బుక్కరాయసముద్రం(శింగనమల): బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లిలో బోయ శీను(46) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టడంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు.
బుక్కరాయసముద్రం(శింగనమల): బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లిలో బోయ శీను(46) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టడంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు. కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు విచారణలో ఉంది.
మల్లాపురంలో వివాహిత...
కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని మల్లాపురంలో చిరంజీవి భార్య లక్ష్మీ(23) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పుట్టింటికి వెళ్తానని భర్తను అడగ్గా.. అందుకు అతను అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకున్నట్లు వివరించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదని సమాచారం.