తమిళసినిమా: తమిళనాడులోని ఉత్తర చెన్నై బాక్సింగ్‌కు ప్రసిద్ధి. ఈ క్రీడను ప్రభుత్వం నిషేధించినా అనధికారకంగా ఇప్పటికీ జరుగుతుంటాయంటారు. ఉత్తర చెన్నై బాక్సింగ్ క్రీడ నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కాయి. తాజాగా అలాంటి 1970–71లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రం వాండు. అప్పట్లో స్ట్రీట్ ఫైటే ఆ తరువాత బాక్సింగ్‌గా మారిందంటారు. అలా హీరో తండ్రి, విలన్ తండ్రికి మధ్య జరిగిన పోరాటంలో హీరో తండ్రి గాయాల పాలవుతాడు. ఆ తరువాత విలన్ కొడుకు బాక్సింగ్‌లో శిక్షణ పొందుతాడు.
అదే చోటుకు హీరో బాక్సింగ్ నేర్చుకోవడానికి వస్తాడు. దీంతో వారిద్దరి మధ్య పగ మొదలవుతుంది. అది ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం వాండు అని దర్శకుడు వాసన్ షాజీ తెలిపారు. దర్శకుడు సెల్వరాఘవన్ వద్ద సహాయదర్శకుడిగా పని చేసిన ఈయన ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఎంఎం.పవర్ సినీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఇందులో నవ నటుడు శీను కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. నటి షికా నాయకిగానూ, తడయారతాక్క, కొంబన్ చిత్రాల ఫేమ్ మహాగాంధీ, మెడ్రాస్ చిత్రం ఫేమ్ రామ, తెరి చిత్రం ఫేమ్ సాయిదీనా, రోమియోజూలియట్ భువనేశ్వరి, 2.ఓ చిత్రం ఫేమ్ రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ నేశన్ సంగీతాన్ని, రమేశ్, వి.మహేంద్రన్ ద్వయం ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment