్లు రావనే బెంగతో ఇద్దరు మృతి
కడెం: తమకు పింఛన్ రాదనే బెంగతో ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు వృద్ధులు ప్రాణాలు వదిలారు. కడెం మండలం మున్యాల గ్రామంలోని తండాకు చెందిన బుక్యా బామ్ని(71)కి ఏళ్లుగా పింఛన్ వస్తోంది. ఇటీవల కొత్త ప్రభుత్వం వృద్ధుల పింఛన్ కోసం రూపొందించిన జాబితాలో తన పేరు లేదని తెలుసుకోని తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో మంగళవారం రాత్రి హైబీపీ వచ్చింది. కుటుంబీకులు బుధవారం కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్తుంగానే మరణించింది. అలాగే చెన్నూర్ మండలంలోని బుట్టాపూరు గ్రామ పంచాయతీలోని చెన్నూర్ గ్రామానికి చెందిన తొడసం లచ్చూబాయి(75) మంగళవారం బుట్టాపూరు గ్రామ పంచాయితీ కార్యాలయం వద్దకు వెళ్లి జాబితాలో తన పేరు లేదని తెలుసుకుంది. దీంతో ఏడ్చుకుంటూ ఇంటిదాకా వెళ్లింది. రాత్రంతా ఏడ్చిఏడ్చి పడుకుంది. బుధవారం ఉదయం చూడగా, చనిపోయి ఉంది.