Selvaragavan
-
దీపావళికి వచ్చేస్తాం
‘‘నా గత 35 సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. సెల్వరాఘవన్ కథ చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. సాయిపల్లవి పాత్రకీ ప్రాధాన్యత ఉంటుంది’’ అని హీరో సూర్య అన్నారు. సూర్య, ‘ఫిదా’ ఫేమ్ సాయిపల్లవి జంటగా ‘7/జి బృందావన కాలనీ, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఫేమ్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇటీవల ‘ఖాకి’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్. ప్రకాశ్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం ప్రారంభమైంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సూర్య, సాయిపల్లవి, సెల్వ రాఘవన్ కాంబినేషన్లో వస్తున్న మంచి సినిమా ఇది. సూర్య కెరీర్లో ఓ పెద్ద హిట్‌గా నిలిచేలా సెల్వరాఘవన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జనవరి 18న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, దీపావళికి సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సూర్యలాంటి వెర్సటైల్ హీరోతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ కథకు తను మాత్రమే కరెక్ట్ అని సినిమా చూశాక మీకే (ప్రేక్షకులు) తెలుస్తుంది’’ అన్నారు సెల్వరాఘవన్. ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్ విజయన్. -
ఆ కష్టమేంటో నాకు తెలుసు!
తమిళ సినిమా: ఇవాళ తమిళ సినిమా చాలా వరకు యథార్థాలను వెతుక్కుంటూ సక్సెస్‌కు దగ్గరవుతోందనే చెప్పాలి. చరిత్రను తవ్వుకుంటూ అందులో ఆసక్తికర సంఘటనలకు చిత్ర రూపం ఇస్తోంది.అలా తెరకెక్కుతున్న తాజా చిత్రం వాండు. వివిధ విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి గుర్తింపు పొందిన మహాగాంధీ, షికా, రిషీరిత్విక్, రమ, సాయ్దీనా,భువనశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఎంఎం.పవర్ సినీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. వాసన్ షాజీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన సెల్వరాఘవన్‌తో పాటు పలువురు దర్శకుల వద్ద సహాయదర్శకుడిగా పని చేశారు. ఏఆర్.నేశన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న దర్శక నటుడు సముద్రకని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి సినీ నేపథ్యంలేకుండా చిత్రాన్ని రూపొందించడం ఎంత కష్టమో తనకు బాగా తెలుసన్నారు. వాండు చిత్రాన్ని దర్శకుడు వాసన్ షాజీతో పాటు మొత్తం యూనిట్ ఎంతో శ్రమించి తెరకెక్కించారని అన్నారు.ఉత్తర చెన్నై భూమి పుత్రులని పేర్కొన్నారు. వారి ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే గోలీసోడా చిత్రం గుర్తుకొస్తోందన్నారు. వాండు చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు సముద్రకని పేర్కొన్నారు. అవకాశాలు మనల్సి వెతుక్కుంటూరావు. మనమే వాటిని కల్పించుకోవాలి అన్న భావనతో చేసిన చిత్రం వాండు అని, ఇది ఉత్తర చెన్నై ప్రజల గౌరవాన్ని పెంచే చిత్రంగా ఉంటుందని దర్శకుడు వాసన్ షాజీ అన్నారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ అందరూ పాల్గొన్నారు. -
బాక్సింగ్ నేపథ్యంగా మరో చిత్రం
తమిళసినిమా: తమిళనాడులోని ఉత్తర చెన్నై బాక్సింగ్‌కు ప్రసిద్ధి. ఈ క్రీడను ప్రభుత్వం నిషేధించినా అనధికారకంగా ఇప్పటికీ జరుగుతుంటాయంటారు. ఉత్తర చెన్నై బాక్సింగ్ క్రీడ నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కాయి. తాజాగా అలాంటి 1970–71లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రం వాండు. అప్పట్లో స్ట్రీట్ ఫైటే ఆ తరువాత బాక్సింగ్గా మారిందంటారు. అలా హీరో తండ్రి, విలన్ తండ్రికి మధ్య జరిగిన పోరాటంలో హీరో తండ్రి గాయాల పాలవుతాడు. ఆ తరువాత విలన్ కొడుకు బాక్సింగ్‌లో శిక్షణ పొందుతాడు. అదే చోటుకు హీరో బాక్సింగ్ నేర్చుకోవడానికి వస్తాడు. దీంతో వారిద్దరి మధ్య పగ మొదలవుతుంది. అది ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం వాండు అని దర్శకుడు వాసన్ షాజీ తెలిపారు. దర్శకుడు సెల్వరాఘవన్ వద్ద సహాయదర్శకుడిగా పని చేసిన ఈయన ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎంఎం.పవర్ సినీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఇందులో నవ నటుడు శీను కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. నటి షికా నాయకిగానూ, తడయారతాక్క, కొంబన్ చిత్రాల ఫేమ్ మహాగాంధీ, మెడ్రాస్ చిత్రం ఫేమ్ రామ, తెరి చిత్రం ఫేమ్ సాయిదీనా, రోమియోజూలియట్ భువనేశ్వరి, 2.ఓ చిత్రం ఫేమ్ రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ నేశన్ సంగీతాన్ని, రమేశ్, వి.మహేంద్రన్ ద్వయం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
సంతానంతో సాయిపల్లవి రొమాన్స్?
తలచినదే జరిగినదా దైవం ఎందులకు.. అన్న జీవిత సత్యాన్ని ఒక పాటలో చెప్పారో మహాకవి. అలాగే చేతి వరకూ వచ్చి నోటి దాకా రాలేదంటారు. నటి సాయి పల్లవి ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే కోలీవుడ్‌లో ఎదుర్కొంటున్నారు. మలయాళ చిత్రం ప్రేమమ్ ఘన విజయం అందులో నటించిన కథానాయికలకు పెద్ద వరంగా మారిందనే చెప్పాలి. అందులో ముఖ్యంగా మలర్ పాత్రలో టీచర్‌గా నటించిన సాయి పల్లవి నటనకు ప్రశంసలు వర్షం కురిపించారు. దీంతో సహజంగానే ఆ చిత్ర హీరోయిన్లు ముగ్గురిపై కోలీవుడ్ దృష్టి పడింది. అయితే సాయిపల్లవి మినహా ఇతర భామలు మంజిమామోహన్, మడోనా సెబాస్టియన్లకు ఇప్పటికే కోలీవుడ్‌లో అవకాశాలు వరుస కట్టాయి. ఇక సాయి పల్లవికి ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారి పోయింది. కార్తీకి జంటగా కాట్రు వెలియిడై చిత్రంలో నటించాల్సింది. చివరి క్షణంలో బాలీవుడ్ భామ అతిథిరావు వచ్చి చేరింది. మణిరత్నం చిత్రం మిస్ అవ్వడం సాయిపల్లవికి పెద్ద దెబ్బే. చాలా నిరాశకు గురైనట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో అవకాశం తలుపు తట్టిందన్నది కోలీవుడ్ టాక్. సంచలన దర్శకుడుగా పేరొందిన సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానంతో రొమాన్స్ చేయడానికి సాయి పల్లవి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్జే.సూర్య హీరోగా నెంజం మరప్పదిల్లై చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సెల్వరాఘవన్ తదుపరి సంతానం హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో నాయకిగా సాయి పల్లవిని నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అయితే ఈ సారి అయినా సాయి పల్లవికి కోలీవుడ్‌కు లైన్ క్లియర్ అవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. సంతానం ప్రస్తుతం వీటీవీ ప్రొడక్షన్స్ పతాకంపై సేతురామన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం కూడా ఆయన తాజా చిత్రానికి సమాంతరంగా చిత్రీకరణ జరుపుకోనున్నట్లు సమాచారం.