కడెం: తమకు పింఛన్ రాదనే బెంగతో ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు వృద్ధులు ప్రాణాలు వదిలారు. కడెం మండలం మున్యాల గ్రామంలోని తండాకు చెందిన బుక్యా బామ్ని(71)కి ఏళ్లుగా పింఛన్ వస్తోంది. ఇటీవల కొత్త ప్రభుత్వం వృద్ధుల పింఛన్ కోసం రూపొందించిన జాబితాలో తన పేరు లేదని తెలుసుకోని తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో మంగళవారం రాత్రి హైబీపీ వచ్చింది. కుటుంబీకులు బుధవారం కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్తుంగానే మరణించింది.
అలాగే చెన్నూర్ మండలంలోని బుట్టాపూరు గ్రామ పంచాయతీలోని చెన్నూర్ గ్రామానికి చెందిన తొడసం లచ్చూబాయి(75) మంగళవారం బుట్టాపూరు గ్రామ పంచాయితీ కార్యాలయం వద్దకు వెళ్లి జాబితాలో తన పేరు లేదని తెలుసుకుంది. దీంతో ఏడ్చుకుంటూ ఇంటిదాకా వెళ్లింది. రాత్రంతా ఏడ్చిఏడ్చి పడుకుంది. బుధవారం ఉదయం చూడగా, చనిపోయి ఉంది.