brother sister
-
అన్నా చెల్లెలి అనురాగం.. చెల్లిపై ఉప్పోంగిన ఆప్యాయతతో..
-
Rahul Gandhi: అన్నాచెల్లెలి అనురాగం
సృష్టిలో బంధాలు వేటికవే ప్రత్యేకం. అందునా అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇంకా ప్రత్యేకం. ఒకవైపు అన్న రాజకీయాల్లో భాగంగా విరామం లేకుండా భారత్ జోడో పాదయాత్ర చేపట్టి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. మరోవైపు ఆ సోదరి పార్టీలో క్రియాశీలక వ్యవహారాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక ఈ ఇద్దరూ ఒకచోట చేరారు. అలిసి పోయిన అన్న రాహుల్ గాంధీతో సరదాగా సంభాషించింది సోదరి ప్రియాంక గాంధీ వాద్రా. ఉప్పోంగిన ఆప్యాయతతో సోదరి మెడ చుట్టూ చేతులేసి.. ప్రేమతో ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టారాయన. తన జీవితంలో తన అన్న రాహుల్ బెస్ట్ ఫ్రెండ్ అని ఆమె గతంలోనే ప్రకటించుకున్నారు. ఇక రాహుల్ సైతం సోదరి విషయంలో అన్నగా ఏనాడూ తన బాధ్యతలను విస్మరించబోనని ప్రకటించుకున్నారు. ఈ అన్నాచెల్లెల అనుబంధం చిన్నప్పటి నుంచి ధృడంగా ఉంటోంది. యూపీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా.. ఒకే వేదికపై వీళ్లిద్దరూ కూర్చని సరదాగా ముచ్చటించుకున్నారు. అన్న ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడంతో ప్రియాంక నవ్వు ఆపుకోలేకపోయింది. ఆ ప్రత్యేక క్షణాలు కెమెరా కంటికి చిక్కాయి. ❤️❤️ pic.twitter.com/9MIQKMIdAQ — Congress (@INCIndia) January 3, 2023 వారిద్దరి ఆప్యాయత, అనురాగాన్ని తెలిపే ఈ సన్నివేశానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల నాటికి పార్టీని మళ్లీ ఉత్సాహ పరిచే లక్ష్యంతో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేపట్టింది. ప్రస్తుతం యూపీలో కొనసాగుతున్న ఈ యాత్ర.. నెలాఖరులో జమ్మూ కశ్మీర్లో చివరి దశకు చేరుకోనుంది. -
సోదరి వెంటే సోదరుడు..
మునుగోడు: ఆత్మహత్యకు పాల్పడ్డ చెల్లెలు మృతదేహం చూసేందుకు వచ్చి ప్రమాదవశాత్తూ సోద రుడు మృత్యువాత పడిన ఘటన నల్లగొండ జిల్లా లో చోటుచేసుకుంది. మునుగోడు మండలం ఊ కొండి గ్రామానికి చెందిన గీత కార్మికుడు దొడ్డి కేశవులుకు సాయికుమార్ (19), సంధ్య(18) సంతానం. ఆర్థిక ఇబ్బందులతో 16ఏళ్ల క్రితం కేశవులు భా ర్య ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు సాయికుమార్ ఉపాధి కోసం చెన్నై వలస వెళ్లాడు. తల్లి ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి అమ్మమ్మ ఇంటివద్ద పెరిగిన కుమార్తె సంధ్య ఈ మధ్యనే తిరిగి వచ్చి తండ్రి వద్దే ఉంటోంది. కుటుంబ ఆర్థిక పరి స్థితి బాగాలేదనే మనస్తాపంతో సంధ్య శనివారం ఇంట్లో తండ్రి లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. చెల్లెలి ఆత్మహత్య విషయం తెలుసుకున్న సాయికుమార్ శని వారం రాత్రి చెన్నై నుంచి బయలుదేరి నల్లగొండకువచ్చాడు. అయితే, ఆమె మృతదేహానికి పోస్టుమార్టం ఆలస్యం కావ డంతో దూర ప్రయా ణం చేసి అలసిపోయిన అతను ఆదివారం మ ధ్యాహ్నం నల్లగొండ ఆస్పత్రి ఎదుట ఓ ట్రాక్టర్ షో రూం ఎదుట పార్కింగ్ చేసిన లారీ కింద నిద్ర పో యాడు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సంధ్య మృతదేహాన్ని స్వగ్రామం ఊకొండికి తీసుకెళ్లారు. లారీకింద గాఢ నిద్రలో ఉన్న సాయికుమార్‌ను కుటుంబ సభ్యులతో పాటు లారీడ్రైవర్ కూడా గమ నించలేదు. సాయంత్రం సమయంలో డ్రైవర్ లారీ ని ముందుకు కదిలించడంతో అతడి శరీరంపై వా హన చక్రాలు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆస్పత్రిలోకి తీసుకెళ్లగా అప్ప టికే మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. కా గా, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. -
కాంగ్రెస్ అన్నాచెల్లెళ్ల పార్టీ
ద్వారక: కాంగ్రెస్ కేవలం అన్నాచెల్లెళ్ల పార్టీగా మిగిలిపోయిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. అసలు దేశంలో బీజేపీ మినహా జాతీయ పార్టీలేవీ లేవన్నారు. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలున్న గుజరాత్లో ద్వారక నుంచి పోరుబందర్ దాకా బీజేపీ రెండో విడత గుజరాత్ గౌరవ్‌యాత్రను బుధవారం ఆయన ప్రారంభించారు. ‘‘దేశం పేరిట కేవలం ఓ వంశాన్ని ప్రమోట్ చేయడం, ఓ కుటుంబానికి సేవ చేయడమే కాంగ్రెస్ నేతల ఏకసూత్ర కార్యక్రమంగా మారింది. ఇక టీఆర్ఎస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, అకాలీదళ్, జేఎంఎం, పీడీపీ సహా ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. నమ్మిన సిద్ధాంతానికి నిలువెల్లా కట్టుబడ్డ ఏకైక జాతీయ పార్టీ దేశంలో బీజేపీ మాత్రమే’’ అని ఈ సందర్భంగా అన్నారు. షా ఓ జూనియర్: నితీశ్ పట్నా: కేవలం 20 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన వారి విమర్శలను పట్టించుకోనని కేంద్ర హోం మంత్రి అమిత్ షానుద్దేశిస్తూ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. సామాజిక ఉద్యమ నేత జయప్రకాశ్ నారాయణ్ సిద్ధాంతాలు ఆచరిస్తానని చెప్పుకునే నితీశ్.. అధికారం కోసం కాంగ్రెస్ ఒళ్లో కూర్చున్నారంటూ అమిత్ చేసిన ఆరోపణలపై బుధవారం ఆయన ఈ మేరకు స్పందించారు. -
జైలర్ అన్నయ్య
అన్నయ్య పిలిస్తే పలకాలి.పిలవాలంటేనే భయపడే స్థాయిలో ఉండకూడదు.అన్నయ్య తాను రాఖీ కట్టించుకోవాలి.అంతేతప్ప, చెల్లెలి చుట్టూ బంధనాలు చుట్టేయకూడదు.అన్నయ్య స్నేహితుడిలా ఉండాలి. చండశాసనుడిలా కాదు.అన్నయ్య అన్నయ్యలా ఉండాలి. జైలర్‌లా కాదు.. హిట్లర్‌లా కాదు. స్కూలు విడిచారు.ఆడపిల్లలంతా గుంపులుగా నడుస్తున్నారు.స్కూల్ బస్‌లో పక్కసీట్లో కూచున్న అమ్మాయి బ్యాగ్ ఒళ్లో పెట్టుకుంటూ శ్వేతను అడిగింది– ‘ఏంటి డల్లుగా ఉన్నావ్’‘ఏం లేదు’‘ఉన్నావ్. చాలా రోజులుగా గమనిస్తున్నాను. ఏం ప్రాబ్లమ్?’‘ఏం లేదు’‘కొంప దీసి ఎవరైనా వేధిస్తున్నారా?’శ్వేత తన ఫ్రెండ్ వైపు దీర్ఘంగా చూసి అంది–‘అవును’‘ఏమిటే... మనం చదువుతున్నది నైన్త్ క్లాస్. ఇప్పటి నుంచి హరాస్మెంటా. ఎవడు వాడు?’‘మా అన్న’‘శ్వేతా’... కాలేజ్ నుంచి వచ్చిన వరుణ్ చెల్లెల్ని పెద్దగా పిలిచాడు.శ్వేత పరిగెత్తింది.‘ఏంటన్నయ్యా’‘రా... కాసేపు షటిల్ ఆడదాం. నీకు షటిల్ అంటే ఇష్టంగా’‘ఇష్టమే. కాని కాసేపు టీవీ చూస్తా అన్నయ్యా’‘వద్దు. టీవీ అంతా చెత్త. ఆ చెత్త చూస్తావా నువ్వు. నేనొప్పుకోను’‘ఫోన్లో ఏదైనా గేమ్ ఆడుకుంటా’‘ఫోన్లో నెట్ ఉంటుంది. ఏది పడితే అది బ్రౌజ్ చేయకూడదు. డేంజర్. నీకు ముందే చెప్పాను. నీకు నేను అన్నయ్యనే కాదు. మంచి ఫ్రెండ్‌ని కూడా. నువ్వు నాతో ఆడుకో చాలు’‘నీతో ఎందుకన్నయ్యా ఆడుకోవడం. నేను నా ఫ్రెండ్స్‌తో ఆడుకుంటా. నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లు’‘కుదర్దు. నువ్వు నాతోనే ఉండాలి. ఇదిగో నీ కోసం ఫైవ్‌స్టార్ చాక్లెట్ తెచ్చాను. తీసుకో’‘వద్దు’‘తీసుకో’‘వద్దన్నానా’ఫట్. చెంప పగిలింది.శ్వేత ఆ చాక్లెట్‌ను తీసుకుని తన రూమ్‌లోకి పరిగెత్తింది.రామారావు అదో రకమైన ఇంటి పెద్ద. అతడు బయట్ హెడ్ క్లర్కేగాని ఇంట్లో మేనేజర్ కంటే స్ట్రిక్ట్‌గా ఉంటాడు. ముఖ్యంగా ఆడవాళ్లతో. ఆడవాళ్లు ఎందుచేతనో చెడిపోతారని, వాళ్లని ఎప్పుడూ కట్టడిలో ఉంచాలని, వారిని బయటకు తిరగనివ్వరాదని, వారికి ఏం కావాల్సి వచ్చినా తన తోడులో ఉంటూ పొందాలని ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. భార్యను ఒక్కదాన్నే ఎక్కడికీ పంపడు. కూతురి పరిస్థితీ అంతే. కాని తను, కొడుకు మాత్రం ఫ్రీగా ఉంటారు. వాణ్ణి స్కూటర్ ఎక్కించుకుని బయటకు తిప్పుతాడు. అప్పుడప్పుడు సినిమాలకు తీసుకెళతాడు. డబ్బు ఇస్తాడు. ఫ్రెండ్స్ దగ్గరకు వెళతానంటే వెళ్లనిస్తాడు. కాని కూతురు మాత్రం స్కూలు, ఇల్లు తప్ప ఇంకోటి చూడకూడదు.అంతే కాదు పదే పదే ‘అరేయ్ చెల్లెలి బాధ్యత నీదే. అసలే రోజులు బాగలేవు’ అని చెప్తూ ఉంటాడు.వరుణ్‌కు చెల్లెలంటే చాలా ఇష్టం.కాని రామారావు ట్రయినింగ్ వల్ల అది పెత్తనపు ఇష్టంగా ఉన్మాద ఇష్టంగా మారింది.చెల్లెలి మీద ఎప్పుడూ నిఘా పెట్టి ఉంటాడు. ఆ అమ్మాయి వేసుకునే బట్టలు, తినే తిండి, ఎవరితో మాట్లాడుతోందీ అన్నీ పట్టించుకుంటాడు. ఆదివారం పూట స్నేహితురాలి ఇంటికి వెళతానన్నా కూడా తనే వెళ్లి అక్కడ ఉన్నది స్నేహితురాలేనని కన్ఫమ్ చేసుకొని దింపి వస్తాడు.అంత వరకూ సరే కాని అతడు తన జీవితాన్ని కూడా చెల్లెలికి అనువుగా మార్చుకున్నాడు. చెల్లెలు ఒక్కతే అయిపోతుంది కనుక చెల్లెలి కోసం టైమ్ స్పెండ్ చేయడం మొదలెట్టాడు. చెల్లెలితో ఆడటం, కబుర్లు చెప్పడం, హోమ్ వర్క్ చేయించడం... ఇరవై నాలుగ్గంటలూ అన్నయ్య పక్కనే పడగ నీడలా ఉంటే శ్వేతకు ఊపిరి ఆడటం లేదు.‘అమ్మా... అన్నయ్య నన్ను విసిగిస్తున్నాడు’ అని తల్లితో చెప్పుకుంది.‘వాడంతేనమ్మా. వాడికి నువ్వంటే ప్రేమ’ అంది తల్లి.‘నాన్నా... అన్నయ్య నన్ను ప్రతిదానికీ క్వశ్చన్ చేస్తున్నాడు’ అంది తండ్రితో.‘మంచిదే కదమ్మా. వాడు నీ అన్నయ్య. నీ విషయాలన్నీ వాడే కదా చూసుకోవాలి’రాత్రయితే దుప్పటి నిండుగా కప్పుకుని ఎవరి కంటా పడకుండా ఏడవడం ఒక్కటే శ్వేత చేయగలుగుతోంది.ఒక రోజు వరుణ్ ఫ్రెండ్ ఇంటి కొచ్చాడు.శ్వేత కూడా ఉంది.ముగ్గురూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఆ ఫ్రెండ్ వెళుతూ వెళుతూ ‘నీ చెల్లెలు క్యూట్‌గా ఉంది. జాగ్రత్తరోయ్. తర్వాత ఏమనుకున్నా లాభం లేదు’ అనేసి పోయాడు. అతడు తన పెంపకానికి తగినట్టు ఏదో వాగేసి వెళ్లుండొచ్చు. కాని వరుణ్‌కు పెద్ద అనుమానం వచ్చేసింది. అంటే తన చెల్లెలి వాలకం దారి తప్పేటట్టు ఉందా.. ఆ అమ్మాయి ఏదైనా తప్పు చేయనుందా.. ఆల్రెడీ చేసేసిందా.. అది వీడు గనగ చూశాడా.. అని లక్ష సందేహాలతో చెల్లెల్ని విసిగించడం మొదలెట్టాడు.‘చెప్పు... ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ అయ్యారా’‘బయట ఎవరితోనైనా మాట్లాడుతున్నావా’‘నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేశావో’...ఈ టార్చర్ తట్టుకోలేకపోయింది శ్వేత. పద్నాలుగేళ్ల అమ్మాయి. ఎంతని భరిస్తుంది. ఏం చేయాలో తోచక కిచెన్‌లోకి వెళ్లి కత్తితో చేయి కోసుకుంది. అప్పటికి కాని ఏదో సమస్య ఉన్నట్టు తల్లిదండ్రులకు అర్థం కాలేదు. అందరూ కలిసి కౌన్సిలింగ్‌కు వచ్చారు.‘ఏం బాబూ... నీ చెల్లెలు మీ అమ్మ గర్భంలో తొమ్మిది నెలలు ఉంది కదా అప్పుడు నువ్వే మీ చెల్లెలికి కాపలా కాశావా?’ అన్నాడు సైకియాట్రిస్ట్ వరుణ్‌తో.వరుణ్ తల దించుకున్నాడు. ‘స్కూల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉంటుంది కదా. అప్పుడు కూడా నువ్వే లోపల ఉండి కాపలా కాస్తున్నావా?’ అడిగాడు మళ్లీ.వరుణ్ ఏమీ బదులు పలకలేదు.‘మగాళ్లు కాపలా కాస్తేనే మగాళ్లు తోడుగా ఉంటేనే మగాళ్లు అనుక్షణం కనిపెట్టుకొని ఉంటేనే ఆడవాళ్లు అన్ని పనులు చేయగలరనే మైండ్ సెట్ మీలో ఉండటం తప్పు రామారావు గారూ. దానినే మీ అబ్బాయి అంది పుచ్చుకున్నాడు. అతనికి ఆడవాళ్ల మీద పూర్తి స్థాయి అపనమ్మకాన్ని మీరు నూరిపోశారు. ఆ జాడ్యం అతడిలో ఎంతవరకు వెళ్లిందంటే మీ అమ్మాయి పీల్చే గాలిని కూడా అతడు పరీక్షించాలనుకుంటున్నాడు’ అన్నాడు సైకియాట్రిస్ట్.‘స్త్రీలను గౌరవించడం ముందు నేర్చుకోండి మీ ఇద్దరూ. వారు బుద్ధి, జ్ఞానం ఉన్న మనుషులే అని, వారు తమకు ఏది మంచో ఏది చెడ్డో ఎంచుకునే తెలివి ఉన్న మనుషులే అని గ్రహించండి ముందు. నడిస్తే ఎక్కడ పడిపోతారో అన్న అనుమానంతో అసలు మీరు నడవకుండా కళ్లకే గంతలు కట్టేస్తున్నారు. మీ వైఫ్‌కు తప్పదు. ఎంతో కొంత అడ్జస్ట్ అవుతారు. కాని ఎదగాల్సిన ఆడపిల్ల. మీరిలా టార్చర్ పెడితే తట్టుకోగలదా’ అన్నాడు సైకియాట్రిస్ట్.‘శ్వేతను మంచి చదువు చదివిస్తున్నారు. కాని మంచి పెంపకం అనుకుని జైలు పెంపకం ఇస్తున్నారు. ఆ అమ్మాయిని కొంచెం వదిలిపెట్టండి. ఆమె తనకు తానుగా మంచి చెడులను తెలుసుకోనివ్వండి. ఆమెకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీరిద్దరూ ఉంటారన్న ధైర్యం ఇచ్చి ఆమెను ముందుకు అడుగులు వేయనీయండి. తన గుంపుతో కలవని జంతువు కూడా మూగదైపోతుంది. సాటి వయసున్న అబ్బాయిలతో అమ్మాయిలతో కొద్ది స్నేహం, సఖ్యత లేకపోతే మీ అమ్మాయి ఏం కావాలి?’ అన్నాడాయన.‘చూడు బాబు. నీ చెల్లెలు నీతో టైమ్ స్పెండ్ చేస్తే బాగుండు అన్న విధంగా ఉండు. నీతోనే టైమ్ స్పెండ్ చేయాలా అని విసుక్కునేలా ఉండకు’ అన్నాడు.తండ్రీ కొడుకులకు సమస్య కొద్దో గొప్పో బుర్రకెక్కింది.మరో వారం తర్వాత స్కూలు విడిచినప్పుడు చెంగు చెంగున ఎగురుతూ హుషారుగా సీట్లో కూలబడిన అమ్మాయి శ్వేత అనే మీరు గమనించి తీరుతారు. కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
షాకింగ్.. అన్నాచెల్లెల పెళ్లి!
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో స్థిరనివాసం ఏర్పచుకునేందుకు అన్నాచెల్లెలు ఆడిన పెళ్లి నాటకం బట్టబయలైంది. నకిలీ పత్రాలతో భార్యాభర్తలుగా చెలామణి అవుతున్న వీరి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పేరుతో ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఇదంతా చేశారని వీరి బంధువు ఒకామె పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడిందని ఆస్ట్రేలియా వార్తా సంస్థ ఎస్బీఎస్ డాట్‌కామ్ వెల్లడించింది. ఫిర్యాదు ఆధారంగా బథిండా జిల్లాలోని బాలియన్‌వాలా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దరితో పాటు వారి ఆరుగురు కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్ పేర్కొన్నట్టు బాలియన్‌వాలా ఎస్ఐ జైసింగ్ తెలిపారు. ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం ఉంటున్న నిందితుడు తన సోదరిని కూడా అక్కడికి తీసుకెళ్లేందుకు ఈ నాటకం ఆడాడు. ముందుగా తన సమీప బంధువు పేరుతో నకిలీ పత్రాలు సృష్టించాడు. వీటితో గరుద్వారా నుంచి వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకుని, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేయించారని జైసింగ్ వివరించారు. 2012లో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిందితులిద్దరూ ఆస్ట్రేలియాలోనే ఉన్నారని, తాము దర్యాప్తు పూర్తి చేశామని ఎస్ఐ తెలిపారు. ఈ కేసు తమను షాక్‌కు గురి చేసిందని పోలీసులు తెలిపారు. వీసా కోసం ఎన్నో రకాల మోసాలకు పాల్పడుతుండడం తాము చూశామని, అన్నాచెల్లెలు పెళ్లి చేసుకున్నట్టుగా నటించడం ఇప్పటివరకు చూడలేదని ఆశ్చర్యపోయారు. నకిలీ పెళ్లి పత్రాలతో తమ దేశానికి రావాలని చూస్తే కఠిన దండన తప్పదని భారతీయులకు గతేడాది ఆస్త్రేలియా హెచ్చరిక జారీ చేసింది. 32 ఏళ్ల భారతీయుడొకరు నిరుడు నవంబర్‌లో నకిలీ వివాహ పత్రాలతో దొరికిపోవడంతో ఈమేరకు వార్నింగ్ ఇచ్చింది. ఫోర్జరీ సర్టిఫికెట్లు సమర్పించారన్న కారణంతో 164 మందికి భాగస్వామ్య వీసాలు నిరాకరించినట్టు ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ తెలిపింది. -
కాలువలో మునిగి అక్క తమ్ముడు మృతి
-
బాసర వెళ్లొస్తూ మృత్యుఒడికి
♦ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అన్నాచెల్లెళ్లు ♦ రాయిలాపూర్‌లో విషాదం ♦ ఇద్దరు పిల్లల మృత్యువాతతో కుటుంబానికి తీరని శోకం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం రామాయంపేట మండలం రాయిలాపూర్‌లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఇద్దరు రాయిలాపూర్ వాసులు. మృతులిద్దరూ అన్నాచెల్లెలు కావడం.. బాసర ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరగడంతో ఆ కుటుంబం కన్నీరమున్నీరైంది. పేదరికంలోనూ పిల్లలిద్దరినీ బాగా చది విస్తున్నానని, ఇద్దరినీ ఒకేసారి కోల్పోయానంటూ తండ్రి నర్సింలు రోదించడం కంటతడి పెట్టించింది. రామాయంపేట: దైవ దర్శనానికి వె ళ్లిన అన్నాచెల్లెళ్లను మృత్యువు కబళించడంతో మండలంలోని రాయిలాపూర్ గ్రామంలో విషాదం అలుముకుంది. ఉన్న ఇద్దరు పిల్లలు ప్రమాదం రూపంలో మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే... రాయిలాపూర్ గ్రామానికి చెందిన తాడెం నర్సింలు- మంజుల దంపతుల సంతానం నితీష్ (17), కూతురు రుచిత (14). నితీష్ హైదరాబాద్ ఎన్ఆర్ఐ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుండగా.. కూతురు రుచిత గ్రామంలోనే చదివి తొమ్మిదో తరగతి పాసైంది. వేసవి సెలవుల్లో గడిపేందుకు తల్లి మంజుల పిల్లలిద్దరిని తీసుకొని ఐదు రోజుల క్రితం నిజామాబాద్‌లో ఉంటున్న తన అక్క వద్దకు వెళ్లింది. నితీష్‌తోపాటు రుచిత తమ బంధువులతో కలిసి బుధవారం ఫుణ్యక్షేత్రమైన బాసర ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న ఆటోను నవీపేట మండల శివారులో భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా, మృతుల్లో రుచిత, నితీష్ ఉన్నారు. కాగా విషయం తెలియగానే తండ్రి నర్సింలు గుండెలు బాదుకుంటూ విలపించడంతో గ్రామస్తులు అతన్ని సముదాయించారు. పేదరికంతో ఇబ్బందులపాలవుతున్నా నర్సింలు తన పిల్లలను మంచిగా చదివిస్తున్నాడని, ఉన్న ఇద్దరు పిల్లలు ఒకేసారి మృత్యువాత పడ్డారని, గామస్తులు సైతం కన్నీరుమున్నీరయ్యారు. తమ స్నేహితుడు నితీశ్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలియడంతో అతని స్నేహితులు తీవ్రంగా విలపించారు. అందరితో తలలో నాలుకలా ఉండే అన్నాచెల్లెళ్లు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామంలో ఎక్కడ చూసినా ఇదే విషయమై చర్చించుకుంటున్నారు.