కొందరూ వయసులో వృద్ధులుగా ఉన్నప్పటికీ పనులు మాత్రం యువకుల కంటే మిన్నగా ఉంటాయి. వృద్ధులమన్నా భావనే లేశమంత లేకుండా భలే చాకచక్యంగా అసాధ్యమైన పనులు చేసి ఔరా! అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందిన వారే తమిళనాడుకు చెందిన 89 ఏళ్ల బామ్మ. రెస్ట్ తీసుకునే వయసులో పంచాయతీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ..అధికారుల చేత శభాష్! అనిపించుకుంటున్నారు.
వివరాల్లోకెళ్తే..తమిళనాడుకి చెందిన 89 ఏళ్ల వీరమ్మాళ్ స్ఫూర్తిదాయకమైన మహిళ. ఆమె స్థైర్యం, దృఢ సంకల్పం ప్రజలనే కాదు అధికారులను విస్మయానికి గురిచేసింది. అత్యంత వృద్ధురాలైన పంచాయతీ ప్రెసిడెంట్ తనదైన ముద్ర వేసింది. పెదాలపై చెరగని చిరునవ్వు, హద్దుల్లేని ఉత్సాహం అందర్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఏం చేయలేనంటూ వణుకుతూ మూలన కూర్చొనే వయసులో.. ఎంతో ఉత్సహాంగా అరిట్టపట్టి పంచాయతీ ఎలక్షన్‌లో పోటీ చేసి ప్రెసిడెంట్‌గా గెలవడమే కాగా అందరూ మెచ్చుకునేలా బాధ్యతలను నిర్వర్తించి శభాష్ అనిపించుకుంటోంది.
మిల్లెట్స్ వంటి సంప్రదాయ భోజనం, వ్యవసాయ క్షేత్రంలో రోజంతా పనిచేయడం అదే తన ఫిట్‌నెస్ రహస్యం అని చెబుతోంది వీరమ్మాళ్. వీరమ్మాళ్ నాయకత్వంలో అరిట్టపట్టి మధురై జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందడం విశేషం. ఈ విషయాన్ని ఇండియన్ అడ్మిన్‌స్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఆన్‌లైన్ వేదికగా పంచుకుంటూ నెట్టింట ఆమె ఫోటోని, వీడియోని షేర్ చేసింది. దీంతో నెటిజన్లు 'సాధారణ జీవన విధానం ఎల్లప్పుడూ ఉత్తమమైందే'! అని ఒకరు, ఆ ఏజ్‌లో కూడా లీడర్‌గా ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నందుకు ఆమెకు అవార్డు ఇవ్వాలి అని మరోకరూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
Veerammal Amma, popularly known as "Arittapatti Paati' the 89 years old Panchayat President of Arittapatti Panchayat is truly an inspiring woman. Fit as a fiddle she is the oldest Panchayat President in TN. Her infectious smile & unbridled enthusiasm is so heatwarming. When I… pic.twitter.com/ol7M2tpqIr
— Supriya Sahu IAS (@supriyasahuias) August 30, 2023
(చదవండి: ఇండియన్ బ్యాలెరినా! బ్యాలె డ్యాన్స్‌లో రాణిస్తున్న హైదరాబాదీ!)
Comments
Please login to add a commentAdd a comment