దీపావళికి వచ్చేస్తాం | Suriya 36th film directed by Selvaraghavan to begin shoot in January 2018 | Sakshi
Sakshi News home page

దీపావళికి వచ్చేస్తాం

Published Tue, Jan 2 2018 1:14 AM | Last Updated on Tue, Jan 2 2018 1:14 AM

Suriya 36th film directed by Selvaraghavan to begin shoot in January 2018 - Sakshi

‘‘నా గత 35 సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. సెల్వరాఘవన్‌ కథ చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. సాయిపల్లవి పాత్రకీ ప్రాధాన్యత ఉంటుంది’’ అని హీరో సూర్య అన్నారు. సూర్య, ‘ఫిదా’ ఫేమ్‌ సాయిపల్లవి జంటగా ‘7/జి బృందావన కాలనీ, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఫేమ్‌ సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇటీవల ‘ఖాకి’ వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌పై ఎస్‌.ఆర్‌.ప్రభు, ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం ప్రారంభమైంది.

నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సూర్య, సాయిపల్లవి, సెల్వ రాఘవన్‌ కాంబినేషన్‌లో వస్తున్న మంచి సినిమా ఇది. సూర్య కెరీర్‌లో ఓ పెద్ద హిట్‌గా నిలిచేలా సెల్వరాఘవన్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జనవరి 18న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి, దీపావళికి సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సూర్యలాంటి వెర్సటైల్‌ హీరోతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ కథకు తను మాత్రమే కరెక్ట్‌ అని సినిమా చూశాక మీకే (ప్రేక్షకులు) తెలుస్తుంది’’ అన్నారు సెల్వరాఘవన్‌. ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్‌ విజయన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement