నేటి ఉరుకులు, పరుగుల జీవితం.. ఆహారపు అలవాట్ల నేపథ్యంలో మనషులు నలభై ఏళ్లు దాటితే అనేక రోగాలతో సతమతమవుతున్నారు. 60 ఏళ్లు దాటి ఆరోగ్యంగా ఉండటం అంటే అతిశయోక్తి అన్న మాదిరిగా మారింది. కొందరు మహిళలు వృద్ధాప్యంలోనూ ఎంతో చురుకుగా ఉంటూ ఔరా.. అనిపిస్తున్నారు. నిత్యం వ్యవసాయ పనులు, ఇంట్లో పనులు చేస్తూ కుటుంబీకులకు ఆసరాగా ఉంటున్నారు. పాతకాలం ఆహారమైన గట్కా, సంకటి, అంబలి ఎంతో బలవర్ధకమైన ఆహారం అని చెబుతున్నారు.
సాక్షి, వికారాబాద్: పైన చిత్రంలో పనిచేస్తున్న వృద్ధురాలిది బొంరాస్‌పేట మండలం చౌదర్‌పల్లి. ఆమె పేరు సాయమ్మ (103). వందేళ్లు దాటినా ఇప్పటికీ తాను పొలం పనుల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు తెలిపింది. తనకు ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పింది.
చదవండి: సున్నాతో సున్నం! ఇదేం బాదుడు బాబోయ్..
రెండో చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు కీరిబాయి(92), గ్రామం పోల్కంపల్లి తండా. ప్రస్తుతం ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉంది. వందేళ్లు సమీపిస్తున్నా నిత్యం తన పనులు తాను చేసుకుంటూ పొలం పనులు కూడా చేస్తూ కుటుంబీకులకు ఆసరాగా ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment