![Brother Died Accidentally After Seeing Sister Death In Nalgonda District - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/19/SANDHYA.jpg.webp?itok=5lcMAE3P)
సంధ్య
మునుగోడు: ఆత్మహత్యకు పాల్పడ్డ చెల్లెలు మృతదేహం చూసేందుకు వచ్చి ప్రమాదవశాత్తూ సోద రుడు మృత్యువాత పడిన ఘటన నల్లగొండ జిల్లా లో చోటుచేసుకుంది. మునుగోడు మండలం ఊ కొండి గ్రామానికి చెందిన గీత కార్మికుడు దొడ్డి కేశవులుకు సాయికుమార్ (19), సంధ్య(18) సంతానం. ఆర్థిక ఇబ్బందులతో 16ఏళ్ల క్రితం కేశవులు భా ర్య ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు సాయికుమార్ ఉపాధి కోసం చెన్నై వలస వెళ్లాడు.
తల్లి ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి అమ్మమ్మ ఇంటివద్ద పెరిగిన కుమార్తె సంధ్య ఈ మధ్యనే తిరిగి వచ్చి తండ్రి వద్దే ఉంటోంది. కుటుంబ ఆర్థిక పరి స్థితి బాగాలేదనే మనస్తాపంతో సంధ్య శనివారం ఇంట్లో తండ్రి లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. చెల్లెలి ఆత్మహత్య విషయం తెలుసుకున్న సాయికుమార్ శని వారం రాత్రి చెన్నై నుంచి బయలుదేరి నల్లగొండకువచ్చాడు. అయితే, ఆమె మృతదేహానికి పోస్టుమార్టం ఆలస్యం కావ డంతో దూర ప్రయా ణం చేసి అలసిపోయిన అతను ఆదివారం మ ధ్యాహ్నం నల్లగొండ ఆస్పత్రి ఎదుట ఓ ట్రాక్టర్ షో రూం ఎదుట పార్కింగ్ చేసిన లారీ కింద నిద్ర పో యాడు.
పోస్టుమార్టం పూర్తయిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సంధ్య మృతదేహాన్ని స్వగ్రామం ఊకొండికి తీసుకెళ్లారు. లారీకింద గాఢ నిద్రలో ఉన్న సాయికుమార్‌ను కుటుంబ సభ్యులతో పాటు లారీడ్రైవర్ కూడా గమ నించలేదు. సాయంత్రం సమయంలో డ్రైవర్ లారీ ని ముందుకు కదిలించడంతో అతడి శరీరంపై వా హన చక్రాలు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆస్పత్రిలోకి తీసుకెళ్లగా అప్ప టికే మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. కా గా, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.
Comments
Please login to add a commentAdd a comment