దొంగతనం నింద మోపారని.. | Young man committed suicide in Nalgonda | Sakshi
Sakshi News home page

దొంగతనం నింద మోపారని..

Published Sun, Oct 9 2016 12:00 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Young man committed suicide in Nalgonda

చేయని దొంగతనానికి తనపై నింద మోపారని మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం ధర్మారం గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన డి. శ్రీను(25) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పదిహేను రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన యాదగిరి ఇంట్లో రూ. 30 వేలు చోరీకి గురయ్యాయి. ఈ దొంగ తనం శ్రీను చేసాడని యాదగిరి ఆరోపించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన అతని బంధువులు మృతదేహంతో యాదగిరి ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement